30, అక్టోబర్ 2009, శుక్రవారం

మందు మాట


మందు మాట


28, అక్టోబర్ 2009, బుధవారం

వంగ తోట కాడ దొంగ మామ

ఈ మద్య వచ్చిన బి టి వంకాయల గురించి పత్రిక వ్యాఖ్యలు
వంగ తోట కాడ దొంగ మామ
చేనుకు చేవ రైతు కు రొక్కం ఇది గ్రోమోర్ యాడ్

చేనుకు కాటు రైతుకు చేటు ఇది ఈనాటి పరిస్తితి




ఆరోగ్యశ్రీ గురించి నా పేరడీ


ఆరోగ్య శ్రీ

కార్పొరేట్ ఆసుపత్రికి చేవ డాక్టర్స్ కి రొక్కం

25, అక్టోబర్ 2009, ఆదివారం

భీత హరినేక్షిణి


భీత హరిణేక్షిని

23, అక్టోబర్ 2009, శుక్రవారం

కొత్తరకం తిట్టు

కొత్తరకం తిట్టు

ఎరా పనికి మాలిన సోంబేరి బడుద్దాయ్
ఏదైనా సాధించాలంటే

మాటలు కాదు పని చెయ్యడం నేర్చుకో

నువ్వేమైనా ఒబామా అనుకుంటున్నావా


తేరగా అవార్డు కొట్టెయ్యడానికి

తెల్ల జండా



ఇహ జగన్ని ముఖ్యమంత్రి చెయ్యడం నావల్ల కాదు

చేతులెత్తి తెల్ల జండా చూపించడం మేలు అంటున్నట్టు లేదూ

kvp gaaru

19, అక్టోబర్ 2009, సోమవారం

ఒప్పుకోంది ఎవరు


రాజు చాలా కాలానికి గోపాల్ ని కలిసాడు

రాజు :అరె గోపాల్ నువ్వు ఇంతకు ముందు ఒక అమ్మాయికి లైన్

వేసేవాడివి కదా

మరి పెళ్లి అయిపోయిందా

గోపాల్ :లేదురా అన్నాడు నిరాశగా

రాజు :ఏం ఆ అమ్మాయి ఒప్పుకోలేదా

గోపాల్:అదేం కాదురా

రాజు :మరి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదా

గోపాల్:అదీ కాదురా

రాజు :అయితే వాళ్ళ అన్నకో బామ్మకో నువ్వు నచ్చలేదా

గోపాల్:ఉహు అదేం లేదు

రాజు :మరి ఇంకేంట్రా సమస్యా ?


గోపాల్:ఆ అమ్మాయి భర్త ఒప్పుకోలేదురా

17, అక్టోబర్ 2009, శనివారం

చీకటి వెలుగుల రంగేళి


చీకటి వెలుగుల రంగేళి

జీవితమే ఒక దీపావళి

ఆనందాల వెలుగుల కాంతుల రవళి

ఆ వెలుగుల లోనే

జగమంతా జలకాలాడాలి


బాహ్య ప్రపపంచం లోని వెలుగు నీడల్ని

కనిపెట్టడం చాలా సులువు

కాని మన మనసు పొరల్లో దాగి ఉన్న వెలుగు నీడల జాడల్ని

కనుక్కోవడం అందరికి శక్తికి మించిన పని

మనసు పొరల్ని చుట్టుకొని ఉన్న

చీకటి దారాల్ని పారద్రోలే

వెలుగు దీపం మన మనస్సాక్షే



మన మనస్సు తేటగా ఉంటె అది వెలుగుల గూడు అవుతుంది

మన నడక ధర్మ బద్దమైతే వెలుగుల దారి కనిపిస్తుంది

మనం ఎంచుకున్న దారిని బట్టి వెలుగు నీడలు ఎదురవుతాయి



పక్క వాడి గుండెల నిండా

చిక్కనైన రోదన నిండ

ఏ హాయి దరి రాదు నీవైపుకు


అన్న కవి మాటలు గుర్తు తెచ్చుకుంటూ



మన తోటి వాని జీవితం లో దాగి ఉన్న కష్టాల చీకట్లని

ఏ కాస్తయినా మన చేతనైనంత మన పరిధిలో తీర్చ గలిగి

ఆనందపు వెలుగులను పంచ గలిగితే

అంతకు మించిన దీపావళి ఎవరికైనా ఇంకేముంటుంది

happy diwali to all

15, అక్టోబర్ 2009, గురువారం

అతి మర్యాద

అతి మర్యాద చూపే నర్సు /వార్డ్ బాయ్


OP లోకి పేషెంట్ రాగానే
ఏం తీసుకుంటారు కాఫీ టీ స్నాక్స్
అని ఆఫర్ చేసేవాళ్ళు

కొన్ని వాహనాల వెనుక రాసిన రాతలు

కొన్ని వాహనాల వెనుక రాసిన రాతలు

వెంటపడకురా వెర్రివాడా

అన్నదమ్ముల అనుబందం

తొందరపడకు సుందర వదనా

PLEASE SOUND HORN

ఆగి నిదానముగా వెళ్ళుము

12, అక్టోబర్ 2009, సోమవారం

వరద-- బురద


ప్రకృతి తెచ్చింది వాన వరద

ఇప్పుడు మొదలైంది నాయకుల వరద
వాటితో పాటే తిట్ల బురద
వీళ్ళంతా జనాల పాలిట దురద
దీన్ని ఏ ఫినాయిల్ తో కడిగితే పోతుందో

సానుభూతి తెలిపే వంద నోర్ల కన్నా
సాయం చేసే ఒక్క చెయ్యి మిన్న
ఈ నాయకులు ఎప్పుడు తెలుసుకుంటారో

కొన్ని జీవితాలింతే

కొన్ని జీవితాలింతే

అరటి తొక్క :
ఒడుపుగా చేతిలో పట్టుకొని సుతారంగా ఒక్కొక్క తొన వలిచి

అంటా తినే వరకు జాగ్రత్తగా పట్టుకొని పని అయిపోగానే దాని పని మటాష్ {తొక్కలో జీవితం }


కరివేపాకు ;

వంట అయ్యేవరకు మైసూరు పాకు

అయిపోయాక కరివేపాకు అంటే ఇదే

నిర్దాక్షిణ్యంగా తీసి ప్లేటు అవతల పడేస్తాం


పుల్లైసులో పుల్ల :


కొంచెం కొంచెం చప్పరిస్తూ కొంచెం చప్పుడు చేస్తూ ఆనందం అనుభవించి

అంతా తినేసి దాన్ని {పుల్లను }ఎలా విసిరి పారేస్తామో అందరికి తెలిసిందే కదా