ధ్వని-ప్రతిధ్వని
ముఖ్య మంత్రిని కావాలని ఆశ పడుతుతున్నా
విలేకర్ల సమావేశం లో బొత్స
CM కిరణ్ గారు వినబడుతోందా చాప కింద నీటి శబ్దం
తెలంగాణా విషయం లో అవసరమైతే రాజీ నామాలకు సిద్దం --జానారెడ్డి
ఏదో సిన్మా లో బాబు మోహన్ జైలు సిబ్బంది తో అనే మాటలు గుర్తుకొస్తున్నాయి [ కొంచెం మార్పు తో ]
" యాక్ థూ " ఎన్ని సార్లు చెబుతారు
వినే వాళ్ళ కైనా సిగ్గుండాలి లేదా చెప్పే వాళ్ళ కైనా సిగ్గుండాలి
తెలంగాణా పై నిర్ణయం అధిష్టానం దే -ఏ నిర్ణయమైనా మాకు ఒకటే
బొత్స
పదవికి ముందు ఓడ మల్లయ్య -పదవొస్తే బోడి మల్లయ్య అనే సామే త ఉంది గదా మరి
PCC ఆఫీసు కి కొత్త HI-TECH హంగులు --బొత్స
కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగనట్లు
స్తానిక ఎన్నికలు కాగ్రెస్స్ పై ఎలాంటి ప్రభావం చూపవు -బొత్స
అవునులే గెలిచే సీన్ లేనపుడు అలాంటి స్టేట్ మెంట్ లే వస్తాయి
జగన్ అనే వ్యక్తి నాకు లెక్కే లేదు --బొత్స
కాని INDIRECT గా లెక్క లన్ని జగన్ పార్టీ చేసే DAMAGE పైనే
బొత్స దళిత వ్యతిరేకి --అవినీతి పరుడు --హర్ష కుమార్
శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్లి కూతురు ముండ ఎక్కడా అని అడిగాడట
బొత్స అహంకారి , ఇలాంటి టీం తో ఎన్నికలకు పొతే కాంగ్రెస్స్ చేతికి వచ్చేది చిప్పే --TDP
పగవాన్ని పంచాగం అడిగితే మధ్యాహ్నానికి మరణం అన్నాడట
కాంగేస్స్ లో యేపదవి వచ్చినా -ఇచ్చినా నాకు సంతోషమే --చిరు
మాట తప్పడమే నైజం -పలాయనమే మార్గం అయిన వాళ్ళు ఇంతకంటే ఏం స్టేట్ మెంట్ ఇస్తారు