17, డిసెంబర్ 2011, శనివారం

BOTSA SATTI BAABU AND CHIRU -SANTHOSHAM


మీరంతా సంతోషం సిన్మా చూసే ఉంటారు 

 అందులో కోట శ్రీనివాస రావు ని బ్రంహానందాన్ని  ఒక పార్టీ లో కలిసి  
ఉన్న వాడు ఊఒరుకోక  ఒక డైలాగ్ చెప్పి  ఇరుక్కుంటాడు  అది ఏంటంటే

బ్రంహి:  హలో ఐ యాం  గిరి from మంగళ గిరి అని షేక్ హ్యాండ్ ఇచ్చి 
అబ్బ మీరు చాలా స్ట్రాంగ్  మాన్
ఈ వయసులో నే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసుంటారు  అంటాడు

దాంతో కోట పార్టీకి వచ్చిన గెస్ట్ లను ఒక్కరినే పిల్చి అదే డైలాగ్ బ్రంహి తో అందరికి చెప్పించి  సిన్మా చూపిస్తాడు

ఇప్పుడు అదే డైలాగ్ పొలిటికల్ సీన్ లో
ఇందులో  పిసిసి  ప్రెసిడెంట్ బొత్స  సత్తి బాబు  ఒక చోట నిల్చొని ఉంటె
 చిరంజీవి  వచ్చి  మంత్రి పదవి కోసం కాకా పట్టడానికి  డైలాగ్ వదులుతాడు

సత్తిబాబూ  మీరు చాలా స్ట్రాంగ్  పెర్సనాలిటీ   ఈ పదవిలో నే ఇలా హడావిడి చేస్తున్నారంటే 
ఆ పదవి [CM] వస్తే అందర్ని చించి వుతికి  అరేస్తరేమో  అన్నాడు
దానికి బొత్స :థాంక్స్ ఫర్ కాంప్లిమెంట్   ఉండు ఈ ఆమాట ఒక సారి కిరణ్ తో కూడా చెప్పండి
 అని  కిరణ్ ని పిలుస్తాడు

కిరణ్ మొహం చిటపట లాడిస్తూ ఏంటి బొత్స థిస్ ఇస్ నాట్ కరెక్ట్  ఎందుకు నన్ను ఇలా పిలిచావ్  అడిగాడు 

బొత్స :ఇదో చిరు ఒకసారి ఆ డైలాగ్ చెప్పు
చిరు : ఏం లేదు కిరణ్ బొత్స   చాలా స్ట్రాంగ్  పెర్సనాలిటీ   ఈ పదవిలో నే ఇలా హడావిడి చేస్తున్నారంటే 
ఆ పదవి [CM] వస్తే అందర్ని చించి వుతికి  అరేస్తరేమో అన్ననన్న మాట

కిరణ్ :ఆ పదవి వచ్చి నప్పుడు చూద్దాం లే  థిస్ ఇస్ క్లియర్  అని తిట్టి కుంటూ వెళ్లి పోయాడు

బొత్స ఈ సారి  చంద్ర బాబు ని పిలిచాడు  చిరు ఏదో చెబుతాడు  ఓ పాలి  బె గి ఇలా ఒచ్చేల్లు అని

బాబు వచ్చాడు  ఏంటి బొత్స  నేను ఏదో విధంగా CM కావాలని అన్ని రకాలుగా ముందుకు వెళుతుంటే అడ్డం పడి ఇలా అడ్డం పిలవడం  బాగలేదు  అయినా ఏమి టి  సంగతి  అనడిగాడు

బొత్స చిరు తొడ గిల్లాడు తగులూకో అని

చిరు కొంచెం ఇబ్బంది గా పేస్ పెట్టి  చెప్పాడు ఏం లేదండి

  బొత్స చాలా స్ట్రాంగ్  పెర్సనాలిటీ   ఈ పదవిలో నే ఇలా హడావిడి చేస్తున్నారంటే 
ఆ పదవి [CM] వస్తే అందర్ని చించి వుతికి  అరేస్తరేమో అన్ననన్న మాట  

ఏంటి బొత్స AND చిరు కలలు కంటున్నారా   ఎన్ని వెన్ను పోట్లు  
ఓటు పాట్లు పడి అయినా CM ఐతా గానీ
మిమ్మల్ని కానివ్వను అని దుమ దుమ లాడుతూ వెళ్లి పోయాడు

బొత్స మల్లీ  జగన్ ను పిలిచాడు  ఒక్క సారి చిరు మాటలు  విని పోదురా అని

రావడం రావడం తోనే జగన్  చిరు గడ్డం పట్టుకొని  ఓదార్చడం మొదలెట్టాడు 
 ఏం మంత్రి పదవులు రాలేదని ఫీల్ కావద్దు  కావాలంటే మా పార్టీ లో కి రా నేనిస్తాను అని

దాంతో బొత్స కంగారుపడిపోయి మేటర్ పక్క దారి పడుతోందని   చిరు ను మల్లి గిల్లాడు

ఏం లేదు జగన్   బొత్స చాలా స్ట్రాంగ్  పెర్సనాలిటీ   ఈ పదవిలో నే ఇలా హడావిడి చేస్తున్నారంటే 
ఆ పదవి [CM] వస్తే అందర్ని చించి వుతికి  అరేస్తరేమో అన్ననన్న మాట   అన్నాడు మొహమాటంగా

ఛీ ఛీ  బానిసలు మీది ఒక బతుకేనా అనుకుంటూ జగన్ ఓదార్పు యాత్ర కు వెళ్ళిపోయాడు

ఈ సారి కేశవ రావు ని జానా రెడ్డి ని పిలిచాడు  చిరు ఏదో చెబుతాడు వినండి అని

చిరు కు కింద నుంచి ఎక్కడి కో కాలింది  ఏంటి  వీళ్ళకు కుడా చెప్పాలా అని 

SAME మ్యాటారా   అన్నాడు చిరు     అవునన్నాడు బొత్స

ఏం లేదండి  బొత్స చాలా స్ట్రాంగ్  పెర్సనాలిటీ   ఈ పదవిలో నే ఇలా హడావిడి చేస్తున్నారంటే 
ఆ పదవి [CM] వస్తే అందర్ని చించి వుతికి  అరేస్తరేమో అన్ననన్న మాట   అన్నాడు

ఏమన్నారు  మళ్ళీ చెప్పండి అన్నాడు జాన రెడ్డి  చెవులు రిక్కిస్తూ

దానికి బొత్స అన్నాడు  మా వాళ్లకు కొంచెం నాలుక మందం  వినికిడి లోపం  కొంచెం గట్టిగా చెప్పు 

చిరు : ఏంటి నాలుక మందమా కొంచెం గట్టిగా చెప్పాలా 

ఈయనగారు  చాలా స్ట్రాంగ్     ఈ పదవిలో నే ఇలా హడావిడి చేస్తున్నారంటే 

ఆ పదవి [CM] వస్తే అందర్ని చించి వుతికి  అరేస్తరేమో అన్ననన్న మాట  అన్నాడు  నీరసంగా

అబ్బ ఎన్ని సార్లు చెప్పమన్నా  అలుపు లేకుండా చేబుతావ్  ఒక్కసారి ఢిల్లీ పోదాం రా
ఈ మాట ఒక సారి సోనియా తో కూడా చేబుదువు గాని  అన్నడు బొత్స

దాంతో మన చిరు అక్కడి నుంచి JUMP



4, డిసెంబర్ 2011, ఆదివారం

STAGES OF IAS OFFICERS

ఐఏఎస్ ల గురించి 


ఐఏఎస్ కి సెలెక్ట్    అయినప్పుడు  ఆహా ఎస్  ఓహో ఎస్ 


సంపాదనకి అలవాటు పడ్డపుడు       అయ్యా ఎస్  అయ్యా ఎస్ 


సిబిఐ కి దొరికి నపుడు      అయ్యో  ఎస్  అయ్యయ్యో ఎస్