31, మార్చి 2009, మంగళవారం

THE GREAT INDIAN FIGHT BACK

న్యూజిలాండ్ తో ఇండియా డ్రా చేసుకోవడం ఎంతో సంతోషం

సీనియర్లు అందరూ కలిసికట్టుగా ఆడి గట్టె క్కించడం కన్నుల పండువగా 
ఉంది
చివరి టెస్టు ఇలాగే స్ఫూర్తి దాయకంగా ఆడాలని కోరుకుంటూ

election specials

నది దాటకముందు పడవ మల్లయ్య
దాటాక బోడి మల్లయ్య
పోలింగు కు ముందు ఓటు మల్లయ్య
ఎన్నికలు అయ్యాక బొంగు మల్లయ్య

28, మార్చి 2009, శనివారం

ఎలెక్షన్ స్పెషల్

దున్న పోతు మీద వాన కురిసినట్లు


పొలిటీషియన్ మీద ఎన్నికల కోడ్ విధించినట్లు




చెవిటివాని ముందు శంఖ మూదినట్లు


రాజకీయ నాయకునికి ఎన్నికల కోడ్ గురించి చెప్పినట్లు





తాత కు దగ్గులు నేర్పుతావా


పోలీసులకు బూతులు నేర్పుతావా

27, మార్చి 2009, శుక్రవారం

ELECTION SPECIALS

అందం చందం లేని మొగుడు మంచం నిండా ఉన్నట్లు  

డబ్బు పలుకుబడి లేని నాయకులు పార్టీ నిండా ఉన్నట్లు  

తాదూర కంత లేదు మెడకో డోలు అన్నట్లు  

డిపాసిట్టుకు డబ్బులు లేవు గాని

నామినషన్ కు ఊరంతా ఊరేగింపు గావాలన్నట్లు

ఇల్లలక గానే పండుగ కాదు  

పార్టీ టిక్కెట్ రాగానే MLA అయినట్లు గాదు

26, మార్చి 2009, గురువారం

రావమ్మ ఉగాదీ రావమ్మా



దుష్టులకు దుర్మార్గానికి విరోధివై

అన్యాయాలకు ఆసిడ్ దాడులకు విరోధివై

అవినీతికి విరోధివై

అసమానతలకు విరోధివై

ప్రజాకంటకులకు విరోధివై

ప్రజల ప్రాణాలతో ఆడుకునే ముస్కురులకు విరోధివై

రావమ్మ విరోధి ఉగాదీ రావమ్మా

తస్మ దీయులకు విరోధివై

అస్మ దీయులకు అనురాగ వారధివై

వసంత రుతు రథ చక్రాలమీద

కోయిల కూత లు చివుళ్ళ పూతల అశ్వాల మీద

ఠీవిగా రావమ్మా ఉగాదీ రావమ్మా

ఎల్ల భారతావని ని ఆమని తో నింపగా


బ్లాగరు మిత్రులందరికి

ప్రపంచ వ్యాప్త తెలుగు వారు


అందరికి ఉగాదీ పర్వదిన శుభాకాంక్షలు

మీ

జయభారత్

25, మార్చి 2009, బుధవారం

ఎలెక్షన్ సామెతలు

వండుకున్నమ్మకు ఒకటే కూర అడుక్కునే అమ్మకు అరవై కూరలు  

కుదురుగా ఉన్న వాడికి ఒకటే పార్టీ ,, ఫిరాయించే వాడికి ఫిఫ్టీ పార్టీలు


ఎన్నికలప్పుడు విడుదలయ్యే సినిమా పేరు

తిట్టుకుందాం రా

తొడ గొట్టిన తొట్టి నాయాలు

మీసాలు తిప్పిన పిచ్చినా రొయ్య


పొలిటికల్ బూతులు అంతమయ్యే బూతు  

పోలింగు బూతు[[ఆరోజుతో తిట్లు ఆగిపోతాయిగా ]]

ఎలెక్షన్ సామెతలు

ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకు నిప్పు అడిగాడంట ఒకడు  

డిపాజిట్టు రాక లీడర్ ఏడుస్తుంటే

కార్య కర్త వచ్చి బీరు బిరియాని అడిగినట్లు  



కంచె చేను మేస్తే

కాంపౌండ్ వాలే కబ్జా చేస్తే
ఎలెక్షన్ ఆఫీసరే రిగ్గింగు చేస్తే

సా " మోత "

ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నట్లు  

బ్లాగును చూసి బ్లాగరిని అంచనావెయ్యమన్నట్లు

24, మార్చి 2009, మంగళవారం

కొత్త బ్లాగులు -- వాటి పేర్లు

పానకం లో పుడక
జిగురుపాకం
కాలిన కట్టె
పిచ్చి మొక్కలు
వాసన లేని పువ్వు
జీవం లేని నవ్వు

రాలిన ఆకు

ఒత్తి లో పత్తి 

అక్షరం ఆత్మహత్య చేసుకుంటే  

చదువుతారా చస్తారా


జీర్ణ వ్యవస్థ

science class lo

మాస్టారు : ఒరే అయోమయం  

జీర్ణ వ్యవస్థని క్లుప్తముగా నిర్వ చింపుము  

అయోమయం :కుడి చేయి ఆక్షన్ తో మొదలై ఎడమ చేత్తో ముగిసే 

సుదీర్గ ప్రక్రియ సార్

23, మార్చి 2009, సోమవారం

ఈల

అరుణ్ : మా నాన్న ఎప్పుడూ ఈల వేస్తూ పనిచేస్తుంటాడు తెలుసా
పవన్ : అవునా ఎప్పుడూ అంత సంతోషంగా ఉంటారా
అరుణ్ : అదేం కాదులే మా నాన్న ట్రాఫ్ఫిక్ పోలిసు

ఎన్నికల సామెతలు

అత్త కొట్టినందుకు కాదు 

తోడికోడలు నవ్వినందుకు ఫీలయ్యాను అన్నాదట ఒకామె
ఎన్నికల్లో ఓడినందుకు కాదు గాని 

డిపాజిట్ రాక ఎగస్పార్టీ వాడు నవ్వినందుకు ఫీలయినట్లు

నిర్వచనం

నిర్వచనం 

father in law అంటే 
 
పకృతి సిద్దమైన బ్యాంకర్ [banker provided by nature ]

జోకు --సైజు జీరో

డాడి నాకు ఆ అమ్మాయి భలే గా నచ్చింది
ఆ ఆమె ఫిగరు 36-24-36 ఇంకా బాగా నచ్చింది
నువ్వు ఎలాగైనా ఒప్పుకోవాలి డాడ్ మారాం చేసాడు అబ్బాయి 

దానికి ఫాదర్ అన్నాడు

నువ్వు ఆసంగతి మరచిపోతే మేలు మై సన్
అమ్మాయి సైజు సంగతేమో గాని వాళ్ళ నాన్న బ్యాంకు బాలన్స్ ఫిగరు  

సైజు నాకు
అస్సలు నచ్చలేదు ఎందుకంటె అది జీరో కాబట్టి

అరిటాకు సామెత

ఓటరు వెళ్లి సారాయి మీద పడ్డా
సారాయి ఓటరు మీద పడ్డా చెడి పోయేది ఓటే

22, మార్చి 2009, ఆదివారం

అండాలు సుబ్బారావు

అండాలు సుబ్బారావు భార్యా భర్తలు
ఒక సారి కారు లో ఎటో పోతూ
దేని గురించో గొడవ పది బాగా పోట్లాడుకున్నారు
దారి లో ఒక చోట గాడిదల గుంపు ఒకటి ఎదురు వచ్చింది
సుబ్బారావు అరుగో మీ బంధువులు వచ్చారు చూడు అన్నాడు
దానికి ఆండాలు అంది ఔను they are my in -laws
సుబ్బారావు మొహం మాడిపోయింది

నాకు ఉగాదులు లేవు ఉశషులు లేవు

ఒకప్పుడు

ఉగాదంటే మామిడి పూత

ఉగాదంటే కోయిల కూత

ఉగాదంటే పండగ సరదా

ఉగాదంటే సంబరాల వరద

కాని ఇప్పుడు

ఉగాదంటే దగాది

ఉగాదంటే సమస్యల వాత

ఉగాదంటే అష్ట కస్టాల మోత

అంతా మన తలరాత

నాయకుల కేమో రాజకీయ పు దురద

ప్రజల కళ్ళ కు కడతారు హామీల పరదా

ఎప్పుడు తీరునో వ్యధ

14, మార్చి 2009, శనివారం

ఐ న్యూస్ ఛానల్ స్లోగన్

చెప్పాల్సింది చాలాఉంది

చూడాల్సింది మిగిలేఉంది

దానికి పేరడీ [ఎలెక్షన్ టైం లో ]

చెప్పాల్సిన సోది ఇంకా చాలాఉంది

చూడాల్సిన చండాలం మిగిలేఉంది

10, మార్చి 2009, మంగళవారం

హోలీ హోలీ హోళీ

హోలీ హోలీ హోళీ

ఎంతో
ఎంతో జాలీ

జీవితపు
రంగులను అద్దుకున్న పాళీ

నల్లని
కరిమబ్బుల చాటున వాన విల్లు

నీరెండ
తగలగానే ఏడు రంగుల హరివిల్లు గా మారినట్లే

మంచితనం
మానవత్వం వెలుగు మనిషి మీద పడితే

మనిషి
హృదయం లోని అందమైన రంగులు బయట పడతాయి

అందరికి
హోళీ శుభాకాంక్షలు

జయభారత్

8, మార్చి 2009, ఆదివారం

ఆకాశం లో సగం అవనిలో సగం

చెమ్మ చెక్క చారడేసి మొగ్గ ఆడినంత తేలికగా

ఎండీ వర్లు చాలెంజర్లు డిస్కవరీ లు నడిపే అలవోకతనం


అందమైన ప్రపంచం లోకి తెచ్చి

గోరుముద్దలు బుడి బుడి నడకలు నేర్పే ప్రేమ వనం


అందరిని కంటికి రెప్పలా చూసుకొనే ప్రమదావనం



ఆకాశం లో సగం అవనిలో సగం అన్నింటిలో సగం


నిరంతర సహన వాహిని నిత్య నూతన వర్ణ ప్రవాహిని


నేటి మహిళకు వందనం అభివందనం


నేడు world women's day సందర్భంగా


అందరికి మరీ ముఖ్యంగా మహిళా లోకానికి


VERY VERY HAPPY WOMEN'S DAY