యా ఊరిలో ఒక కంప్యూటర్ ఇంజనీర్ ఒకరోజు ఆఊరి నది ఒడ్డున కూర్చొని
తన లాప్ టాప్ లో ఏదో పని చేసుకుంటున్నాడు
ఇంతలో laptop పట్టు తప్పి నదిలో జారి పడి పోయింది
ముందు భాద పడ్డా తరువాత చిన్నప్పుడు చదువుకొన్న కథ ఒకటి గుర్తొచ్చింది
అదే కట్టెలు కొట్టే మనిషి --నదీదేవత కథ
అంటే గొడ్డలి నదీ లో పడి పోవడం ఆ దేవత మొదట బంగారు గొడ్డలి తరువాత వెండి గొడ్డలి చూపించి
అవేవి కావు అన్నప్పుడు అసలుది చూపించి అతని నిజాయితీ కి మెచ్చి ఆపై ఆ మూడు అతనికే ఇవ్వడం అన్న మాట
ఇప్పుడు ఈ ఇంజనీర్ కూడా నదీ దేవత ను ప్రార్థించాడు తనది మళ్లీ తెచ్చి ఇమ్మని
నదీ దేవత ప్రత్యక్ష్యమై ముందు ఒక అగ్గి పెట్టె లాంటి డి చూపించి ఇదేనా అని అడిగింది
నేనడిగింది నా లాప్ టాప్ ఈ అగ్గిపెట్టె కాదు అన్నాడు విసుగ్గా
ఈ సారి అర చెయ్యి సైజు లో ది ఒకటి చూపించి ఇదేనా అని అడిగింది
అబ్బేఈ పలక కానే కాదు అన్నాడు ఇంజినీర్ బొత్తిగా నదీ దేవత అజ్ఞానానికి తిట్టుకుంటూ
ఈ సారి లాప్ టాప్ తెచ్చి చూపించింది
వెరీ గుడ్ ఇదే ఇదే అని సంతోషించి థాంక్స్ చెప్పి తీసుకున్నాడు
నదీ దేవత వెళ్లబోతుంటే ఆపి పాత కథ గుర్తు చేసి ఏంటి తల్లీ ఇలా చేసారు
అప్పుడేమో అతనికి మంచి మంచి వి చూపించి లాస్ట్ కి అన్ని కలిపి ఇచ్చేసారు కదా
నాకేంటి పనికి మాలినవి చూపించి ఇలా చేసారు అనడిగాడు
దానికి నదీ దేవత :ఒరే మూర్ఖా ముందు నేను చూపించినవి
అత్యంత లేటెస్ట్ కంపూటర్లు రా బడుద్దాయ్
నువ్వు వాటిని పలక అగ్గిపెట్టె అనే సరికి నువ్వు వాటికి అర్హునివి కావని ఇవ్వలేదు అని మాయమయింది
TAKEHOME : [కథ లో నీతి ] టెక్నాలజీ ని ఎప్పటికప్పుడు UPDATE చేసుకోపోతే ఇలాంటి నష్టాలు తప్పవని
ఇంతే సంగతులని అర్థం