6, సెప్టెంబర్ 2009, ఆదివారం

అడవి మింగిన ఆసమాన నాయకుడు




అడవి మింగిన ఆసమాన నాయకుడు

మబ్బులతో కుట్ర చేసి
పొగమంచు వలను కప్పి
గద్దలా తన్నుకు పోయిన లోహ విహంగం

ఆ చెయ్యి సాయం పొందిన
ప్రతి మనిషి ఒక కల్లోల కడలి
ప్రతి మనసు ఒక దుఃఖ సాగరం
ప్రతి కన్ను ఒక కన్నీటి సంద్రం
ప్రతి కుటుంబం విషాద కాసారం
ఆంధ్ర దేశం అంతా
ఆక్రోశ మయం

రాజ శేఖరా
నీపై మోజు తీర లేదురా
నీ లాంటి నాయయకుడు
మళ్లీ మాకు దొరకడు
అందుకే నువ్వే మళ్లీ
ఈ పుడమి పై పుట్టి
నీ కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం
తిరిగిరా

1 కామెంట్‌:

Praveen Rangineni చెప్పారు...

ఆవేదన కనిపించింది..కాని "అడవి మింగింది" అనడం బాగా లేదండి...