సినిమా నాయికలు ల పేర్లతో పద్యం
జయప్రద
జయ సుధ
శ్రీదేవి
సౌందర్య
ఈ దత్త పదులతో రామాయణం నేపధ్యం లో పద్యం రచించడం
చింతా రామకృష్ణారావు. అన్నారు...
జైభారత్! దత్త పది - రామాయణాంశము. వ్రాశాను చూడండి.
తేటగీతి:-
పుత్ర కామేష్టి జయప్రదముగనుముగిసె.
విజయసుధలొల్కగను రాముడు జనియించె.
సుగుణ శ్రీదేవియే జానకిగ జనించె.
వారి సౌందర్యమునను గాంచి వసుధ మురిసె.
సాహితీ ప్రేమికులకు పసందైన విందు కదూ
మీకు సమస్యా పూరణం లో ప్రవేశం ఉంటే
ఈ కింది వాటిని నాలుగు పాదాలలో [ఒక్కొక్కటి ఒక పాదం లో ] ఉపయోగించి ఒక పద్యం రాయగలరు
రాకెట్టు
జాకెట్టు
కనికట్టు
తీసికట్టు
భవదీయుడు
జయభారత్
జయభారత్! సంతోషం.
మీరిచ్చిన దత్త పదులను మీరు కోరినట్లే నాలుగు పాదాలలో చేర్చి కందం వ్రాస్తున్నాను చూడండి.
కందము:-
రాకెట్టులుండు కవిత? మ
జాకెట్టురచింపమన్న చక్కగ నటులే
మీకని కట్టుదు ఛందము.
నాకవితకు తీసికట్టు నసుగుడు కవితల్.
మీరూ ప్రయత్నిస్తే చక్కగా వ్రాయగలుగుతారు. ఎన్ని వేలకిలోమీటర్లదూరం వెళ్ళాలన్నా మొదటి అడుగుతోటే ప్రయాణం ప్రరంభమౌతుంది. అలాగే మీకవితా రచన ప్రయాణం కూడా. మరి ఆలస్యమెందుకు? మొదలుపెట్టండి పద్య రచన.
చాలా కృతజ్ఞతలు చింతా రామకృష్ణారావు. గారికి