5, జనవరి 2010, మంగళవారం

కామెంట్ ----గీమేంట్

కామెంట్

క్రిమినల్స్ విషయం లో

చట్టం తన పని తాను చేసుకొని పోతుంది

ఓ పెద్ద మనిషి ఉవాచ



తెలంగాణా విషయం లో

కేంద్రం తన పని తాను చేసుకొని పోతుంది

ఓ తెలంగాణా వాది ఆశావాదం



గీమేంట్

అవును అవి తమ పని తాము " చే " సుకొని పోతూనే ఉంటాయి

ఎదురు చూసే వాళ్ళు పోవాల్సిందే

ఆంధ్రజ్యోతి లో వచ్చిన కార్టూన్స్



ఈ మద్య ఆంధ్రజ్యోతి లో వచ్చిన కార్టూన్స్ బాగున్నాయి కదా


చిత్ర్రాన్ని పెద్దదిగా చూడడానికి దాని మీద క్లిక్ చేయండి

4, జనవరి 2010, సోమవారం

నిరాహార దీక్షలో రకాలు

నిరాహార దీక్షలో రకాలు


గాంధీజీ టైపు

అస్సలేమీ తినకుండా నిజాయితీ గా చెయ్యడం


KCR టైపు

ఒక రోజు చేసి మిగతా అంతా hospital లో చూసుకోవడం


రాజ గోపాల్ టైపు

నాలుగు ఇదు రోజులు చేసి అందరకి కళ్ళు గప్పి పారిపోవడం

నిర్వచనం

నిర్వచనం



ఆమరణ నిరాహార దీక్ష అంటే


రాజ కీయ నాయకు లు చేసే సడన్ డైటింగ్

2012 యుగాంతం--AP


[ఆంధ్రజ్యోతి నుండి]


ఏవండి తెలంగాణా వస్తుందంట కదా నాకు

చిలక జోస్యం లో చెప్పారు


కాదు గ్రేటర్ రాయల సీమ వస్తుందంట నాకు

జాతకం లో చెప్పారు


కానే కాదు

జై ఆంధ్ర ముందుగా ఇస్తారంట నాకు

సోది లో చెప్పింది


ఏం కాదమ్మా గ్రేటర్ హైదరాబాద్ ఇచినాకనే ఏదైనా

నాకు

రాశి ఫలాలు లో అలాగని వచ్చింది


కాదు ఎవరెన్ని చెప్పినా

సమైక్యంద్ర నే ఉంటుంది

నాకు

అంజనం లో కనబడింది



సరేలే నాకూ చెప్పారు

కోయ శాస్త్రం జ్యోతిష్యం లో


ఏమని


ఇవన్ని 2012 dec 21 st తర్వాతే వస్తాయంట

అంత కచ్చితంగా చెప్పారు మరి



మాదే కరెక్ట్ అంటే మాదే కరెక్ట్ అని

అంతా ఇళ్ళకు వెళ్లి పండుకున్నారు


పొద్దున్నే న్యూస్ పేపర్ లో పెద్ద పెద్ద ADDS తో సినిమా పోస్టర్ ఉంది



నే దే చూడండి మీ అభిమాన theaters లో గొప్ప విడుదల



2012 యుగాంతం

2, జనవరి 2010, శనివారం

రోశయ్య ఈయన చాలా మంచోడు టూకీ గా

రోశయ్య :అమ్మ నాన్న పెట్టిన పేరు

ఉక్రోషయ్య :ఎగస్పార్టీ వాళ్ళు పెట్టుకున్న పేరు

ఆక్రోషయ్య :తెలంగాణా వాదులు పిలిచే పేరు

భేషయ్య సమైక్యవాదులు పలికే పేరు

ఆచరించేది : పైన ఆ అమ్మ శాసించాలి కింద ఈ రోశయ్య పాటించాలి

ఏ భాషలో నైనా నచ్చని మాటలు :బంద్ లు రాజీనామాలు JAC లు

ఇష్టమైన పాట : ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా

అన్ని కష్టాల్ని నాకిచ్చి పైన కులుకుతున్నావా


ఇష్టమైన తెలుగు సామెత :తంతే బూరెల బుట్టలో పడ్డాడట వెనకటి కి ఎవరో

ఇంగ్లీష్ లో అయితే :every dog will have its own day


ఇప్పటికీ అర్థం కానిది :ఈ వయసులో కూడా తివారి రాస లీల ల సవారి ఎలా చేసాడబ్బా?

1, జనవరి 2010, శుక్రవారం

WHAT IS NEW YEAR

కొన్నిసార్లు కాలం కఠినం గా అనిపిస్తుంది
ఆ కాఠిన్యానికి కారణం మాత్రం మనమే
మన తప్పోప్పులే అలా అనిపిస్తాయి

కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో ఏమి తెస్తుందో అన్నది ముఖ్యం కాదు
కొత్త సంవత్సరం లో మనం ఎలా ఉండబోతున్నాం ఏమి చేయబోతున్నాం అన్నదే అసలు విషయం

మనల్ని మనం కొత్త సంవత్సరం లో ఎంత కొత్త గా ఉంచుకోబోతున్నాం
మన చుట్టూ ప్రపంచాన్ని ఎంత కొత్తగా ఉంచుతున్నాం అనేది విలువైన ప్రశ్న

HAPPY NEW YEAR 2010 TO ALL FRIENDS

JAYABHARATH