9, ఏప్రిల్ 2014, బుధవారం

ప్రజాస్వామ్యం నుదిటి మీద సిరా గుర్తై మెరవండి




ఎన్నో పార్టీ ల వాళ్ళు మన ముంగిటికి  వస్తారు ---రానివ్వండి 

అబ్బీ అక్కా చెల్లీ తమ్ముడూ  అని పలకరిస్తారు ------- పలకరించ  నివ్వండి 

ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తారు ----ఒలకబోయనివ్వండి 

మాయమాటలు కబుర్లు చెబుతారు --- చెప్పనివ్వండి 

మాకే  ఓటు వెయ్యండని అడుగుతారు --------- అడగనివ్వండి 

అవినీతి సొమ్ము పంచడానికి బయటకు తీస్తారు--- తీయనివ్వండి 

ఓటుకు నోటు  చీర జాకెట్  ఇస్తామంటారు  -- ఇవ్వ నీయండి 

ఇవన్నీ తీసుకొని మాకే మీ వోటని  ఒట్టేయించు కుంటారు ---- వేయించుకొనివ్వండి 

అందంతా ఇండైరక్టుగా  ప్రజల సొమ్మే కాబట్టి నిర్మొహమాటంగా  తీసుకోండి 


వోటింగ్ రోజు పోలింగ్  బూతు కు వెళ్ళండి 

వోటేసేముందు ఒక్కసారి ప్రలోభాలన్ని పక్కన పెట్టండి 

అమాయకంగా నమ్మి దెబ్బతినే  సులభ శలభాల వలె  ఉండకుండా 

ఐదేళ్ళు ఎవరికి వోటేస్తే ప్రజలు బాగుపడతారో  హృదయం తో ఆలోచించండి 

వారి గుర్తుకే  ఓటు వెయ్యండి 

ప్రజలు తెలువి తక్కువ వాళ్ళు కాదు  ఆలోచనా పరులు అని రుజువు చెయ్యండి 

ఓటు ను నోటు తో  కొనాలనుకొనే   జిత్తులమారులకు  బుద్ది  చెప్పండి 

ప్రజాస్వామ్యం నుదిటి మీద సిరా గుర్తై   మెరవండి 

2, జనవరి 2014, గురువారం

సిన్మా కి సీక్వెల్



పాండవులు పాండవులు  "తుమ్మెదా"  అనే సిన్మా హిట్టయితే   

ఆ తరువాత వచ్చే సిన్మా పేరు 

కౌరవులు  కౌరవులు  "దగ్గెదా "

3, నవంబర్ 2013, ఆదివారం

జీవిత సత్యం




చిన్నప్పుడు -------------మిల్క్ బాటిల్ 

మిడిల్ ఏజ్  లో ---------------బీర్ బాటిల్ 

ఓల్డ్ ఏజ్ లో --------------  సెలైన్ బాటిల్ 


మోరల్ :వయసు ఏదైనా  బాటిల్  అనేది కామన్ 


2, నవంబర్ 2013, శనివారం

దీపావళి శుభాకాంక్షలు

అందరికీ  

దీపాల పాలవెల్లి 

వెలుగు దివ్వెల రంగవల్లి 

 దీపావళి శుభాకాంక్షలు 

"ఆడు మగాడ్రా బుజ్జీ "


"ఆడు మగాడ్రా బుజ్జీ   "


రోహిత్ శర్మ  గురించి రేపు పేపర్లో వచ్చే మాట 

బౌండరీల బాంబులు  సిక్షర్ల  చిచ్చు బుడ్లు 

దీపావళి కళ  అంతా బెంగుళూరు లోనే 

సందడంతా టీమిండియా  దే 

17, ఆగస్టు 2013, శనివారం

బలుపు అండ్ పులుపు ఓ నిమ్మకాయ్ స్టొరీ

బలుపు   అండ్ పులుపు 

ఓ నిమ్మకాయ్ స్టొరీ 


బలుపు లో రవి తేజ డైలాగ్  వినే ఉంటారు

అదే ఒక నిమ్మకాయ్ చెబితే  ఇలా ఉంటుంది



నా ఆకులకు వాసనెక్కువ

నా తొనలకు  నీరెక్కువ

నా కొమ్మలకు  ముల్లులెక్కువ

టోటల్ గా ఈ బాడి కి పులుపెక్కువ




26, నవంబర్ 2012, సోమవారం

CRICKET MATH ల లో పోలిక

CRICKET MATH ల లో పోలిక 

SOUTH AFRICA  VS  ASUSTRALIA   AND   INDIA  VS ENGLAND 


ఒక్క ముక్క లో చెప్పాలంటే 

   FIGHT BACK  అక్కడ 

FOOT BACK  ఇక్కడ  

పోరాట పటిమ లో  మనకు వాళ్లకు ఎంత తేడా 


తాము తీసుకున్న గోతి లో తామే పడడం  అంటే  ఇదే మరి