సుబ్బారావు హోటల్ కెళ్ళాడు
సర్వ రావు ని పిల్చి ఏమోయ్ వేడి వేడి బిరియాని తీసుకురా
ఒకనితో బాగా గొడవపడాలి అన్నాడు
సర్వారావు బిరియాని తెచ్చి ఉత్సాహంగా ఎవరితో సార్ అన్నాడు
చెబుతా అని బిరియాని లాగించి ఈసారి కోడి పలావ్ తేవోయ్
ఒకనితో బాగా తగువాడాలి అన్నాడు
సర్వర్ గబా గబా తెచ్చి మరింత ఆసక్తి గా అడిగాడు ఎవరితో సార్ అని
చెబుతా చెబుతా ఈసారి ఓ ఫుల్ బాటిల్ విస్కీ తే
తగువు కు బాగా ప్రిపేర్ కావాలి అన్నాడు
సర్వర్ కు సస్పెన్స్ తో బిపి పెరిగిపోతోంది
ఇంకా తగువాడేసుకోవడానికి అవతలి పార్టీ కనబడలేదే అని
ఇంకా పట్టలేక మళ్లీ సుబ్బారావు ని అడిగాడు ఫైటింగ్ ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అని
ఇప్పుడు బిల్ అడిగితే నీతోనే కూల్ గా చెప్పాడు సుబ్బారావు
1 కామెంట్:
:):)
కామెంట్‌ను పోస్ట్ చేయండి