22, డిసెంబర్ 2010, బుధవారం

పెద్దవారిని ప్రేమించండి

ఒక 75 ఏళ్ళ పెద్దాయన ఆయన కొడుకు పార్క్ లో ఇంటి బయట లాన్ లో కూర్చున్నారు

దూరంగా ఒక పిచ్చుక వచ్చి వాలింది

అదేంటి అని అడిగాడు ఆ పెద్దాయన కొడుకుని

పిచ్చుక నాన్నా అని చెప్పాడు కొడుకు

కాసేపటికి మళ్లీ ఫాదర్ అడిగాడు అదేంటి అని

పిచ్చిక అని చెప్పాను కదా నాన్నా కొంచెం గొంతు పెంచి చెప్పాడు కొడుకు


కాసేపయ్యాక మళ్లీ అడిగాడు అదేంటి అని ఆ ఫాదర్

అది పిచ్చుక నాన్నా ఇందాక చెప్పాను కదా ఈసారి కొచెం విసుగ్గానే చెప్పాడు కొడుకు


అలా ఓ పది సార్లు అదే అదే అడిగాడు ఆ ఫాదర్ అదేంటి అని

పదోసారి ఆ కొడుకు లేచి గట్టిగా అరిచాడు

ఎందుకు నాన్న ఇలా చంపుతున్నావ్ పిచ్చుక అని చెప్పాను కదా

పెద్దాయన లేచి మౌనంగా అక్కడి నుంచి ఇంట్లోకి పోయి ఒక పాత డైరీ తెచ్చి ఒక పేజి చూపించి

పైకి వినిపించేటట్లు చదవమన్నాడు కొడుకుని


కొడుకు చదవ సాగాడు

ఇప్పుడు మా అబ్బాయికి ఆరేళ్ళు ఒక రోజు ఇద్దరం పార్క్ కు వచ్చాము

అక్కడ ఒక పిచ్చుక వాలి ఆడుకుంటోంది

మా బాబు అదేంటి నాన్నా అని అడిగాడు

పిచ్చుక బాబు అనిచెప్పాను

మళ్ళి అడిగాడు మళ్ళి చెప్పాను అలా ఒక యాభై సార్లు అడిగింటాడు

అడిగిన ప్రతిసారి చెప్పాను అడిగిన ప్రతిసారి ప్రేమగా బుగ్గ మీద ముద్దు కూడా పెట్టుకున్నాను

మురిపెం తో !!!!!!!!!!!!!

ఇంకా ఆ కొడుకు ఆపైన చదవలేక పోయాయాడు గొంతు మూగ బోయి కంటికి నీటి పొరలు అడ్డపడడం తో

[నాన్నకి అల్జేమేర్స్ వ్యాధి ఉందని ఏదైనా వెంటనే

మర్చిపోతాడని గుర్తొచ్చింది ]


నాన్న ని గట్టిగా హత్తుకొని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు


take హోం: పెద్దవారిని ప్రేమించండి వయసు సమస్యల వల్ల విసిగించినా సహనంగా ఉండండి


1 కామెంట్‌:

chanukya చెప్పారు...

తట్టుకోలేకపోతున్నాను