పాత సామెత
ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టుకున్తామా
కొత్త సామెత
ఉగ్రవాదులు దూరారని తాజ్ హోటల్ ని పడ గొడతామా
మొక్కై వంగనిది మానై వంగుతుందా
కార్య కర్తగా మాట వినని వాడు నాయకుడై వింటాడా
అసలుతో పాటు కొసరు కూడా మాయం
ఎన్నికల్లో ఓడిపోయిన వాడికి డిపాసిట్ కూడా పోయినట్లు
సూది కోసం సోదికి పోతే పాత రంకు బయట పడ్డట్లు
ప్రతిపక్షం మీద సి బి ఐ దర్యాప్తు వేస్తే తన పాత కుంభకోణం బయట పడ్డట్లు
అయ్యకు లేక అడుక్కుతింటుంటే కొడుకొచ్చి కోడి కూర కావాలన్నట్లు
లీడర్ కే డిపాసిట్ దక్కక నీరసంగా ఉంటే కార్య కర్త వచ్చి బీరు బిరియాని అడిగినట్లు
19, డిసెంబర్ 2008, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి