26, మార్చి 2012, సోమవారం

అదే తేడా సార్

టీచర్ : అడవిలో షికారుకి   జూ లో షికారుకి  తేడా ఏంటి 

రాము : జూ లో అయితే  జంతువులు బోను లో ఉంటాయి మనం బయట ఉండి చూస్తాము 
అదే అడవిలో అయితే మనం బోను లో [VAN OR ZEEP ] ఉంటాము ,
జంతువులు బయట ఉంటాయి  అదే తేడా సార్ 

23, మార్చి 2012, శుక్రవారం

నందన నామ ఉగాది

చెరుకు ముక్కల తీపితో 
వేపపువ్వు చేదుతో
కొంచెం పులుపు కొంచెం వగరు కొంచెం కారం 
కల గలిసిన రుచుల సమ్మేళనం తో  

జీవితపు వెలుగు నీడలకు అద్దం పడుతూ 

మామిడాకుల గలగలలతో 
తీపి రాగాల కోయిలమ్మలతో 

తరలి వచ్చింది నందన వసంతం 
ఇక కావాలి అన్ని సౌభాగ్యాలు మీసొంతం 

ఈ నందన నామ ఉగాది 
ఆనంద నందనమై 
అనురాగాల చందనమై 
సిరిసంపదల నిలయమై 
ఆరోగ్య భాగ్యాల మయమై

నిత్యం మీ ఇంట ప్రతి మాసం వసంత మాసమే కావాలని కోరుకుంటూ 

మీకందరికీ  నందన నామ ఉగాది శుభాకాంక్షలు 

మీ జయభారత్