14, నవంబర్ 2010, ఆదివారం

సబ్బు చెప్పే సంగతులు

సబ్బు చెప్పే సంగతులు

మీరో సబ్బు కొన్న్నారనుకోండి ఓ పదిహేనురోజులో లేదా ఇరవై రోజులు వాడకానికి వచ్చిందనుకోండి

చివర్లో మిగిలి పోయే సబ్బు ముక్కను మీరేం చేస్తారు అన్న దాని బట్టి మీ బ్యాక్ గ్రౌండ్ అంచనా వెయ్యచ్చు

సీన్ ఒకటి
చివర్లో మిగిలిన ముక్కను పారవేయ్యలేక అట్లా అని వేళ్ళ సందుల్లో నుంచి మాటి మాటి కి జారి పోతున్న దాంతో సత మత మౌతా
అది పూర్తి గా కనుమరుగయ్యే దాకా వాడే వాళ్ళైతే మీరు బాగా కిందనుంచి పైకి వచ్చిన వాళ్లై ఉంటారు
వీరికి డబ్బు విలువ ,బాగా తెలుసు

సీన్ రెండు
అంతా అయిపోయాక మిగిలిన ముక్కను పార వెయ్య లేక అట్లా అని కొత్తది వాడలేక
మిగిలిన ముక్క ని కొత్త సబ్బు కు వెనకాల అంటించి అది అరిగి పోయేదాకా జాగ్రత్త గా వాడే వాళ్ళు

వీళ్ళు మద్య తరగతి జీవులు పొదుపు గా, జాగ్రత్త గా వస్తువులను వాడుతూ జీవితాన్ని వెళ్లదీసే రకం

సీన్ మూడు
సబ్బు అయిపోతూనే పారవేసి కొత్తది ట్టకీమని ఓపెన్ చేసే రకం
వీళ్ళ దగ్గర డబ్బులు బాగానే ఆడుతూ ఉంటాయి కొంచెం జాలీ టైపు గా చెప్పు కోవచ్చు

ఇదండీ సబ్బు కహాని