26, నవంబర్ 2012, సోమవారం

CRICKET MATH ల లో పోలిక

CRICKET MATH ల లో పోలిక 

SOUTH AFRICA  VS  ASUSTRALIA   AND   INDIA  VS ENGLAND 


ఒక్క ముక్క లో చెప్పాలంటే 

   FIGHT BACK  అక్కడ 

FOOT BACK  ఇక్కడ  

పోరాట పటిమ లో  మనకు వాళ్లకు ఎంత తేడా 


తాము తీసుకున్న గోతి లో తామే పడడం  అంటే  ఇదే మరి 

4, నవంబర్ 2012, ఆదివారం

కలి కాలం



కలి కాలం 


కూతురు,,, నాన్న  మాట్లాడుకుంటున్నారు 

కూతురు చేతిలో ఉత్తరం ఉంది  

ఏంటది అడిగాడు నాన్న

నేను పక్కింటి అంకుల్ తో వెళ్లి పోతున్నాను  నా గురించి వెతకొద్దు 
చదివింది కూతురు 

సంతోషం తల్లీ  నాకు  ఫిజికల్ గా  ఆర్థికంగా  

శ్రమ తగ్గించావ్ అన్నాడు ఫాదర్ 


కానీ [ నీళ్ళు నములుతూ ] చెప్పింది డాటర్ 

 ఇది నేను రాసింది కాదు  అమ్మ హ్యాండ్ రైటింగ్  ఇది !!!!!!!!!!!!!!!!

ది సైలెంట్ మ్యాన్


ది సైలెంట్ మ్యాన్ 


మన ప్రధాని మన్ మోహన్ సింగ్  ఒక సారి పంటి నొప్పి వస్తే 

వెళ్లి డెంటిస్ట్ ని కలిసాడు 

అక్కడ డెంటిస్ట్ అన్నాడు ;  సింగ్ జీ   కనీసం ఇక్కడైనా ఒకసారి నోరు 

తెరవండి   

పళ్ళు examine చెయ్యాలి 

1, సెప్టెంబర్ 2012, శనివారం

ANDROID IN TELUGU NAMES



   అందరూ  ఈ మద్య  స్మార్ట్ ఫోన్స్  మరియు టాబ్లెట్ PC    లలో ఉపయోగించే 
  
ANDROID   software ల  పేర్ల గురించి చదివే / వినే ఉంటారు 


ఎలాగంటే


Android Jelly BEAN    జెల్లీ బీన్ 

Android icecram సంద్విచ్   ఐస్ క్రీం సాండ్ విచ్ 

ANdroid  honeycomb    హనీ కాంబ్   లాంటి పేర్లన్న మాట          



అదే ఒక తెలుగు ఇంజినీర్  ANDROID COMPANY  లో పని చేస్తూ 

  కని పెడితే ఎలా పేర్లు పెడతాడో చూడండి 


ANDROID     టొమాటో కిచప్  VERSION 2.6.L

ANDROID  మ్యాంగో  పికిల్   వెర్షన్  4.0.V

ANDROID  సమోసా బజ్జి   VERSION  3.2.O

ANDROID  ఇడ్లీ వడ    VERSION 8.2,P

ANDROID ఉప్మా పెసరట్టు   VERSION 5.2.I

 ANDROID పెరుగు వడ  VERSION 4.K.G

ANDROID నల్ల కారం  VERSION 3.1.W

ANDROID కాకినాడ కాజా  VERSION 3.9.F

ANDROID  బందరు లడ్డు  VERSION 5.L.2

  


8, ఆగస్టు 2012, బుధవారం

రాజకీయ ఈగ

 


మినిస్టర్    పదవి రాక చిరంజీవి ఆక్రోశ పడుతూ 
 దానికి అడ్డం పడుతున్నాడని 
CM కిరణ్ మీద కోపం పెంచుకుంటూ  కలలో పాడుడుకున్న ఈగ పాట 


చిర్రు చిర్రు చిర్రు 
పదవి రాక నేను చిర్రు బుర్రు 

నీ పదవి పెద్దదవని
నా రేంజి చిన్న దవని 
నిన్ను దింప కుంటే  కాదులే  మెగాన్ని

నేను చెయ్యాల్సిన పనులు కొన్నున్నై 
అందులో 

ఒకటి ---- నిన్ను దింపడం 
రెండు --నిన్ను దింపడం 
మూడు --------నిన్ను దింపడం 
నాలుగు -----------నిన్ను దింపడం 
ఇదు --------నిన్ను దింపడం 
ఆరు --------నిన్ను దింపడం 
ఏడు --------నిన్ను దింపడం 
ఎనిమిది --------నిన్ను దింపడం 
తొమ్మిది --------నిన్ను దింపడం 
పది  ----CM పదవి నేను ఎక్కడం 

నిన్ను తరిమి తరిమి  పొడిచి పొడిచి 
తిట్టి తిట్టి  రచ్చ రచ్చ చేసి  నిన్ను గబ్బు లేపి 
నిన్ను దింపడం 


5, ఆగస్టు 2012, ఆదివారం

తగవుకు వేళాయరా


సుబ్బారావు  హోటల్ కెళ్ళాడు 
సర్వ రావు ని పిల్చి  ఏమోయ్  వేడి వేడి బిరియాని  తీసుకురా 
ఒకనితో బాగా గొడవపడాలి అన్నాడు 

సర్వారావు బిరియాని తెచ్చి  ఉత్సాహంగా ఎవరితో సార్ అన్నాడు 

చెబుతా  అని బిరియాని లాగించి  ఈసారి కోడి పలావ్ తేవోయ్ 
ఒకనితో బాగా తగువాడాలి  అన్నాడు 

సర్వర్ గబా గబా తెచ్చి మరింత ఆసక్తి గా అడిగాడు  ఎవరితో సార్ అని 

చెబుతా చెబుతా ఈసారి  ఓ ఫుల్ బాటిల్ విస్కీ తే 
 తగువు కు బాగా ప్రిపేర్  కావాలి  అన్నాడు 

సర్వర్ కు సస్పెన్స్ తో బిపి  పెరిగిపోతోంది  
ఇంకా తగువాడేసుకోవడానికి అవతలి పార్టీ కనబడలేదే అని 

ఇంకా పట్టలేక మళ్లీ సుబ్బారావు ని అడిగాడు ఫైటింగ్  ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అని  


ఇప్పుడు బిల్ అడిగితే  నీతోనే  కూల్ గా చెప్పాడు సుబ్బారావు 

సిన్మా టైటిల్స్ ---రాజకీయ గోల


సిన్మా టైటిల్స్ ---రాజకీయ గోల 

ఊ కొడతారా  ఉలిక్కి పడతారా 

సెప్టెంబర్ లోగా తెలంగాణా వస్తుంది  
నాకు కేంద్రం నుండి సిగ్నల్స్ వస్తున్నాయి   ---KCR


స్వామి గౌడ్ కి తెరాస పోలిట్ బ్యూరో  లో సబ్యత్వం  మరియు వచ్చే తెలంగాణా రాష్ట్రము లో 
కాబినెట్ మినిస్టర్  పోస్ట్ ఆఫర్ చేసిన కెసిఆర్ ---సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 


ఇందిరమ్మ బాట పేరు తో రాష్ట్రమంతా  చెడ  తిరుగుతున్న CM కిరణ్ కుమార్ రెడ్డి ---జులాయి 

ఈ సారి  తక్కువ వర్ష పాతం -మొహం చాటేసిన ఋతుపవనాలు 
రైతులకు కష్ట కాలమే --వాతావరణ శాఖ -------దేవుడు చేసిన మనుషులు 

ధిల్లీ లో  వారం రోజులుగా బొత్స మకాం--- సీనియర్ కాంగ్రెస్స్ నేతలతో  మంతనాలు 
కెమెరామన్ గంగ తో  రాంబాబు 

గాంధీ భవన్ లో YSR ఫోటో లేదు  KVP ఆవేదన --మంత్రి రఘువీర రెడ్డి  కన్నీళ్లు 
ఇద్దరిమీద మండిపడ్డ హనుమంత రావు  -------------రచ్చ 

1, జులై 2012, ఆదివారం

అయ్యారే --మగబుద్ది




ఒక సారి ఒక AIRLINE సంస్త  
తరచుగా విదేశాలకు వెళ్ళే బిజినెస్ పీపుల్ కు 
ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది  

ఫలానా నెలలో 
ఒక టికెట్ కొనండి  మీ భార్యను ఉచితంగా మీ వెంట తీసుకెళ్ళండి అని 
ఆఫర్ సూపర్ హిట్ అయ్యింది  బాగా సేల్స్ పెరిగాయి 

ఆ కృతజ్ఞత తో ఆ ఎయిర్ లైన్స్ సంస్త వారు  
వారి వారి భార్యలకు లెటర్ రాసారు 
మీ అందరికి థాంక్స్ ,,    గత నెల లో వెళ్ళిన  మీ ట్రిప్  ఎలా జరిగింది అని 

అందరినుంచి ఒకటే  ఆన్సర్  ----ఏం ట్రిప్  ,, మేం ట్రిప్పులకు
  వెళ్లి  సంవత్సరం  దాటిందే అని 

పేర్ల తో తికమక



కొన్ని సార్లు పేర్లను తెలుగులో రాసేటప్పుడు FULSTOP లో తేడావస్తే /
 కలిపి చదివితే  ఇలా ఉంటాయి  

T.RAMARAO-- ట్రామా రావు 
KESAVA RAO -- K .శవరావు     
P.RANI --ప్రాణి 
G.RAJANI --గ్రజని 
D.RAMA DEVI  ----డ్రామా దేవి 

సిన్మా డైలాగ్



దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి 
వస్తువుల్ని వాడుకోవడానికి  పుట్టిస్తే 
మనకే ఆ తేడా తెలియక  వాటిని రివర్సు లో  
మనుషుల్ని వాడుకుంటున్నాం  వస్తువుల్ని ప్రేమిస్తున్నాం 

30, జూన్ 2012, శనివారం

పరిష్కారం

డాక్టర్ వెంగలప్ప  house surgeon  
ఒక రోజు హాస్పిటల్ లో నైట్ డ్యూటీ లో ఉన్నాడు   

మద్య రాత్రి నర్సు వచ్చి చెప్పింది 
డాక్టర్  డాక్టర్  ఫిమేల్  వార్డ్ లో  
సూర్యకాంతం  అండ్ చాయాదేవి లాంటి ఇద్దరు పేషెంట్ లు గట్టిగా పోట్లాడుకుంటున్నారు 
మిగతా పేషెంట్ లకు  చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళ వాళ్ళ అని చెప్పింది 

ఇంతకీ ఏంటి గొడవ అడిగాడు ఆవులిస్తూ వెంగలప్ప 

ఒకామె కేమో  ఫాన్ గాలి పడదంట ఆఫ్ చేయమని  గొడవచేస్తోంది
ముక్కులు మూసుకు పోయి చచ్చిపోతాను ఫ్యాన్ వేస్తె అంటోంది 

ఇంకొకామె కేమో  ఫాన్ లేంది నిద్ర రాదట 
వేయక పొతే నిద్ర పట్టక చచ్చి పోతాను అని కేకలు పెడుతోంది  

ఏం చెయ్యమంటారు డాక్టర్ అడిగింది నర్సు 

ఒక నిముషం ఆలోచించి వెంగలప్ప చెప్పాడు 
ముందు ఫాన్ పది నిముషాలు  ఆన్ చెయ్యండి ఒకామె పని క్లోజ్ అవుతుంది 
తరువాత పది నిముషాలు ఆఫ్ చెయ్యండి  ఇంకొకామె పని  కూడా అయిపోతుంది 
ఖేల్ ఖతం దుకాణ బంద్  అని అటు తిరిగి ముసుగు తన్నాడు వెంగలప్ప 

26, మార్చి 2012, సోమవారం

అదే తేడా సార్

టీచర్ : అడవిలో షికారుకి   జూ లో షికారుకి  తేడా ఏంటి 

రాము : జూ లో అయితే  జంతువులు బోను లో ఉంటాయి మనం బయట ఉండి చూస్తాము 
అదే అడవిలో అయితే మనం బోను లో [VAN OR ZEEP ] ఉంటాము ,
జంతువులు బయట ఉంటాయి  అదే తేడా సార్ 

23, మార్చి 2012, శుక్రవారం

నందన నామ ఉగాది

చెరుకు ముక్కల తీపితో 
వేపపువ్వు చేదుతో
కొంచెం పులుపు కొంచెం వగరు కొంచెం కారం 
కల గలిసిన రుచుల సమ్మేళనం తో  

జీవితపు వెలుగు నీడలకు అద్దం పడుతూ 

మామిడాకుల గలగలలతో 
తీపి రాగాల కోయిలమ్మలతో 

తరలి వచ్చింది నందన వసంతం 
ఇక కావాలి అన్ని సౌభాగ్యాలు మీసొంతం 

ఈ నందన నామ ఉగాది 
ఆనంద నందనమై 
అనురాగాల చందనమై 
సిరిసంపదల నిలయమై 
ఆరోగ్య భాగ్యాల మయమై

నిత్యం మీ ఇంట ప్రతి మాసం వసంత మాసమే కావాలని కోరుకుంటూ 

మీకందరికీ  నందన నామ ఉగాది శుభాకాంక్షలు 

మీ జయభారత్ 


15, జనవరి 2012, ఆదివారం

ఎమున్నదక్కో ఎమున్నదక్కా IND VS AUS

 ఎమున్నదక్కో  ఎమున్నదక్కా


ఈ రోజు పెర్త్ లో 
ఆసీస్ చేతి లో మన ఓటమి తర్వాత బ్యాక్ గ్రౌండ్ లో విన్పించిన పాట ఇది 
కొత్త గా క్రికెట్ నేర్చుకునే / చూసే వాళ్లకు తెలిసొచ్చిన కొన్ని నిజాలు 
౧. ఎవరైనా ఫాం లేక ఇబ్బంది పడుతున్న బాట్స్ మెన్  ఉంటె ఇండియా తో ఆడితే ఆ లోపం పోతుంది 

౨. టెస్ట్ క్రికెట్ అంటే ఇంతకూ ముందు ఇదు రోజుల మాచ్ అని అనేవారు  ఇప్పుడు రెండు మహా అయితే మూడు రోజులే 

౪. ఎలా అవుట్ కావాలో మనవాళ్ళు చూపిస్తారు  ఎలా ఆడాలో వాళ్ళు చూపిస్తారు 

మొత్తానికి సిగ్గు లేని తనానికి సింబల్ గా   పౌరుషం లేని పండుటాకులు గా మిగిలి పోయి  సగటు అభిమానికి క్షోభ మిగిలించారు