31, జనవరి 2010, ఆదివారం

JOKES

ముందు చూపు ఉన్న చాదస్తుడు

ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు

తోక ను తొక్కి పోవడానికి వీలుగా నక్క ను ఇంట్లో నే పెంచుకొనేవాడు



ఒక లీడర్ ఎప్పుడు బహిరంగ సభలకు పోయినా వెంట మట్టి కుండలు తీసుకెళ్ళేవాడు

ఓ విలేకరి ఉండబట్ట లేక పి . ఎ ని అడిగాడు ఎందుకండీ అవి అని

ఏం లేదు మా సార్ కి ఏ విషయం చెప్పినా
కుండ ని బద్దలు కొట్టి చెప్పే అలవాటు ఉందిలే అన్నాడు కూల్ గా P .A

27, జనవరి 2010, బుధవారం

ఫోటో కామెంట్


కడివేడంత ఈ గుమ్మడి కత్తి పీట కి లోకువ

చెట్టంత నేనేమో కేంద్రాని కి లోకువ

ప్చ్ ఏం చేస్తాం

21, జనవరి 2010, గురువారం

అగ్ని

సినిమా అగ్ని
సత్యాని కి
న్యాయానికి
ధర్మాని కి
కనిపించే ఆ మూడు సింహాలు గుర్తులైతే
కనిపించని ఆ నాలుగో సింహమేరా ఈ పోలిస్

తెలంగాణా అగ్ని
చంద్రబాబు
చిరంజీవి
సీమంద్ర JAC
కనిపించే ముగ్గరు తెలంగాణా శత్రువులైతే
కనిపించని ఆ నాలుగో శత్రువేరా కాంగ్రెస్ అధిష్టానం

సామోతలు

సామోతలు
కుండ పగిలితే పగిలింది గాని కుక్క బుద్ది తెలిసింది అన్నట్లు

చిదంబరం రెండో ప్రకటన చేస్తే చేసాడు గాని
రాజకీయ పార్టీల అసలు రంగు బయట పడినట్లు


వెంగలప్ప అద్దంకి పోనూ పొయ్యాడు రాను వచ్చాడు అన్నట్లు

కట్ట కట్టుకొని మన నేతలంతా చిదంబరం మీటింగ్ కి
ఢిల్లీ వెళ్లనూ వెళ్ళారు రానూ వచ్చారు అన్నట్లు

joke

తల్లి :రేయ్ నిద్ర పోయింది ఇక చాలు
త్వరగా లేచి రెడీ అవ్వు స్కూల్ కు వెళ్ళాలి

కొడుకు: అబ్బా నే వెళ్ళనే
రోజు వెళ్ళాలంటే బోర్ కొడుతోంది

తల్లి :అలా అంటే ఎలా రా నాన్నా నువ్వు వెళ్లి తీరాలి

కొడుకు :ఉహు నే వెళ్ళాను గాక వెళ్ళను

తల్లి :ఎందుకు వెళ్ళవు ఓ రెండు కారణాలు చెప్పు

కొడుకు :అక్కడి వాతావరణం నాకు నచ్చదు
స్టూడెంట్స్ టీచర్స్ నన్ను సరిగా పట్టించుకోరు
అయినా తప్పని సరిగా వెళ్ళడానికి రెండు కారణాలు నువ్వు చెప్పవే అమ్మా

తల్లి :నువ్వు ఆ స్కూల్ లో పనిచేస్తున్నావు కనుక
పైగా headmaster వి కూడా కనుక

16, జనవరి 2010, శనివారం

ఆకాశ బాట సారికి అనుకోని అడ్డంకి


ఆకాశ బాట సారికి అనుకోని అడ్డంకి
నిప్పుల రాజు ను వెన్నెల రేడు కమ్మేసి న వేళ
నిప్పులు చిమ్మే ప్రచండ భానుడు బంగారు కంకణం గా మారిన వైనం
ఆకాశం లో తళుకు లీనిన అందాల అద్బుతం
మాన వ నేత్రాలకు కనువిందు
సైంటిస్ట్ లకు ఎంతో పసందు

తెలంగాణా STORY---ఒక అమ్మ

ఒక కెసిఆర్
ఒక నిరాహార దీక్ష
ఒక సోనియా
ఒక చిదంబరం
ఒక ప్రకటన తర్వాత దిద్దుబాటు ప్రకటన
ఒక రాజీనామా
ఒక JAC
అందులో లుకలుకలు

అదీ స్టొరీ

ఇంతేరా ఈజీవితం
తిరిగే రంగుల రాట్నము

చిలకమర్తి -తెలంగాణా ఒక చక్కని పాడి ఆవు

భారత ఖండంబు ఒక చక్కని పాడి ఆవు
భారతీయులు లేగదూడలు
తెల్ల వారను గడుసరి గొల్లవారు
పితుకుతున్నారు వాటి మూతులు బిగియగట్టి

ఇది ఒకప్పుడు చిలకమర్తి వారి ఆవేదన

ఇప్పుడు అది ఇలా అయ్యింది

తెలంగాణా ఒక చక్కని పాడి ఆవు
ప్రజలెల్లా నిస్సహాయ లేగ దూడలు
రాజ కీయ నాయకులను గడుసరి గొల్లవారు
లాభాలు పిండు కుంటున్నారు
వారి కళ్ళకు మాయ మాటల గంతలు కట్టి

చివరికి మిగిలేది

నిరుద్యోగ నాయకులకు పదవుల అందలాలు

ప్రజల ఆశలు పాతాళ లోతుల అధోగతి పాలు



గత కొన్ని రోజులుగా రాజకీయ నాయకులు తెలంగాణా పై ఆడుతున్న డ్రామాలను చూసి
వారి చిత్తశుద్ధి పై 100 % అనుమానంతో

14, జనవరి 2010, గురువారం

లోకజ్ఞానం

ప్రపంచం లో లేనిది భారతం లో లేదు
భారతం లో లేనిది ప్రపంచం లేదు

బ్లాగుల్లో లేనిది ప్రపంచం లో లేదు
ప్రపంచం లో లేనిది బ్లాగుల్లో లేదు


ఏ రాయైతేనేం పళ్ళు ఊడ గొ ట్టుకోడానికి

ఏ టీవీ సీరియల్ అయితేనేం తల నొప్పి తెచ్చుకోవడానికి

ఏ JAC అయితేనేం రోశయ్య ను ముప్పు తిప్పలు పెట్టడానికి




వేమన పద్యం

చెప్పులోని రాయి చెవిలోన జోరీగ
కంటి లోని నలుసు కాలిలోని ముళ్ళు
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా
విశ్వదాభి రామా వినుర వేమా

దీన్నే
రోశయ్య పాడితే
రాజీనామాల MLA లు మాట వినని మంత్రులు
రాళ్ళు రువ్వే రాజకీయ JAC రచ్చ రచ్చ చేసే విద్యార్ధి OU JAC
అధిష్టానం అర్థం కాని ప్రకటనల భాద ఇంతింతకాదయా
విశ్వ దాభి రామ వినురవేమా



ప్రపంచ తెలుగు వారందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు






ముంగిట వేసిన ముగ్గులు చూడు ఓ లచ్చ గుమ్మడి
ముత్యాల మురిపాల ముగ్గులు చూడు ఓ లచ్చ గుమ్మడి

ఆరనైదోతనం ఏ ఇంట నుండు
అరుగులరికే వారి అరచేత నుండు
తీరైన సంపద ఎవరింట నుండు
దిన దినము ముగ్గున్న లోగిళ్ళ నుండు


ప్రపంచ తెలుగు వారందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు

12, జనవరి 2010, మంగళవారం

11, జనవరి 2010, సోమవారం

డాక్టర్ గారి పెళ్లి చూపులు

మార్కండేయులు చాలా srtict యంగ్ డాక్టర్
ఒకసారి పెళ్లి చూపులకు వెళ్ళాడు
తతంగం అయ్యింది
పంతులు వచ్చి పిల్ల ఎలా ఉందని డాక్టర్ ని ఒపీనియన్ అడిగాడు
పిల్ల చాలా నీరసంగా రక్త హీనత తో బాధ పడుతోంది
ఈ టానిక్కులు బిళ్ళలు వాడించి మూన్నెల్ల తర్వాత మళ్లీ పిలవండని వెళ్ళిపోయాడు


రోశయ్య ఏక్ నిరంజన్ పాట పాడితే


పవరూ లేదు పనితనము లేదు
మాట విని తోడు వచ్చే మంత్రీ లేడు ఏక్ నిరంజన్

ఆంధ్రా అన్న తిట్టే సీమా నేత తిట్టే
తియ్యకుండా తెలంగాణా తమ్మీ తిట్టే ఏక్ నిరంజన్

అమ్మ పలుకలే సింగూ పలకలే
ధిల్లీ లో ధైర్యం చెప్పే మనిషీ లేడు ఏక్ నిరంజన్

సామోతలు

అదిగో పులి ఇదిగో తోక

అవిగో దాడులు ఇదిగో జగన్ హస్తం


దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయ మన్నాడట ఒకడు

టీవీ చానెల్ లో ఏదో చెత్త ప్రసారమైంది అంటే పద దుకాణాలు కాల్చేద్దాం

అన్నాడంట

9, జనవరి 2010, శనివారం

డప్పు దండోరా

ఇందు మూలముగా యావన్మంది కి తెలియ చేయడ మేమనగా
ఆంధ్ర ప్రదేశం లో ప్రభుత్వం ఉన్నట్టు గాని ముఖ్యమంత్రి మరియు మంత్రులు ఉన్నట్టు గాని

ఎవరైనా నిరూపించ గలిగితే
వారికి బహుమానం గా
తెలంగాణా వస్తుందా లేదా
వస్తే ఎప్పుడు వస్తుంది
హైదరాబాదు ను ఎవరికి ఇస్తారు లాంటి ప్రశ్నలకు
అందరి కంటే ముందుగా జవాబులు చెప్పబడును

నాగం జనార్ధన్ రెడ్డి ఫోటో కామెంట్



బొమ్మ మీద క్లిక్ చేయండి

5, జనవరి 2010, మంగళవారం

కామెంట్ ----గీమేంట్

కామెంట్

క్రిమినల్స్ విషయం లో

చట్టం తన పని తాను చేసుకొని పోతుంది

ఓ పెద్ద మనిషి ఉవాచ



తెలంగాణా విషయం లో

కేంద్రం తన పని తాను చేసుకొని పోతుంది

ఓ తెలంగాణా వాది ఆశావాదం



గీమేంట్

అవును అవి తమ పని తాము " చే " సుకొని పోతూనే ఉంటాయి

ఎదురు చూసే వాళ్ళు పోవాల్సిందే

ఆంధ్రజ్యోతి లో వచ్చిన కార్టూన్స్



ఈ మద్య ఆంధ్రజ్యోతి లో వచ్చిన కార్టూన్స్ బాగున్నాయి కదా


చిత్ర్రాన్ని పెద్దదిగా చూడడానికి దాని మీద క్లిక్ చేయండి

4, జనవరి 2010, సోమవారం

నిరాహార దీక్షలో రకాలు

నిరాహార దీక్షలో రకాలు


గాంధీజీ టైపు

అస్సలేమీ తినకుండా నిజాయితీ గా చెయ్యడం


KCR టైపు

ఒక రోజు చేసి మిగతా అంతా hospital లో చూసుకోవడం


రాజ గోపాల్ టైపు

నాలుగు ఇదు రోజులు చేసి అందరకి కళ్ళు గప్పి పారిపోవడం

నిర్వచనం

నిర్వచనం



ఆమరణ నిరాహార దీక్ష అంటే


రాజ కీయ నాయకు లు చేసే సడన్ డైటింగ్

2012 యుగాంతం--AP


[ఆంధ్రజ్యోతి నుండి]


ఏవండి తెలంగాణా వస్తుందంట కదా నాకు

చిలక జోస్యం లో చెప్పారు


కాదు గ్రేటర్ రాయల సీమ వస్తుందంట నాకు

జాతకం లో చెప్పారు


కానే కాదు

జై ఆంధ్ర ముందుగా ఇస్తారంట నాకు

సోది లో చెప్పింది


ఏం కాదమ్మా గ్రేటర్ హైదరాబాద్ ఇచినాకనే ఏదైనా

నాకు

రాశి ఫలాలు లో అలాగని వచ్చింది


కాదు ఎవరెన్ని చెప్పినా

సమైక్యంద్ర నే ఉంటుంది

నాకు

అంజనం లో కనబడింది



సరేలే నాకూ చెప్పారు

కోయ శాస్త్రం జ్యోతిష్యం లో


ఏమని


ఇవన్ని 2012 dec 21 st తర్వాతే వస్తాయంట

అంత కచ్చితంగా చెప్పారు మరి



మాదే కరెక్ట్ అంటే మాదే కరెక్ట్ అని

అంతా ఇళ్ళకు వెళ్లి పండుకున్నారు


పొద్దున్నే న్యూస్ పేపర్ లో పెద్ద పెద్ద ADDS తో సినిమా పోస్టర్ ఉంది



నే దే చూడండి మీ అభిమాన theaters లో గొప్ప విడుదల



2012 యుగాంతం

2, జనవరి 2010, శనివారం

రోశయ్య ఈయన చాలా మంచోడు టూకీ గా

రోశయ్య :అమ్మ నాన్న పెట్టిన పేరు

ఉక్రోషయ్య :ఎగస్పార్టీ వాళ్ళు పెట్టుకున్న పేరు

ఆక్రోషయ్య :తెలంగాణా వాదులు పిలిచే పేరు

భేషయ్య సమైక్యవాదులు పలికే పేరు

ఆచరించేది : పైన ఆ అమ్మ శాసించాలి కింద ఈ రోశయ్య పాటించాలి

ఏ భాషలో నైనా నచ్చని మాటలు :బంద్ లు రాజీనామాలు JAC లు

ఇష్టమైన పాట : ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా

అన్ని కష్టాల్ని నాకిచ్చి పైన కులుకుతున్నావా


ఇష్టమైన తెలుగు సామెత :తంతే బూరెల బుట్టలో పడ్డాడట వెనకటి కి ఎవరో

ఇంగ్లీష్ లో అయితే :every dog will have its own day


ఇప్పటికీ అర్థం కానిది :ఈ వయసులో కూడా తివారి రాస లీల ల సవారి ఎలా చేసాడబ్బా?

1, జనవరి 2010, శుక్రవారం

WHAT IS NEW YEAR

కొన్నిసార్లు కాలం కఠినం గా అనిపిస్తుంది
ఆ కాఠిన్యానికి కారణం మాత్రం మనమే
మన తప్పోప్పులే అలా అనిపిస్తాయి

కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో ఏమి తెస్తుందో అన్నది ముఖ్యం కాదు
కొత్త సంవత్సరం లో మనం ఎలా ఉండబోతున్నాం ఏమి చేయబోతున్నాం అన్నదే అసలు విషయం

మనల్ని మనం కొత్త సంవత్సరం లో ఎంత కొత్త గా ఉంచుకోబోతున్నాం
మన చుట్టూ ప్రపంచాన్ని ఎంత కొత్తగా ఉంచుతున్నాం అనేది విలువైన ప్రశ్న

HAPPY NEW YEAR 2010 TO ALL FRIENDS

JAYABHARATH