12, అక్టోబర్ 2009, సోమవారం

కొన్ని జీవితాలింతే

కొన్ని జీవితాలింతే

అరటి తొక్క :
ఒడుపుగా చేతిలో పట్టుకొని సుతారంగా ఒక్కొక్క తొన వలిచి

అంటా తినే వరకు జాగ్రత్తగా పట్టుకొని పని అయిపోగానే దాని పని మటాష్ {తొక్కలో జీవితం }


కరివేపాకు ;

వంట అయ్యేవరకు మైసూరు పాకు

అయిపోయాక కరివేపాకు అంటే ఇదే

నిర్దాక్షిణ్యంగా తీసి ప్లేటు అవతల పడేస్తాం


పుల్లైసులో పుల్ల :


కొంచెం కొంచెం చప్పరిస్తూ కొంచెం చప్పుడు చేస్తూ ఆనందం అనుభవించి

అంతా తినేసి దాన్ని {పుల్లను }ఎలా విసిరి పారేస్తామో అందరికి తెలిసిందే కదా

కామెంట్‌లు లేవు: