27, మార్చి 2011, ఆదివారం

నేటి వార్తలు --వాటికి తగ్గ సామెతలు

నేటి వార్తలు --వాటికి తగ్గ సామెతలు

కాంగ్రెస్స్ కు నిరాశ కలిగించిన MLC ఎన్నికలు
ఊ హించని విధంగా జగన్ వర్గానికి మూడు MLC సీట్లు

పిల్లి పిల్లి తగవు కోతి తీర్చి నట్లు

మావోయిస్ట్ సాంబ శివుడి దారుణ హత్య
ప్రభుత్వానిదే భాద్యత అని తెరాస ప్రకటన

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు



తెరాస లో క్రాస్ వోటింగ్ తగాదా
మాకే పాపం తెలియదు తెరాస MLA లు

అందరు శాకా హారులే కాని బుట్టలో రొయ్యలు మాత్రం మాయం



జపాన్ లో సునామి ,భూకంపం , అణు ధార్మికత లీకేజీ

పకృతి మనిషి మీద పడ్డా మనిషి పకృతి మీద పడ్డా damage మనిషి కే


తమిళ నాడు లో ఎన్నికల సందడి
ఉచిత హామీల వెల్లువ అన్ని ఆల్ ఫ్రీ అంటూ ఊదర గొడుతున్న అన్ని పార్టీలు

మనది కాకపొతే కాశీ దాక దేకమన్నట్లు


పార్లమెంట్ లో వికీ లీక్స్ దుమారం
దుమ్మెత్తి పోసిన ప్రతిపక్షాలు ప్రదాని ఆగ్రహం

ఏడుపు అత్త కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు


21, మార్చి 2011, సోమవారం

నేరము శిక్ష

నేరము శిక్ష

టీచర్ : నేరమొకరిది శిక్ష ఒకరికి అంటే ఏంట్రా రాము

రాము :నిన్న మీరిచ్చిన హోం వర్క్ లో మా నాన్న తప్పు చేస్తే

ఈ రోజు క్లాసు రూం లో నేను తన్నులు తినడం



TV పిచ్చి

అది కోర్ట్ హాల్ ,కోర్ట్ ప్రొసీడింగ్స్

రాష్ట్ర మంతా టీవీ లలో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది

గజదొంగ గంగుల్ని ప్రవేశ పెట్టారు


జడ్జి :నువ్వెంత చాక చక్యంగా ఏ ఆధారము దొరక కుండా

అందర్ని ఏమార్చి ఎంతో తెలివిగా దొంగతనం చేసినా ఎలా పట్టు కున్నామో చూసావుగా

అంతా ఈ CC టీవీ లలో రికార్డు అయింది చూస్తావా అంటూ టీవీ ఆన్ చేసి చూపించాడు

ఇప్పుడేమంటావ్ అని అడిగాడు జడ్జి గంగుల్ని


గంగులు :చిన్నగా కోర్ట్ లో ఆడియన్సు వైపు తిరిగి


చూసారుగా నా పెర్ఫార్మన్స్ .అది మీకు నచ్చినట్లయితే శభాష్ గంగులు అని టైపు చేసి స్పేస్ ఇచ్చి

420 420 కి SMS పంపి నాకు శిక్ష పడకుండా చూడండి అన్నాడు కూల్ గా

8, మార్చి 2011, మంగళవారం

సెల్ ఫోన్ సామెతలు


నాడా దొరికింది గుర్రాన్ని కొందాం పదా అన్నాట్ట వెనకటికి ఒకడు

సిమ్ము దొరికింది ఇక సెల్ ఫోన్ కొనాలన్నట్లు


ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్టిన్నట్లు

రింగ్ టోన్ విని సెల్ నెంబర్ చెప్పినట్లు


దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టు కోవాలి

బాలన్సు ఉండగానే కాల్స్ చేసుకోవాలి


సొమ్మొకడిది సోకొకడిది

టాక్ టైం ఒకరిది టాకింగ్ టైం ఇంకొకరిది



ఇంటి ని చూసి ఇల్లాల్ని చూడ మన్నట్లు

హలో ట్యూన్ విని అవతలి వాడి నేచేర్ చెప్పి నట్లు



అయ్యకు లేక అంబలి తాగుతుంటే కొడుకొచ్చి పాయసం కావాలన్నట్లు

కలర్ ఫోన్ లేక ఫాదర్ ఫీలవుతుంటే సన్ వచ్చి కేమెర ఫోన్ కొనిమ్మన్నట్లు

ఆకాశం లో సగం



ఆకాశం లో సగం

అవని లో సగం

అవకాశాల్లో సగం

అన్నిటా సగం సగం

let it be continued FOR ever

WISHING HAPPY WORLD WOMENS DAY TO ALL
TELUGU BLOGGERS AND REST OF THE WORLD

6, మార్చి 2011, ఆదివారం

JOKES

ఆ ఒక్కటి దొరకలేదు

పుల్లయ్య : డాక్టర్ గోరు డాక్టర్ గోరు

మీరు రాసిచ్చిన మందులన్నీ దొరికాయండి

ఈ చివరిది ఒక్కటి తప్ప ,,ఏం చెయ్యమంటారు ??


డాక్టర్ ::ఒరే పుల్లయ్యా అది నా సంతకం రా నాయనా




మతి మరుపు [నేను మోనార్క్ ని ఏది మరచి పోను ]


ఏమేవ్ కాంతం నువ్వెప్పుడు ఆఫీసు కు వెళ్ళే ముందు

నేను ఏదో ఒకటి మరచి పోతాను అంటూo టావ్ కదా

ఈ రో జు చూడు మరి కళ్ళద్దాలు పెట్టుకున్నాను

చొక్కా ప్యాంటు వేసుకున్నాను

చక్కగా షూస్ వేసుకున్నాను

ఫైల్స్ అన్నీ తీసుకున్నాను

ఇప్పుడేమంటావ్ అన్నాడు కన్నా రావు హుషారుగా


ఏడ్చినట్టే ఉంది మీ సంబడం ఈరోజు సండే ఆఫీసు కు హాలిడే