31, డిసెంబర్ 2009, గురువారం
28, డిసెంబర్ 2009, సోమవారం
కొత్త గవర్నర్ గారి కొత్త ప్రమాణం
కొత్త గవర్నర్ గారి కొత్త ప్రమాణం
శాసనము ద్వారా నిర్మిత మైన రాజ్యాంగాని కి విధేయుడనై
పాలన జరుపుతానని ఒత్తిడులకు లొంగనని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నా
మరీ ముఖ్య్నగా రాజ్ భవన్ ను
రాసా లీలలకు తావులేని ప్రదేశంగా
మారుస్తానని
రాజ్ భవన్ ను రంభా భవన్ గా మారనివ్వనని
కూసంత గట్టిగా ప్రమాణం
చేస్తున్నాను
25, డిసెంబర్ 2009, శుక్రవారం
రోశయ్యకు నచ్చని తెలుగు పదం
రోశయ్యకు అన్ని బాషలలో నచ్చని
ఒకే ఒక్క తెలుగు పదం
రాజీనామా
సోనియా క్రిస్మస్ ప్రార్థన
పరలోకమునందున్న తండ్రీ
వీరు రాజీనామాలు ఎందుకు చేస్తున్నారో
వీరికే తెలియదు
వీరిని క్షమింపుడు
12, డిసెంబర్ 2009, శనివారం
విడిపోదాం రా
ప్రత్యేక దేశం కోసం ఎందుకు పోరాడకూడదు
ఒకరికింద మనమెందుకు బతకాలి
రండి వీటికి పోరాడండి
మనం భారత దేశం నుండి విడిపోదాం పదండి
తెలంగాణా దేశం
రాయల సీమ దేశం
ఆంధ్ర దేశం
6, డిసెంబర్ 2009, ఆదివారం
KCR దీక్ష విరమించాడు
మధ్యవర్తిత్వం చెయ్యడానికి చంద్రబాబు ఒప్పుకున్నాడు
తెలంగాణా ఇవ్వడానికి సోనియా ఒప్పుకుంది [హైదరాబాద్ తో సహా ]
హైదరాబాద్ లో అంతా హాపీస్ సమాప్తం
సారీ బ్లాగ్గర్స్
నాలుగైదు రోజులుగా టీవీ లు మీడియా న్యూస్ చూసి చూసి
నాకు మెంటల్ ఎక్కి ఇవన్ని రాయలేదు
ఏదో చదవానికి బాగుంటుందని ఇలా రాసుకున్నాను
నిజమైతే యెంత బాగుండు నో
19, నవంబర్ 2009, గురువారం
ENJOY
DIFFERENCE
ఏంటో రా తాగిన రోజు నేను ఎంతగా మేనేజ్ చేసినా ఇంట్లో దొరికి
పోతునాను
అన్నాడు గుర్నాదం దీనంగా రామనాథం తో
రామనాథం :అవునా నేను తాగినా సరే
మా ఇంట్లో వాళ్ళు అస్సలు కనుక్కోలేరురా అన్నాడు
అదెలా అడిగాడు గుర్నాథం
రామనాథం :ఏముంది తాగిన రోజు నేను అసలు ఇంటి కే వెళ్ళను కదా
REASON
పరీక్ష లో మూడో సారి తప్పినా కొడుకుని చెడా మడా వాళ్ళ నాన్న
తిడుతున్నాడు
ఒరే
ఆ పక్కింటి పంకజాన్ని చూడు
ఆటల్లో చూసినా ఫస్టే
పాటల్లో చూసినా ఫస్ట్
చదువులో చూసినా ఫస్ట్
ఇంటి పని లో చూసినా ఫస్టే
నువ్వు ఉన్నావు ఎందుకు దండగా అని తిడుతున్నాడు
అలా అన్ని సార్లు పంకజాన్ని రొజూ చూడబట్టే నా పొజిషన్ ఇలా ఉంది
డాడ్ అన్నాడు పుత్ర రత్నం
15, నవంబర్ 2009, ఆదివారం
ఎందుక లా
వెంగలప్ప తిక్కలప్ప ఇద్దరు ఫ్రెండ్స్
ఓ సారి ఇద్దరు దారిన పోతుంటే ఓ పెద్ద బిల్డింగ్ కాలిపోతూ కనిపించింది
ఇద్దరు వెంటనే ధైర్యం చేసి లోపలి కి వెళ్లి ఒక ఐదు ఆరు మందిని
రాము ఈ పరిస్తితులలో భవంతి ని వదలి రాలేము అంటున్నా
బలవంతంగా బయటికి లాక్కొచ్చి కాపాడారు
అయినా వాళ్లకు బహుమతుల బదులు జైలు శిక్ష తప్ప లేదు ఎందుకు
వాళ్ళు బలవంతాన కాపాడిన వాళ్ళంతా FIRE సిబ్బంది కనుక
10, నవంబర్ 2009, మంగళవారం
ఎలా తంతే నీకెందుకు
ఆ వెనుకే వెంగలాయి వస్తున్నాడు
కా సేపటికి వెంగలాయి వెర్రిపప్ప ను ఎగిరి ఒక తన్ను తన్నాడు
పైగా బొక్క బోర్లా పడ్డ వెర్రిపప్ప ను లేపుతూ ఏరా బాగున్నావా అని
పలకరించాడు
ఎక్కడో కాలింది వెర్రిపప్ప కు
ఏరా ఒళ్ళు బలిసిందా నన్ను అలా తన్నావు
అన్నాడు పళ్ళు నూరుతూ
సారి అంది మా ఫ్రెండ్ అనుకుని తన్నాను
ఏమి అనుకోవద్దు అన్నాడు వెంగలాయ్
యెంత ఫ్రెండ్ అయితే మాత్రం అలా ఎగిరి గాడిదను
తన్ని నట్లు తంతావా అడిగాడు వెర్రిపప్ప
నా ఫ్రెండ్ ను ఎలా తంతే నీకెందుకురా డోంగ్రీ అంటూ చకా వెళ్లి
పోయడ్డు వెంగలాయ్
8, నవంబర్ 2009, ఆదివారం
ఆ రూపాయి ఏమైంది
ముగ్గరు ఫ్రెండ్స్ కలిసి ఒక బట్టల కొట్టు కెళ్ళి
మూడు కర్చీఫ్ లు కొన్నారు ఒక్కొక్కటి పది రూపాయలు
దాంతో దుకాణ దారు సంతోషించి ఐదు రూపాయలు వెనక్కి ఇచ్చాడు
దాంతో వీళ్ళు సంతోషించి రెండు రూపాయలు tippu gaa అక్కడ
పనిచేవాడి కిచ్చి
మిగిలిన మూడు రూపాయలలో తలా ఒక రూపాయి తీసుకున్నారు
ఇప్పుడు ఒక్కరి కి ఒక కర్చీఫ్ యెంత పడింది
ముగ్గరికి తలా రూపాయి వెనక్కి వచ్చింది కనుక ఒక్కటి తొమ్మిది
అంటారా
9x3 =27
tippu = 2
-----------------
total 29
in total 30 rupees lo migilina
మరి ఆ రూపాయి ఏ మైంది
7, నవంబర్ 2009, శనివారం
6, నవంబర్ 2009, శుక్రవారం
1, నవంబర్ 2009, ఆదివారం
jokes
అమ్మా
బాబిగాడి కి పళ్ళు వచ్చాయమ్మా
నీ కెలా తెలుసే
ఇందాక మూతి మీద గట్టి గా కొట్టి నప్పుడు
రెండు కిందకు రాలి పడ్డాయిలే
లింగం :అయ్యా ఈ రోడ్డు వెంట వెళితే ఏ మొస్తుందండి
వెంగలాయ్ :పేపర్ తీసుకో
పెన్ను కూడా తీసుకో ఇప్పుడు రాసుకో
9100012345
లేకపోతె
30621345
అదీ లేక పొతే
౩-5/42
ఈతముక్కల పాలెం
near ఎదుర్లంక
దీనికి పోస్ట్ చెయ్యి
లింగం :ఏంటి చేసేది
వెంగలాయ్ :నాకూ ఈ ఊరు కొత్త
ఈ రోడ్డు వెంబడి వెళ్తే ఏమొస్తుందో నువ్వు వెళ్ళాక
నా కు కూడా కాస్త ఫోన్ గాని పోస్ట్ చెసి కాని చెప్పు
30, అక్టోబర్ 2009, శుక్రవారం
28, అక్టోబర్ 2009, బుధవారం
వంగ తోట కాడ దొంగ మామ
ఈ మద్య వచ్చిన బి టి వంకాయల గురించి పత్రిక వ్యాఖ్యలు
వంగ తోట కాడ దొంగ మామ
చేనుకు చేవ రైతు కు రొక్కం ఇది గ్రోమోర్ యాడ్
చేనుకు కాటు రైతుకు చేటు ఇది ఈనాటి పరిస్తితి
ఆరోగ్యశ్రీ గురించి నా పేరడీ
ఆరోగ్య శ్రీ
కార్పొరేట్ ఆసుపత్రికి చేవ డాక్టర్స్ కి రొక్కం
25, అక్టోబర్ 2009, ఆదివారం
23, అక్టోబర్ 2009, శుక్రవారం
కొత్తరకం తిట్టు
కొత్తరకం తిట్టు
ఎరా పనికి మాలిన సోంబేరి బడుద్దాయ్
ఏదైనా సాధించాలంటే
మాటలు కాదు పని చెయ్యడం నేర్చుకో
నువ్వేమైనా ఒబామా అనుకుంటున్నావా
తేరగా అవార్డు కొట్టెయ్యడానికి
19, అక్టోబర్ 2009, సోమవారం
ఒప్పుకోంది ఎవరు
రాజు చాలా కాలానికి గోపాల్ ని కలిసాడు
రాజు :అరె గోపాల్ నువ్వు ఇంతకు ముందు ఒక అమ్మాయికి లైన్
వేసేవాడివి కదా
మరి పెళ్లి అయిపోయిందా
గోపాల్ :లేదురా అన్నాడు నిరాశగా
రాజు :ఏం ఆ అమ్మాయి ఒప్పుకోలేదా
గోపాల్:అదేం కాదురా
రాజు :మరి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదా
గోపాల్:అదీ కాదురా
రాజు :అయితే వాళ్ళ అన్నకో బామ్మకో నువ్వు నచ్చలేదా
గోపాల్:ఉహు అదేం లేదు
రాజు :మరి ఇంకేంట్రా సమస్యా ?
గోపాల్:ఆ అమ్మాయి భర్త ఒప్పుకోలేదురా
17, అక్టోబర్ 2009, శనివారం
చీకటి వెలుగుల రంగేళి
చీకటి వెలుగుల రంగేళి
జీవితమే ఒక దీపావళి
ఆనందాల వెలుగుల కాంతుల రవళి
ఆ వెలుగుల లోనే
జగమంతా జలకాలాడాలి
బాహ్య ప్రపపంచం లోని వెలుగు నీడల్ని
కనిపెట్టడం చాలా సులువు
కాని మన మనసు పొరల్లో దాగి ఉన్న వెలుగు నీడల జాడల్ని
కనుక్కోవడం అందరికి శక్తికి మించిన పని
మనసు పొరల్ని చుట్టుకొని ఉన్న
చీకటి దారాల్ని పారద్రోలే
వెలుగు దీపం మన మనస్సాక్షే
మన మనస్సు తేటగా ఉంటె అది వెలుగుల గూడు అవుతుంది
మన నడక ధర్మ బద్దమైతే వెలుగుల దారి కనిపిస్తుంది
మనం ఎంచుకున్న దారిని బట్టి వెలుగు నీడలు ఎదురవుతాయి
పక్క వాడి గుండెల నిండా
చిక్కనైన రోదన నిండ
ఏ హాయి దరి రాదు నీవైపుకు
అన్న కవి మాటలు గుర్తు తెచ్చుకుంటూ
మన తోటి వాని జీవితం లో దాగి ఉన్న కష్టాల చీకట్లని
ఏ కాస్తయినా మన చేతనైనంత మన పరిధిలో తీర్చ గలిగి
ఆనందపు వెలుగులను పంచ గలిగితే
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)