28, అక్టోబర్ 2010, గురువారం

ఆపరేషన్ ధియేటర్ లో సర్జరీ మద్యలో రాకూడని అనుమానాలు


ఆపరేషన్ ధియేటర్ లో సర్జరీ మద్యలో రాకూడని అనుమానాలు
[వచ్చాయంటే అయ్యవారి పని గోవిందా నే]

1.ఇంతకీ దెబ్బతిన్నది కుడి వైపునా ఎడమ వైపునా ?

2.ఇది రక్తనాళం అయితే మరి ఇందాక కట్ చేసింది ఏమై ఉంటుందబ్బా ??

3.మద్యలో కరెంటు పొతే స్టాండ్ బై ఉంటుందని జనరేటర్ కు డీజిల్ నింపమని చెప్పను
నింపారా లేదా??

4.అక్కడున్న OXYGEN సిలిండర్ నిండుదా కాదా ??]

5.పేషెంట్ పరిస్తితి బాగా లేదు ఇతనితో కన్సెంట్[అనుమతి పత్రం [ తీసుకున్నారా లేదా ??

6.నర్స్ నీ చేతిలో ఉన్నది SCOLINE అయితే మరి ఇందాక ఇచ్చిన సూది మందు ఏంటి ???

7.డాక్టర్ డాక్టర్ మీరు ఇందాక రెండు చేతులకు గ్లౌస్ తొడుక్కునారు కదా ఇప్పుడేంటి ఒకటే కనిపిస్తోంది ??

8.సిస్టర్ ఆపరేషన్ కి ముందు మోబ్స్ ,, సర్గికల్ పాడ్స్ ,కత్తెర్లు పరికరాలు అన్ని
సరిగ్గా లెక్క చూసు కున్నారా ???

సర్దార్జీ సాహసం

సర్దార్జీ సాహసం

అది ఇండో-పాక్ యుద్ధం జోరుగా సాగుతున్న రోజులు

మన సైనికులు అత్యంత సాహసోపేతంగా ఒక చోట పోరాడుతున్నారు

కాని శత్రు సైనికుల మీద పట్టు దొరకడం లేదు పైగా మీదకు చొచ్చుకొస్తున్నారు

అందరికి ఏం చెయ్యాలో తోచడం లేదు

అంతలో ఒక సింగ్ గారు ఒక దోమ తెర వంటి నిండా కప్పుకొని AK47 తీసుకొని

అరివీర భయంకరంగా ముందుకు దూకి శత్రు సేనలను చీల్చి చెండాడి

వాళ్ళను అక్కడినుండి తరిమి కొట్టాడు


అందరు హాచ్చర్య పోయి పలువిదాలు గా పొగిడి ఇంతకూ ఎలా అంత సాహసం చేసావు అనడిగారు

ఏం లేదు నాకో ఐడియా వచ్చింది దోమల్లాంటి చిన్న జీవులే దోమతెర దాటి లోపలి రాలేవు కదా
ఇంకా బుల్లెట్లు ఎలా వస్తాయి అని
అందుకే దోమతెర వంటి నిండా కప్పుకొని వాళ్ళ పనిపట్టాను అన్నాడు

అందరు మరోసారి మెచ్చుకున్నారు

కొన్నాళ్ళ తరువాత సింగ్ గారి కొడుకు కూడా ఆర్మీ లో చేరాడు
అతనికి తండ్రి కి ఎదురైనా పరిస్థి తే ఒకసారి ఎదురైంది
తన తండ్రి పాత అనుభవం గుర్తొచ్చి ఇంకా వెరైటీ గా అలోచించి ముందుకు దూకి
శత్రువులతో పోరాడాడు కాని బాగా గాయపడ్డాడు

అందరు మందలించారు ఎందుకలా చేసావ్ అని
నేనేం తప్పు చేయలేదు మా నాన్న కంటే బాగానే ఆలోచించాను అన్నాడు

ఏం ఆలోచించావు అంటే

మా నాన్న ఒన్లీ దోమ తెర కప్పుకున్నాడు
నేనేమో ఓడోమాస్ రుద్దుకొని మరీ వెళ్ళాను తెలుసా

బాగా సిన్మా లకు అలవాటు పడిన ప్రేక్షకుడు

బాగా సిన్మా లకు అలవాటు పడిన ప్రేక్షకుడు

ఇంట్లో కూడాకరెంటు పోగానే ఈలలు వేసి గోల చేసే వాడు




పంటి డాక్టర్ దగ్గరి కెళ్ళి పై పన్ను గురించి చెప్పే కంప్లైంట్

పైన బాల్కాని లో సింగల్ వరుసలో మూడోది నొప్పెడుతోంది

కాస్త టార్చి వేసి చూడండి అనేవాడు

25, అక్టోబర్ 2010, సోమవారం

దొందు దొందే

దొందు దొందే

సుబ్బారావు: ఈ మద్య నా భార్య అపద్దాలు చెబుతోందని నా కనిపిస్తోంది రా

రామారావు :ఎందుకలా

సుబ్బారావు :నిన్న రాత్రి లేటు గా ఇంటికి వచ్చిందే గాకుండా
ఎక్కడికి వెళ్ళావ్ అంటే
పనిమనిషితో సిన్మా కెళ్ళాను అని చెబుతోంది రా

రామారావు: నిజమేనేమో కనుక్కోలేకపోయావా

సుబ్బారావు: అది ఖచ్చితంగా అబద్దమే

రామారావు :ఎలా చెబుతునావ్

సుబ్బారావు : ఎందుంటే పనిమనిషితో సిన్మా కు పోయింది నేను కాబట్టి

10, అక్టోబర్ 2010, ఆదివారం

కోపిష్టి పేషెంట్


డాక్టర్: చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి

సుబ్బా రావు: డాక్టర్ ఈ మద్య నా కు కోపం కొంచెం ఎక్కువైంది

అందరి మీద ఊరికే అరుస్తూ చిన్న విషయానికే అమ్మనా బూతులు తిడుతున్నాను

ఈ రోగం కొంచెం తగ్గించండి సార్

డాక్టర్ :ఎప్పటి నుండి ఇలాగ

సుబ్బా రావు :ఇప్పుడే కదరా చెప్పాను ఈ మద్యనే అని

మళ్లి మడ్డి వెధవ లాగ జిడ్డు మొహం వేసుకొని

ఎప్పటినుండి అని అడుగుతావే you ఫూల్ ఇడియట్ రాస్కెల్ >>>>>>

డాక్టర్:?????????

8, అక్టోబర్ 2010, శుక్రవారం

ఏం తెలివి

టీచర్ :ఒరే ఆనంద్

8 ని సగం చేస్తే ఎంతరా


అడ్డంగా సగం చేస్తే సున్నా[౦]

నిలువుగా సగం చేస్తే మూడు[౩] టీచర్

2, అక్టోబర్ 2010, శనివారం

భైరవ సిన్మా


ఈ మధ్య పొరబాటున భైరవ సిన్మా చూసా

బాగా దొరికిపోయిన మాట వాస్తవం కాని కొన్ని డైలాగ్స్ బావున్నాయి మచ్చుకు కొన్ని



ENCOUNTER చేసే టప్పుడు నేను బాడీ నే చూస్తా BIODATA చూడను



అమ్మాయిలను మోసం చేయడం చాలా తప్పు
అమ్మ ను చేసి మోసం చేయాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు



అందరు సమాజం లో నుంచి స్మశానం కు వస్తారు
కాని ఈ భైరవ స్మశానం లో నుంచి సమాజం లోకి వచ్చి నోడు

నాటో పెట్టు కుంటే డైరెక్ట్ గా అక్కడికే