27, డిసెంబర్ 2008, శనివారం

సామెత

కందకు లేని దురద కత్తి పీట కెందుకో

చెప్పుదెబ్బ తిన్న బుష్ కు లేని భాధ అమెరికన్ పత్రికలెందుకో

మంచి పాత పాట పల్లవి

పుడమికి గిరి భారమా
గిరికి తరువు భారమా
తరువుకు కాయ భారమా
కనిపెంచే తల్లికి పిల్ల భారమా

కొత్త పదం

మావాడొకడు సరదాగా అన్న మాట

మాములుగా బ్లూ ఫిలిమ్స్ అంటే బూతు సినిమాలు అనే కదా
అందుకనే వాటిని మావాడు పిలిచే పేరు


బ్లూతు ఫిలిం

సామోతలు

నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు ఇంత గాలి వాన నేనెప్పుడు ఎరగనమ్మా అనిందంట

పార్టీ పుట్టి పది వారాలు కాలేదు రెండొందల సీట్లు మావే అన్నాడట

కొత్త సీసాలో పాత సారా
ప్రజారాజ్యం పార్టీలోపాత పార్టీల ఫిరాయింపు దార్లు చేరినట్లు

19, డిసెంబర్ 2008, శుక్రవారం

పాత కు కొత్త సామెత

పాత సామెత
ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టుకున్తామా
కొత్త సామెత
ఉగ్రవాదులు దూరారని తాజ్ హోటల్ ని పడ గొడతామా


మొక్కై వంగనిది మానై వంగుతుందా

కార్య కర్తగా మాట వినని వాడు నాయకుడై వింటాడా


అసలుతో పాటు కొసరు కూడా మాయం

ఎన్నికల్లో ఓడిపోయిన వాడికి డిపాసిట్ కూడా పోయినట్లు


సూది కోసం సోదికి పోతే పాత రంకు బయట పడ్డట్లు
ప్రతిపక్షం మీద సి బి దర్యాప్తు వేస్తే తన పాత కుంభకోణం బయట పడ్డట్లు


అయ్యకు లేక అడుక్కుతింటుంటే కొడుకొచ్చి కోడి కూర కావాలన్నట్లు

లీడర్ కే డిపాసిట్ దక్కక నీరసంగా ఉంటే కార్య కర్త వచ్చి బీరు బిరియాని అడిగినట్లు

18, డిసెంబర్ 2008, గురువారం

కుక్క కాటుకు చెప్పుదెబ్బ

జైది కి జేజేలు
అతను విసిరిన చెప్పు గాలి లోతేలుతూ బుష్ గారి తలపై నుంచి తాకి తాకనట్లు పోతుంటే , దెబ్బకు బుష్ అవాక్కై తలవంచిన తీరూ చూస్తుంటే దృశ్యం చూడతరమా
ఇరాకీ ఆత్మగౌరవం నిలబెట్టి బుష్ కూ తలవంపులు తెచ్చిపెట్టిన జైది కి వందనాలు
ఇది నిజంగా కుక్కకాటుకు చెప్పుదెబ్బ అంటే ఇదే కాబోలు

15, డిసెంబర్ 2008, సోమవారం

సామెత లు

పాత సామెత
పిల్లకాకి కేం తెలుసు ఉండేలు దెబ్బ
కొత్త సామెత
కొత్త ఇన్వెస్టర్ కేం తెలుసు షేర్ మార్కెట్ దెబ్బ


ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా


లీడర్
కుంభకోణాలు చేస్తుంటే కార్యకర్త ఖాళీగా ఉంటాడా

పిచ్ ఫై కాలెయ్యడమంటే ఇదే

పీటర్సన్ సేన భలే కంగు తింది
నిన్నంతా చ్చేదిస్తారా లేదా చేతికిస్తారా అని టెన్షన్ పడిపోయా
కాని చ్చేదించి విజయలక్ష్మి ని చేతపట్టారు మన టీం ఇండియా
మన బ్యాటింగ్ లోతు తెలియక పీటర్సన్ పిచ్ మీద కాలేసి డిక్లేర్ చేసాడు
మొత్తానికి కడు రంజైన మ్యాచ్ ను చూసిన ఆనందం కలిగింది
కంగ్రాట్స్ టు ధోని అండ్ టీం ఇండియా

14, డిసెంబర్ 2008, ఆదివారం

ఏది ముందు

విలేకరి : డాక్టర్ గారు ఎవరైనా హాస్పిటల్ మంచి ఏరియాలో కట్టుకుంటారు
మీరేంటి శ్మశానం పక్కన కట్టించారు
డాక్టర్ : మీరు పొరపడ్డారు నేను హాస్పిటల్ కట్టించాకే ఇక్కడ శ్మశానం తయారైంది
తన అనుభవాలను గుర్తుతెచ్చుకుంటూ డాక్టర్ ప్రశాంతంగా సెలవిచ్చాడు

నేరము --శిక్ష

ఆసిడ్ రాక్షసులకు తగిన శాస్తి జరిగింది
ఇందులో పోలిసుల తప్పొప్పులు పక్కన పెడితే అలాంటి పిశాచ సంతతికి అదే ముగింపు కరెక్ట్
కాకపోతే చిన్న తేడా ఏంటంటే ఇల్లీగల్ గా అమలు జరిగిన లీగల్ గుణపాఠం
కోర్ట్ ద్వారా అమలు జరిగింటే చాలా సంతోషం గా ఉండేది
కాని మన న్యాయ వ్యవస్థ గురించి తెలిసిన వారికి అది జరిగే పని కాదు అని ఆయేషా ,శ్రీలక్ష్మి కేసులు చూసాక అందరికి అర్థమైఉంటుంది
ముగ్గరికి ఎంత క్రిమినల్ ఇంటేన్షన్ లేకపోతే పదిహేడు సార్లు రెక్కి చేసి మరి ఆమ్ల వర్షం కురిపిస్తారు
ఒక్కడైనా ఒరే శ్రీనివాసు ఇది తప్పురా అని చెప్పి చావచ్చుకదా
కాబట్టి మిగతా ఇద్దరికీ కూడా అదే శిక్ష సరిపోయింది

వరంగల్ పోలీస్ జిందాబాద్ సజ్జన్నార్ జిందాబాద్

పోలీసులకు మనవి: ఇకపై ఏదేని ఈవ్ టీజింగ్ కంప్లైంట్ వస్తే వెంటనే ఆక్షన్ తీసుకోవాలని
చట్టాన్ని చేతి లో కి తీసుకోకుండా శిక్షించే పని కోర్ట్ కి అప్పచేప్పాలని పోలిసు బాబాయి లకు మనవి
[ అది నిజమైన ఎంకౌంటర్ కాదని మీకు నాకు తప్ప మరెవరికి తెలియదులే ,నేను ఎవరికి చెప్పనులే ]

గంధ రూపాలు

మంచి వాసనలిచ్చేది మంచి గంధం
శాడిస్ట్ ప్రేమికుల చేతిలో ఉండేది ఆమ్ల గంధం [గంధకికామ్లం ]
సమాజం లో విలువలు కుళ్ళిపోతే మిగిలేది అమానవీయ దుర్గంధం

ల్యాండ్ లైన్ ఫోన్ కు సెల్ ఫోన్ కు తేడా ఏంటి

ల్యాండ్ లైన్ ఫోన్ కు సెల్ ఫోన్ కు తేడా ఏంటి

ల్యాండ్ లైన్ ఫోన్ ఉపయోగించాలంటే చూపుడు వేలు వాడాలి
సెల్ ఫోన్ ఉపయోగించాలంటే బొటన వేలు వాడాలసింటుంది
వివరించారు ఎవరో

13, డిసెంబర్ 2008, శనివారం

సామెత

పాత సామెత
రోలు వెళ్లి మద్దెలతో మొర పెట్టుకున్నట్లు
కొత్త సామెత
అంబులన్స్ వెళ్లి నూటా ఎనిమిది[108] తో గోడు వెల్లబోసుకున్నట్లు

12, డిసెంబర్ 2008, శుక్రవారం

సామెత

పాత సామెత

ఆడదై పుట్టడం కంటే అడవిలో మానై పుట్టడం మేలు

కొత్త సామెత
ఆడదై పుట్టినా యాసిడ్ కంట పడకుంటే అంతే చాలు

స్వప్న మరియు ప్రణీత త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ

మరో మృగాడు

మరో మృగాడు

వరంగల్ లో స్వాప్నిక, ప్రణీత పై జరిగిన ఆసిడ్ దాడి మీద సాక్షి పేపర్ పెట్టిన శీర్షిక
కరెక్ట్ గా సరిపోయిందినిపించింది

బాంబులు కాల్పులు జరిపితే ఉగ్రవాదం
ఆసిడ్ చల్లుకుంటూ పోతే ? ప్రేమోన్మాదం
దానికి పోలీస్ కమెండో లు ఉన్నారు
దీన్ని ఎదుర్కోడానికి ఎవరు దిగిరావాలో

11, డిసెంబర్ 2008, గురువారం

పైశాచికామ్లం

ప్రేమికుని చేతిలో సుల్ఫురిక్ ఆమ్లం
పిచ్చి ప్రేమికుని చేతి లో పైశాచికామ్లం
అమ్మాయిల జీవితాలు దుంపనాశనం
సాడిస్టు ప్రేమికులనుంచి వీరికెప్పుడో ఉపశమనం

9, డిసెంబర్ 2008, మంగళవారం

ఎన్నికల ఫలితాలు

కాంగ్రెస్ కు కొత్త కళ
విపక్షాలకు కరిగిన కల

7, డిసెంబర్ 2008, ఆదివారం

నాకు నచ్చిన బ్లాగ్ దైలోగ్స్ ఫ్రొం జంబలకిడి పంబ బ్లాగ్

జంబలకిడి పంబ బ్లాగు ఓనరు గారికి కృతజ్ఞలతో

టాప్ తెలుగు సినిమా డైలాగ్స్

హీరో డైలాగులు:

రాధా, నీ కోసం ఈ ప్రపంచాన్ని ఎదిరించటానికైనా సిద్ధమే.

రాధా, నువ్వు ధైర్యంగా ఉండు. నేను వస్తున్నాను.

అలాగే నాన్నగారు, రాధ లేని డబ్బు నాకవసరం లేదు. రాధే నా డబ్బు, నా జబ్బు. నే వెళుతున్నా.

అ...మ్మా.... నన్ను క్షమించమ్మా. నాన్న గారి ఇష్టానికి వ్యతిరేకంగా నేనిక్కడ ఉండలేను. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కొడుకు గానే పుడతా. నాన్నగారి ఆరోగ్యం జాగ్రత్త.

రంజిత్, అమ్మా, రాధ లకు ఏమైనా హాని కలిగితే నీ అంతు చూస్తా.

హీరోయిన్ డైలాగులు:

ఆడది జీవితంలో ఒక్కరికే మనసిస్తుంది, ప్రేమిస్తుంది.

ఆడదాని మనసు అద్దం లాంటిది. పగిలితే అతకదు.

నాన్నా, గోపీ లేకపోతే నేను ప్రాణాలతో జీవించను.

రంజిత్, నా వొంటి మీద చెయ్యేసావో నా గోపీ నీ అంతు చూస్తాడు.

ఛీ పాడు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు?

గోపీ, నువ్వు తండ్రివి కాబోతున్నావ్.

గోపీ, నేను నీ బిడ్డకి తల్లిని కాబోతున్నాను.

కాపాడండీ..........

విలన్ డైలాగులు:

గోపీ, తక్షణం 10 లక్షలు తెల్ల బ్రీఫ్ కేసులో పెట్టుకుని, నల్లకోటు వేసుకొని నువ్వు హోటల్ "వెర్రిపప్పు" ముందు నిలబడు. అక్కడ నీకు ఒక టైరు లేని స్కూటర్ మీద కాలు లేని జానీ కూర్చొని ఒక సగం కాల్చిన బీడీ పీలుస్తూ కనిపిస్తాడు. వాడు నీకు గుర్తుగా నలిగిన ఎర్ర చొక్కా జేబు చూపిస్తాడు, నువ్వు బదులుగా చిరిగిన రూపాయి నోటు చూపించు. తర్వాత వాడు పిల్లిలా అరుస్తాడు, నువ్వు కాకిలా అరువు. అదే మన కోడ్. వాడికి ఆ పదిలక్షల బ్రీఫ్ కేస్ ఇచ్చి నువ్వు వెళ్ళిపో. మీ అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటీకి ఇంట్లో ఉంటుంది. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా మీ అమ్మ నీకు దక్కదు. అండర్స్టాండ్.

గోపీ, మీ అమ్మ, చెల్లి ఇప్పుడు నా చేతిలో బందీగా ఉన్నారు. మర్యాదగా మాకు లొంగిపో.

హీరో/హీరోయిన్ కామన్ డైలాగులు:

అబ్బా, ఇప్పుడు నేనెక్కడ ఉన్నాను? (ఏదో ఘోరం జరిగిన తరువాత ఆసుపత్రి బెడ్డు పైన)

అమ్మా, నేను ఫస్టు క్లాసులో పాసయ్యానమ్మా, నన్ను దీవించు.

అమ్మా, నువ్వెంత మంచి దానివి. (ఎదవ పని చేసి చేతులు కాల్చుకొచ్చిన కొడుకు/కూతురు తల్లితో)


తండ్రి డైలాగులు:

ఛీ నీచురాలా, నిన్ను ఏం చేసినా పాపం లేదు. మన ఇంటి పరువు బజారుకీడ్చావు గదే

పిల్లల్ని కంటాం గానీ వాళ్ళ తలరాతల్ని కాదు లక్ష్మీ.

గోపీ, నా మాట కాదని ఈ ఇల్లు వదిలి బయటికి వెళ్తే నా ఆస్థిలో చిల్లిగవ్వ కూడా నీకు దక్కదు.

నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్ళి జరగనివ్వను.

తక్షణం నా ఇంట్లో నుంచి వెళ్ళిపో.

అమ్మా రాధా, ఆడదాని జీవితం పువ్వు లాంటిది. పువ్వు ముల్లు మీద పడ్డా, ముల్లు పువ్వు మీద పడ్డా నష్టం పువ్వుకే నమ్మా.

తల్లి సెంటిమెంటు డైలాగులు:

నిన్ను నవమాసాలు మోసి పెంచింది ఇందుకేనా?

ఛీ, నువ్విలాంటి వాడీవని తెలిస్తే, పుట్టగానే నీ గొంతు పిసికి చంపేసేదాన్ని కదరా.. (కుళాయి ఓపెన్)

ఓరి దేవుడా, ఇటు కట్టుకున్న దైవానికీ అటు కన్నపేగుకి మధ్య నలిగిపోతున్నాను..

అయ్యో ఈ ఘోరం నా కళ్ళతో చూసే కన్నా, ఆ దేవుడు నన్ను తీసుకెళ్ళినా బాగుండేది

యావండీ..... వాడు మన కొడుకండీ...

బాబూ, నిన్ను గుండెల్లో పెట్టుకు పెంచిన ఈ తల్లి గుండెల మీద తన్ని వెళ్ళిపోతావా బా...బూ...

యావండి, అమ్మాయి పెళ్ళి గురించి ఆలోచించారా

బాబూ, ఈ రోజు నాకెంతో సంతోషంగా ఉంది (సినిమా చివర్లో తల్లి/తండ్రి డైలాగ్)


అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్:

అన్నయ్యా....... చెల్లమ్మా.....

నిన్ను నా కంటిపాపలా పెంచుకుంటా చెల్లీ.

అన్నయ్యా, ఎన్నెన్ని జన్మలయినా నీ చెల్లిగానే పుట్టాలని కోరుకుంటా.

ఒరేయ్ ఏం కూసావ్, నా చెల్లి నిప్పురా నిప్పు, ముట్టుకుంటే కాలిపోతావ్.

పోలీస్ డైలాగులు:

ఏయ్ 401, ఆ ఖైదీని ఇలా తీసుకురా.

హాండ్స్ అప్, యూ ఆర్ అండర్ అరెస్ట్. (అప్పటికే విలన్ దాదాపు చచ్చి నడవలేని స్థితిలో ఉంటాడు)

కానిస్టేబుల్స్, సెర్చ్ ద హౌస్.

సార్, ఈ గదిలో ఈ మూట దొరికింది.

July 1, 2008

మాటలు - సామెతలు - నిజాలు

అడుక్కునే వాడిదగ్గర పీక్కొనేవాడు --- తెలంగాణాలో కేసీఆర్ వెనక దేవేందర్

మూలిగే నక్క మీద తాటికాయ పడటం --- కేసీఆర్ నెత్తిన దేవేందర్

అడుసు తొక్కనేల కాలు కడగనేల --- బ్లాగు రాయనేల, కామెంట్లు లేవని జుట్టు పీక్కోనేల?

సొమ్మొకడిది సోకొకడిది --- ప్రజల సొమ్ము "సాక్షి" పాలు

ఆరేసుకోబోయి పారేసుకోవటం --- పారేసుకోటానికే ఆరేసుకోవటం అని చదువుకోవాలి, సినీ హీరోయిన్ సాక్షిగా

కొండని తవ్వి ఎలుకని పట్టటం --- కొండని ఎక్కి ఇలా బాలయ్యలా కుందేలు పట్టటం అనమాట

చచ్చిన పాముని ఇంకా చంపటం అంటే --- లెజెండు అవలేని మోహన్ బాబుని పదేపదే అదే గుర్తొచ్చేలా మీరు లెజెండు కంటే గొప్ప అని పొగడటం

తల్లి అల్లం పెళ్ళాం బెల్లం --- దేవేందర్ తెలుగుదేశం వదిలి తెలంగాణా తెలంగాణా అనటం అనమాట

ఆకలి రుచి ఎరగదు --- ప్రధాని అయిన దేవెగౌడ ముఖ్యమంత్రి అవటానికి ప్రయత్నించటం

అరిచే కుక్క కరవదు --- కమ్యూనిస్టులు ప్రభుత్వాన్ని పడగొడతాం పడగొడతాం అనటం

దరిద్రుడి పెళ్ళికి వచ్చిందే కట్నం --- ఎమ్మెస్ సత్యనారాయణరావుకి ఆర్టీసీ చైర్మన్ పదవి తగిలించినట్లు

పరమ బద్దకస్తుడు --- వందసార్లు చెప్పలేక నేనొక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లు అనటం, రజనీకాంత్ లాగా

దొంగ భక్తుడు --- దేవుడి సినిమాకని చెప్పి బాలయ్య పాండురంగడు సినిమాకెళ్ళే వాడు

పరమ మొహమాటస్తుడు --- మన్మోహన్ సింగ్. సోనియాతో నేను రాజీనామా చేస్తా అని చెప్పలేక కమ్యూనిస్టులకు చెప్తాడు.

పరమ అమాయక చక్రవర్తి --- బాలయ్య ఫ్యాన్. ప్రపంచంలో కేవలం బాలయ్య సినిమాలు ఒక్కటే విడుదలవుతాయి అనుకుంటూ ఉంటాడు. ఎక్కడ తొడకొట్టినా పనులవుతాయనుకొని తొడకొట్టి ఆపుదామని వస్తున్న రైలు ముందు నిలబడి చచ్చూరుకుంటాడు.

పేరుగొప్ప ఊరుదిబ్బ --- ఒక్క మగాడు సినిమా బాగుందని ఒక్క మగాడు కూడా రివ్యూ రాయకపోవటం

ఆడదే ఆడదానికి శతృవు --- తెలంగాణా తల్లికి విజయశాంతి లాగా.

ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు --- భాజపా అధ్యక్షుడు అయి లక్ష కోసం పదవి ఊడగొట్టుకున్న బంగారు లక్ష్మణ్

జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు --- బాలయ్య, ఏ నిర్మాత అయినా సరే. వసూళ్ళు బొగ్గే.

సంతానం కోసం సముద్ర స్నానానికి వెళితే ఉన్న పెళ్ళాం లేచిపోయిందిట --- ఎన్నికలకి ముందే రాజీనామా చేసి మళ్ళీ ప్రజల దగ్గరికెళ్ళిన తెరాస కథే.

అప్పిచ్చువాడు వైద్యుడు --- అందుకే డాక్టర్.వైయస్సు గారు ఆంధ్రులకి ఏళ్ళకు తరగని అప్పుల్ని ఇచ్చేస్తున్నారు.

June 24, 2008

ఓ కళంకితుడు, ఓ అలౌకికుడు, ఓ అన్వేషితుడు మరెందరో బాధితులు

ఓ ఆడపిల్ల కష్టాల గురించి చెప్పాలన్నా, రాయాలన్నా ప్రపంచంలోని ప్రతివాడు తగుదునమ్మా అని సిద్ధపడిపోవటమే. అక్కడికేదో కష్టం ఆడపిల్ల సొత్తు అన్నట్లు, ఆ కష్టాల పుట్టుపూర్వోత్తరాలన్నీ వీళ్ళకే తెలిసినట్లు. ఆదివారం పూట పొద్దున్నే కాస్త ఆనందిద్దాం అని టీవీ నొక్కటం ఆలస్యం .. కళంకిత, అకళంకిత, అలౌకికత, అవివేకిత, అన్వేషిత, అన్వేషించనిత, అన్వేషిస్తున్నత, విధివంచిత, అంతరంగాలు, బహిరంగాలు, స్త్రీ, వనిత, మగువ, ఆడది ఓరి వీళ్ళ సీరియళ్ళు దొంగలు ఎత్తుకెళ్ళిపోను, తెలుగు డిక్షనరీలో ఆడ అన్న ప్రతి పదంతోనూ ఓ సీరియల్ తీసి పారేసారు. ఏమిటి అసలేమిటి జరుగుతోందిక్కడ? మగాళ్ళకి కష్టాలే లేవా? ఏనాటికి అలౌకికుడు, విధివంచితుడు, కళంకితుడు లాంటి సినిమాలు, సీరియళ్ళు వస్తాయో ఆ రోజే మగాడు పడుతున్న కష్టాలకి గుర్తింపు.

అసలు మగపిల్లాడిగా పుట్టి పెరగటం ఎంత కష్టమో ఈ పురుషద్వేషులకి ఏం తెలుసంట?

పుట్టి నాలుగడుగులు వెయ్యటమే లేటు, మొగపిల్లవాడికి సిగ్గేమిటంటూ చిన్ని గోచీ గుడ్డ కట్టి ఊరిమీదకి వొదిలేసిన హృదయవిదారక దృశ్యం ఎంతమందికి తెలుసని నేనడుగుతున్నా? అసలు ఇది కూడా (గోచీ) పెట్టి పుట్టిన వాడికి, లేకపోతే మొండిమొలతో ఊళ్ళేలాల్సిందే. ఎంత మగ వెధవయినంత మాత్రాన ఇంత పక్షపాతమా? గుడ్డముక్క వాడి ఒంటికి బరువా? ఆ సీను ఫోటో తీసి పెద్దయ్యేదాకా దాచి, ఎదురింటి మీనాకి, పక్కింటి ప్రియకి చూపించి కొద్దోగొప్పో కష్టపడి అన్నేళ్ళుగా పోగేసుకున్న సిగ్గుని పూర్తిగా తీసేసిగానీ నిద్రపోరు ఈ అమ్మలక్కలు.

అమ్మాయి పుడితే మహాలక్ష్మి అంటారు, అదే అబ్బాయి పుడితే కుబేరుడు అనరు, కుబేరుడి దగ్గర అప్పులపాలయిన శ్రీనివాసుడు అంటారు. ఎంత దారుణం?

స్కూల్లో చేరాక కళంకిత, అకళంకిత, అలౌకికత, అవివేకిత, అన్వేషిత, అన్వేషించనిత, అన్వేషిస్తున్నత, విధివంచితనీ మాత్రం మేస్టారు అరచేతిలో ముద్దుపెట్టినట్లు సుతిమెత్తగా కొట్టి, మగవెధవలంటూ అలౌకికుడు, విధివంచితుడు, కళంకితుడులను అరచేయి వెనక్కి తిప్పి వేళ్ళిరిగేలా స్కేలుతో కొడతాడు. విధించే శిక్షలోనూ అన్యాయమే.

కాలేజీకెళ్ళటానికని సిటీ బస్సు ఎక్కి కూర్చుంటే, అక్కడ కూర్చోనే సీట్లని కూడా ఆడపిల్లలకి రిజర్వు చేసి, వాళ్ళు రాగానే సీట్లు ఇచ్చి, వాళ్ళముందే నిలబడి ప్రయాణం చేసిన రోజుల్ని ఎలా మరిచిపోగలం? బస్సు సీట్ల రిజర్వేషన్ అంటే యాదుకొచ్చింది, మంద కృష్ణ అన్నకి ఈ అయిడియా వస్తే, ఆర్టీసీ బస్సుల్లో కూచొనే సీట్లకి కూడా రిజర్వేషను అమలు చేస్తే, సీటు కోసం బస్సు ఎక్కటం అంత బుద్ధి తక్కువ ఇంకోటి ఉండదు. ఎవరూ ఈ సీక్రెట్ లీకు చెయ్యకండి ప్లీజ్...

ప్రతి మగాడి విజయం వెనకాల ఓ ఆడది ఉంటుందిట, కానీ ప్రతి ఆడదాని విజయం వెనకాల ఓ మగవాడు ఉంటాడు అని కోట్ ఎవరయినా చెపితే విన్నారా? క్రెడిట్ ఇవ్వకపోగా భరించువాడు భర్త అని ఓ దిక్కుమాలిన టైటిలు పడేసి భరించలేనంతగా బాధపెట్టేదెవరు?

ఏ రకంగా చూసినా మగ పిల్లాడి మెయింటెనెన్సు ఖర్చు తక్కువ. చొక్కా, లాగు, పాంటు, షర్టు. చిన్ని జుట్టు, చింపిరి జుట్టూ, నెలరోజులుగా మడ్డిపట్టిన ప్యాంటు కూడా ఫ్యాషను అని చెప్పి గడిపెయ్యగలరే పాపం.

ఉద్యోగం చెయ్యని ఆడపిల్ల గృహలక్ష్మి, కానీ ఉద్యోగం చెయ్యని మగవాడు గృహపురుషుడు కాదు కదా అసలు పురుషుడు కింద లెక్క కాదట. ఎందుకంటే ఉద్యోగమే పురుష లక్షణమట. మరి ఉద్యోగం చెయ్యకపోతే స్త్రీ లక్షణము అవ్వాలి కదా. అంటే గృహలక్ష్మిలా గృహనారాయణుడు అవ్వాలి న్యాయంగా. కానీ జరుగుతున్నదేమిటి. ఉద్యోగం లేని పురుషుడి బతుకు ... అమ్మో.. ఎంత దారుణం చూసారా?

ఆడపిల్లని ఇంప్రెస్స్ చెయ్యటానికి మగ పిల్లలు పడే కష్టాలు ఎన్నెన్ని? ఎన్ని చీవాట్లు, ఎన్ని చెంప దెబ్బలు, ఎన్నెన్ని చె..దెబ్బలు. అసలు ఆడ పిల్లలు అలా మగ పిల్లల్ని ఇంప్రెస్ చేసే కష్టాలు పడతారా? అని నేను అడుగుతున్నాను.

సెలవంటూ వస్తే ఇంటిపట్టునే ఉండకుండా రోడ్లమీద పడి తిరుగుతూ రాత్రికి ఇంటికి చేరుకునే మగ పిల్లలతో ఎంత ఆదా?

నడిపే డ్రైవరు మగే అయినా, మగాళ్ళు చెయ్యూపితే ఇంకా స్పీడుగా పోయే సిటీ బస్సుడ్రైవరు గాడు అదే ఆడ పిల్లలు ఎక్కడ చెయ్యూపితే అక్కడే ఆపుతాడు, జాతి ద్రోహి.

పోనీ మా హీరో సినిమా చూట్టానికి మరో ఇద్దరు పురుగుల్ని ఎనక రమ్మని టిక్కట్టు కోసం వెళితే అక్కడ ఇంకో జాతి ద్రోహి. మగాళ్ళకి తలకొకటి, ఆడోళ్ళకి తలకి రెండు టిక్కట్లుట. ఎందుకీ అసమానత ఓరీ జాతిద్రోహీ అని వాళ్ళముందే నిలదీసా. బాగా కాలినట్లుంది. మనకు ఒక బాడీకి ఒక బుర్ర తెలివే ఉంటుంది, వాళ్ళు ఒక్కొక్కరికీ రెండు బుర్రల తెలివి ఉంటుంది, అందుకని రెండు టిక్కట్లని అని ఎదవ సిగ్గు లేకుండా సెటైరేసాడు. తర్వాత తెలిసింది, వాడి పెళ్ళాం అదే షో చూట్టానికొచ్చి లోపల వాడి పక్కనే నుంచుందని.

బోర్డు లేని లేడీస్ స్పెషల్ బస్సులోకి రన్నింగ్ లో పొరపాటున ఎక్కి, ఎన్నో క్రూరమైన చూపుల తాకిడికి జింకపిల్లలా భయపడుతూ లోపలికి వెళ్ళలేక, పోనీ తెలియక బస్సెక్కాడన్న జాలి కూడా లేకుండా మరింత స్పీడుగా బస్సు పోనిచ్చే మరో జాతిద్రోహి వల్ల కిందకి దిగలేక, ఫుట్ బోర్డుపై ఆ మగ ప్రాణి అనుభవించే చిత్రవ్యధ ఎవరికి తెలుసు?

లేడీస్ స్పెషల్ బస్సులు, బోగీలు, లేడీసు స్పెషలు ఎగ్జిబిషన్... మరి మగాళ్ళకో?

ఏక్ నాథ్ లా ఉన్నప్పుడే ఇన్ని కష్టాలు, ఇక పెళ్ళయి శ్రీనాథ్ అయినతరువాత కష్టాలూ చాలా ఉన్నాయి. అందుకే ఎవడయినా తీసాడా సరే, లేకపోతే నేనే ఓ టీవీ ఛానల్ కి ఉచితంగా అయినా భరించువాడు అన్న పేరుతో ఓ సీరియల్ ఈ కథతో తీసిపెడతా.

అయ్యలారా, మీ అండదండలు కావాలి. అమ్మలారా, అర్థం చేసుకునే మీ మంచి మనసు కూడా కావాలి.

2, డిసెంబర్ 2008, మంగళవారం

పాణిగ్రహణం

అరే కుటుంబరావు ఇది చెప్పరా
మన కు తెలిసి చెడ్డ గ్రహణాలు సూర్య గ్రహణం ,చంద్ర గ్రహణం అని రెండే కదా
మరి అప్పల రాజు గాడు గ్రహణాలు మూడు అన్నాడే , అడిగాడు పుల్లారావు
మూడోది పాణిగ్రహణం అయిఉంటుంది లే అన్నాడు కుటుంబరావు ,తన పెళ్లి ని గుర్తు తెచ్చుకొని