12, సెప్టెంబర్ 2010, ఆదివారం

ముందంతా అవేగా

సుందరి:
డియర్ మన పెళ్లైయ్యాక మీ ప్రతి కష్టం లో
నేను భాగం పంచుకుంటాను

సుబ్బారావు :కష్టాలా ఇప్పటి వరకు నాకేమి లేవు
పైగా అవంటే ఏంటో కూడా నాకు తెలియదు తెలుసా అన్నాడు ధీమాగా

నేను చెప్పింది మన పెళ్లైయ్యాక సంగతి అంది గారంగా

అమ్మ తోడు అడ్డంగా చింపుతా

ఇద్దరు వ్యక్తులు సినిమా హాలు ముందు తెగ కొట్టు కుంటున్నారు
నువ్వెంత అంటే నువ్వెంత

నీ లెవలేంటి నా లెవలేంటి
నా క్లాస్స్ ఏంటి నీ క్లాస్స్ ఏంటి
నా జోలి కొస్తే అమ్మ తోడు అడ్డంగా చింపుతా
అంటూ ఒకతను రెచ్చిపోతున్నాడు

సిన్మా కొచ్చిన అప్పారావు ఉండ బట్టలేక అడిగాడు
బాబు ఏమిటి గొడవ ఇంతకీ మీ రెవరు అని

మేమా ఈ హాల్లో గేటు కాడ టికెట్స్ చింపే వాళ్ళం అన్నాడు

మరి లెవెల్ క్లాస్ అన్నారేంటి

అదా నేనేమో పైన బాల్కాని లో చింపుతా
వీడేమో నేల క్లాస్ లో చింపుతాడు
మరి తేడా లేదా

అప్పారావు :????????

24, ఆగస్టు 2010, మంగళవారం

ugly దర్శన్ బేకార్ న్యూస్

హాయ్ this is ugly దర్శన్
బేకార్ న్యూస్ at 9 pm

హెడ్ లైన్స్
కెసిఆర్ చంద్ర బాబు ను తిట్టాడు
చంద్ర బాబు సోనియా ను దుమ్మెత్తి పోసాడు
సోనియా జగన్ మీద ఆగ్రహం చూపించింది
జగన్ మిగతా కాంగ్రెస్ వృద్ద నాయకులను ఆడి పోసుకున్నాడు
టీవీ చానెల్స్ 24 గంటలు ఇవే చూపించి జనాలకు నరకం చూపించాయి

[OFCOURSE మద్య మద్య లో DRUGS అండ్ సెక్స్ స్కాండల్ కూడా ]

రోశయ్య అన్నింటిని కులాసా గా చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు

ఈ బేవార్స్ కార్యక్రమాన్ని మీ మొహాన తగలేసిన వారు

420 బ్రదర్స్ పంజా గుట్ట

నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మా


నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మా

అన్నా చెల్లెళ్ళు
ఒకే కొమ్మ కు పూసిన పువ్వులు
ఒకే కుంటుంబం లో విరిసిన నవ్వులు
అమ్మలో మొదటి సగం నాన్న లో రెండో సగం
అన్నీ కలిసిన అన్న అనురాగం
రాఖీ రోజు కట్టే రాఖీలు
కావవి వట్టి నూలు దారాలు
అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని తెలిపే మందారాలు
కలకాలం కాల పరీక్ష కు తట్టుకుని నిలిచే బతుకు తీగలు

అందరికి రాఖీ పూర్ణిమ పండగ శుభాకాంక్షలు

22, ఆగస్టు 2010, ఆదివారం

డాక్టర్ల కి సిన్మా హీరోలు పూనితే

సింహా డాక్టర్

నర్సుల కు చీఫ్ డాక్టర్ వార్నింగ్

నేను మాట్లాడుతున్నప్పుడు మీ బుర్ర లే పని చెయ్యాలి
కాదని మరేది పని చేసినా నెక్స్ట్ డ్యూటీ మీకు ఉండదు

సర్జన్ పేషెంట్ తో ఆపరేషన్ కు ముందు

అర్థ గంటలో అయిపోయేవాడివి
నీకు నా details గురించి అవసరమంటావా

సీమ సింహం డాక్టర్
నేను కొయ్యడం [సర్జరీ ] మొదలు పెడితే ఎటునుండి ఎటు వెళ్తానో
ఎక్కడ తేలుతానో నాకే తెలియదు be కేర్ ఫుల్ విత్ me

పోకిరి డాక్టర్
ఎవరి చెయ్యి పడితే పేషెంట్ జేబు ఖాళీ అయ్యి
ఇల్లు వాకిలి అమ్ముకొని వైద్యానికి ఖర్చు పెట్టి
దివాలా తీసి మైండ్ బ్లాక్ అయ్యి జీవితం మీద విరక్తి కలిగి
పైకి పోతాడో
వాడే డాక్టర్ పండు

basha doctor
నేను ఒక్క సారి పేషెంట్ చెయ్యి పట్టుకుంటే వంద సార్లు పట్టుకున్నట్లే
అంత ఫీజు కక్కాల్సిందే

అతడు డాక్టర్

సర్జన్ ను చూడలనుకో
అంతే కాని surgery ని చూడాలనుకుంటే పోతావ్


ఫాక్షన్ డాక్టర్
నీ వార్డ్ కొచ్చా నీ ఓపి కి వచ్చా
నీ ఆపరేషన్ ధియేటర్ కూడా వచ్చా
కత్తెర్లు కత్తుల తో కాదురా కంటి చూపుతో సర్జరీ చేసి పారేస్తా


బొమ్మ రిల్లు డాక్టర్

[చీఫ్ డాక్టర్ కి జూనియర్ డాక్టర్ కి మధ్య సంభాషణ]

ఒరే కుర్ర డాక్టర్
తప్పు చేసానని నువ్వంటున్నావ్
అంటా నేనే చేసానని హెడ్ నర్సు అంటోంది
నేనేం చేసినా మీకోసమే చేశాను అది తప్పేలా అవుతుంది

అవును అంతా మీరే చేసారు
op కి వెళ్ళ మంటారు
కాని పేషెంట్ ను మీకు చెప్పకుండా పంపియద్దని వార్డ్ బాయ్ కి మీరే చెబుతారు

ధియేటర్ కి వెళ్లి ఆపరేషన్ చేయమంటారు
కాని సీనియర్ కి తెలియకుండా ఏమి చేయనీయద్దని ముందుగానే నర్సు కు ఫోన్ చేసి చెబుతారు

చివరికి జ్వరానికి ఏ సూది ఎలా వేయాలో మీరే చెబితే ఇంకా మేము నేర్చుకునేది ఎప్పుడు సర్
అంతా నవ్వుతున్నారు సార్ నా జీవితాని చూసి

సీతయ్య డాక్టర్
20 మంచాలు 30 కుర్చీలు 10 వార్డ్ బాయ్ లు
15 నర్సులు మరో పది మంది డాక్టర్ లున్న
ఈ హాస్పిటల్ లో నాకు తెలియకుండా సర్జరీ జరిగింది
ఎవరు ఎలా చేసారో నా కిప్పుడే
తెలియాలి
తెలియాలి
తెలియాలి

అగ్ని డాక్టర్
సత్యాని కి న్యాయానికి ధర్మానికి గుర్తులు
కనిపించే ఆ మూడు సింహాలైతే

ఆసుపత్రుల లో ఆరోగ్య శ్రీ లో అవినీతి ని చీల్చి చెండాడే
ఆ నాలుగో సింహమేరా ఈ డాక్టర్ అగ్ని



18, ఆగస్టు 2010, బుధవారం

మెడికల్ పద్యాలు

పెనిసిలిన్ ఇన్సులిన్ పేర్లు ఒక్కటిగా నుండను
చూడ చూడ వాటి పనులు వేరు
బాయ్స్ నందు వార్డ్ బాయ్స్ వేరయా
విశ్వదాభి రామ ఇనుకోరా రామా

గబా గబా పరు గెట్టించును డయేరియా
గజ గజ వణి కించును మలేరియా
గజ రాజును తలపించును ఫైలేరియా

గత చీకటి రాత్రి తప్పు కు గుర్తు గనేరియా

సెన్సిటివ్ డాక్టర్

మరీ సెన్సిటివ్ డాక్టర్

పేషెంట్ తన బాధలు చెప్పేటప్పుడు కళ్ళ లో నీళ్ళు తిరిగి
కర్చీఫ్ తో తుడుచు కుంటూ వినేవాడు



కొత్త గా చేరిన నర్సు

పేషెంట్ రాగానే ఏం తీసుకుంటారు
కాఫీ నా టీ నా లేక కూల్ డ్రింకా అని మర్యాద చేసేది