14, ఫిబ్రవరి 2011, సోమవారం

అల్లు అరవింద్ --చిరంజీవులు పాడుకున్న పాట

ప్రజారాజ్యం కాంగ్రెస్స్ లో కలిసి పోతున్న సందర్బంగా ఆ ముందు రోజు రాత్రి
అల్లు అరవింద్ --చిరంజీవులు పాడుకున్న పాట[VEDAM MOVIE NUNCHI]

గుండె గుబులుని గుండె కు వదిలి

చర్చించే వారిని చానెళ్లకు వదలి

ముందు వెనుకలు ముంగిట వదిలి

ఊరి సంగతి ఊరికి వదలి

ఫాన్స్ దారిని ఫార్సు కు వదలి

దారి సంగతి దారికి వదలి

కార్యకర్తల ని ఖర్మాని కి వదలి

నమ్మిన ప్రజలను నట్టేటి కి వదిలి

తప్పు ఒప్పులు తాతలకొదిలి

విమర్శకులను వీధికి వదలి

సిగ్గు యెగ్గులు చీకటికొదలి

తెరలను వదలి పొరలను వదలి

గడబిడలన్ని గాలికి వదలి [ఆయాసపడుతూ ]

కాంగ్రెస్స్ లో
కలిసి పొతే ఎంత బాగుంటుంది కలిసి పొతే ఎంత బాగుంటుంది

పప్పర పప్పర పాపార పప్పర పప్పర పాపార


కలిసి పొతే ------ బాగుంటుంది [కోరస్ ]

కలిసి పొతే -------బాగుంటుంది

కలిసి పొతే -------------బాగుంటుంది

10, ఫిబ్రవరి 2011, గురువారం

[ కామెడీ]comedy news

మనం రోజు వార్త పత్రికల లో చూసే న్యూస్ లో
కొన్ని పక్కన పక్క ననే ఉన్న వాటిని కలిపి చదివితే కొంచెం కామెడీ గా అనిపిస్తుంది

మచ్చుకు కొన్ని

తిరుపతి లో అలిపిరి దారి దగ్గర పులి సంచారం --హర్షం వ్యక్తం చేసిన అమెరికా అద్యక్షుడు ఒబామా


కాంగ్రెస్స్ లో ప్రజా రాజ్యం పార్టీ విలీనం -- ఈజిప్టు లో పెద్ద ఎత్తున ఆందోళన లు నిరసనలు ప్రదర్శించిన ఆందోళన కారులు


సోనియా ఇంట్లో ప్రధాని మన్మోహన్ భేటి -- సోదా చేసి 25 తులా ల బంగారు నగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు


అవినీతి పై యుద్ధం ప్రకటించిన ఐక్య రాజ్య సమితి ---పోలిట్ బ్యూరో సమావేశం లో సీనియర్ల పై చిందులు తొక్కిన చంద్ర బాబు


300 పాయింట్స్ నష్టపోయిన సెన్సెక్స్ --రచ్చ బండ లో ప్రజల పై CM కిరణ్ కుమార్ అసహనం


గురుకుల ఆశ్రమం హాస్టల్ లో ప్రసవించిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని--D శ్రీనివాస్ ని కలిసి పరిస్తితి గురించి చర్చించిన చిరజీవి


నెల్లూరు లో గంజాయి తోట పై పోలిసుల దాడి పంట ద్వంసం ---CM కిరణ్ కుమార్ పై మండి పడ్డ జగన్

7, ఫిబ్రవరి 2011, సోమవారం

ప్రజారాజ్యం కాంగ్రెస్స్ లో విలీనం సందర్బంగా పత్రికలూ టీవీ ల లో కనిపించిన కొన్ని శీర్షికలు

ప్రజారాజ్యం కాంగ్రెస్స్ లో విలీనం సందర్బంగా పత్రికలూ టీవీ ల లో కనిపించిన కొన్ని శీర్షికలు

సూర్యుడే సెలవనీ కరిగి పోయేనా

అర చేతి లో అస్తమించిన సూర్యుడు

బయటపడడమే లక్ష్యం ---- కాంగ్రెస్స్ లో కలిసిపోవడమే మార్గం

బరువుదించు కోవడమే లక్ష్యం ---paaripovadame మార్గం

జాగ్రత్త పడడమే లక్ష్యం --జుంప్ జిలానియే మార్గం

10 జనపథ్ దగ్గర చిరుకు కట్టిన బానర్-- స్వా [హా ]గతం