28, ఆగస్టు 2011, ఆదివారం

ఎవరు పెద్ద


ప్రస్తుతం అమెరికా పరిస్తితి

10 ,౦౦౦ నువ్వు బ్యాంకు కు బాకీ ఉంటే అది నీకు సంబంధించిన సమస్య
అదే నువ్వు పది లక్ష లు బాకీ ఉంటే అది బ్యాంకు కు సంబంధించిన సమస్య



ఎవరు పెద్ద
కోఠీ నుంచి అమీర్ పేట వైపు బస్సు వెళుతోంది
మద్యలో ఇద్దరు అంటీ లు బస్సు ఎక్కారు

బస్సు అంతా ఫుల్ గా ఉంది ఒక్క సీటు తప్ప
ఆ సీటు నాదంటే నాదని

నేను ముందు ఎక్కానంటే నేనని ఫైటింగ్ స్టార్ట్ అయ్యింది

ఎవరు వారికి సర్ది చెప్పలేక పోతున్నారు

ఇంతలో ఒక పెద్దాయన సొల్యుషన్ చెప్పాడు

ఎవరు వయసులో పెద్దయితే వారిని కూర్చోమన్నాడు

అంతే జగడం ట్టకీ మని ఆగిపోయింది
అబిడ్స్ వచ్చేవరకు సీటు ఖాళీగానే ఉంది

26, జులై 2011, మంగళవారం

CRITICAL

అది DR గరుడాచలం ఆసుపత్రి

ఒక రోజు పొద్దున్నే ఒకామెను పురిటినోప్పులతో ఆసుపత్రి కి తీసుకొచ్చారు

గరుడాచలం ఆమెను చూసి ఆదరా బాదరా సిజేరియన్ ఆపరేషన్ చేసాడు

NURSE వచ్చి అడిగింది

డాక్టర్ డాక్టర్ కేసు అంత EMERGENCY యా

పరిస్తితి అంత CRITICAL గా ఉందా అని


దాని కి డాక్టర్ సమాధానం ఇచ్చాడు

అవును సిస్టర్ పరిస్తితి చాలా CRITICAL గా ఉంది

కాకపొతే పేషెంట్ ది కాదు ఆసుపత్రి FINANCIAL POSITION

కాసేపు ఆపరేషన్ ఆలస్యమై ఉంటే నార్మల్ డెలివరీ అయిపొయి చాలా నష్టం వచ్చేది

ఎవరు పెద్ద

వెంగలప్ప ఇంటర్వ్యూ కొచ్చాడు

ఆఫీసర్ అడుగుతున్నాడు

MR .వెంగలప్పా సింపుల్ ప్రశ్న

ఏనుగు పెద్దదా

చీమ పెద్దదా

వెంగలప్ప :కొంచెం క్లారిటీ మైంటైన్ చెయ్యండి సార్

రెండు మూడు సమాధానాలు ఉండే ప్రశ్నలు అడక్కండి అన్నాడు చిరాగ్గా

ఆఫీసర్ : ఏంటి దీనికి రెండు మూడు ANSWERS ఉన్నాయా ??? అని నోరు తెరిచాడు

వెంగలప్ప్ :YES OFFICER SIZE ప్రకారం అయితే ఏనుగు పెద్దది

AGE ప్రకారం అయితే ఎవరి DATE OF BIRTH ముందో వాళ్ళే పెద్దవాళ్ళు

VERY SIMPLE YOU KNOW అన్నాడు

3, జులై 2011, ఆదివారం

నేనే నెంబర్ వన్ నాదే వింబుల్డన్

TIME : 3 -7 -20011 రాత్రి 9.25PM

రేపటి వార్త పత్రికల్లో రాబోయే క్రీడా శీర్షికలు
వింబుల్డన్ గెలిచిన జోకోవిచ్ గురించి

నేనే నెంబర్ వన్
నాదే వింబుల్డన్

బుల్ కొమ్ములు వంచిన వీరుడు

26, జూన్ 2011, ఆదివారం

ఒక మాట


పెళ్లి అనేది ఇద్దరు మనుషులని దగ్గర చేస్తుంది
కాని చాలా మంది కావాల్సిన వారిని శాశ్వతంగా దూరం చేస్తుంది

జాడీ no 48 మందు


జాడీ no 48 మందు
ఒక ఊరిలో ఒక అతి తెలివి వెంగలప్ప ఉండేవాడు
అందరిని తన అతి తెలివితేటలతో ఆట పట్టిస్తూ ఉండేవాడు

ఆ ఊరికి కొత్తగా ఒక డాక్టర్ వచ్చి క్లినిక్ మొదలు పెట్టి ప్రాక్టీసు చెయ్యడం స్టార్ట్ చేసాడు

కొద్ది రోజుల్లోనే అతని హస్త వాసి మంచిదని బాగా ప్రచారం వచ్చి జనం విపరీతంగా అతని దగ్గరికి
రావడం మొదలెట్టారు

దాంతో వెంగలప్ప కన్ను డాక్టర్ మీద పడింది

ఎలాగైనా డాక్టర్ ని దెబ్బతీసి అతని పేరు చెడగొట్టాలని డిసైడ్ అయ్యాడు

ఆరోజు పేషెంట్ లాగా క్లినిక్ కు వెళ్లి చూపించుకున్నాడు
డాక్టర్ నాకు ఏమితిన్నా కూడా రుచి తెలయకుండా ఉంది
మంచి మందు ఇవ్వండి అనడిగాడు

తన అసిస్టెంట్ ద్వారా వెంగలప్ప గురించి విన్న డాక్టర్ ముందే రెడీ గా ఉన్నాడు

డాక్టర్ : అయితే నీకు no 48 జాడీ లో మందు బాగా సరిపోతుంది అంటూ
ఒక డబ్బా లాంటి దాంట్లో నుంచి
కొంచెం మందు తీసి ఇది తిని చూడు అన్నాడు

కొంచెం తీసుకొని తిన్న వెంగలప్ప యాక్ అని వెల్లమూసి
ఇది మందు కాదు ఆవుపేడ అన్నాడు వికారంగా మొహం పెట్టి

చూసావా అప్పుడే నీ నాలుకకి రుచి తెలుస్తోంది అన్నాడు డాక్టర్

తేలుకుట్టిన దొంగలాగా కిమ్మనకుండా అక్కడినుండి వెళ్ళిపోయాడు వెంగలప్ప

ఓ నెల ఆగి ఈ సారి ఎలాగైనా డాక్టర్ ని ముప్పుతిప్పలు పెట్టాలని మళ్లీ వచ్చాడు వెంగలప్ప

డాక్టర్ నాకు ఏది వాసన చూసినా ఏమి తెలయటం లేదు
మీ నాలెడ్జి అంటా ఉపయోగించి మందు ఇవ్వండి అనడిగాడు

అయితే నీకు వాసన తెలియడం లేదా అయితే జాడీ no 48 రెండు చెంచాలు రోజు నాలుగుసార్లు !!!!!!

డాక్టర్ మాట ఇంకా పూర్తి కాకుండానే వెంగలప్ప అక్కడి నుంచి జంప్

ఎవరు ఫాస్ట్

ఎవరు ఫాస్ట్

జపాన్ ప్రధాని లాలూ ప్రసాద్ యాదవ్ తో మాట్లాడుతున్నాడు
జపాన్ బీహార్ ఒకటే లా ఉండాలంటే ఏంచెయ్యాలి అని

జపాన్ ప్రద్జాని: లాలు జీ మీ బీహార్ ని మాకిచ్చి చూడండి
మూడు నెలల్లో జపాన్ లా మార్చేస్తాం అదీ మాగొప్పతనం అన్నాడు

దానికి లాలు
అబ్బే మీకెందుకు శ్రమ మీరే జపాన్ ని మాకిచ్చి చూడండి
ఒక నెల లోపే బీహార్ లా మార్చేస్తాం