17, అక్టోబర్ 2009, శనివారం

చీకటి వెలుగుల రంగేళి


చీకటి వెలుగుల రంగేళి

జీవితమే ఒక దీపావళి

ఆనందాల వెలుగుల కాంతుల రవళి

ఆ వెలుగుల లోనే

జగమంతా జలకాలాడాలి


బాహ్య ప్రపపంచం లోని వెలుగు నీడల్ని

కనిపెట్టడం చాలా సులువు

కాని మన మనసు పొరల్లో దాగి ఉన్న వెలుగు నీడల జాడల్ని

కనుక్కోవడం అందరికి శక్తికి మించిన పని

మనసు పొరల్ని చుట్టుకొని ఉన్న

చీకటి దారాల్ని పారద్రోలే

వెలుగు దీపం మన మనస్సాక్షే



మన మనస్సు తేటగా ఉంటె అది వెలుగుల గూడు అవుతుంది

మన నడక ధర్మ బద్దమైతే వెలుగుల దారి కనిపిస్తుంది

మనం ఎంచుకున్న దారిని బట్టి వెలుగు నీడలు ఎదురవుతాయి



పక్క వాడి గుండెల నిండా

చిక్కనైన రోదన నిండ

ఏ హాయి దరి రాదు నీవైపుకు


అన్న కవి మాటలు గుర్తు తెచ్చుకుంటూ



మన తోటి వాని జీవితం లో దాగి ఉన్న కష్టాల చీకట్లని

ఏ కాస్తయినా మన చేతనైనంత మన పరిధిలో తీర్చ గలిగి

ఆనందపు వెలుగులను పంచ గలిగితే

అంతకు మించిన దీపావళి ఎవరికైనా ఇంకేముంటుంది

happy diwali to all

5 కామెంట్‌లు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

దీపావళి శుభాకాంక్షలు అందుకోండి.

పరిమళం చెప్పారు...

Good post!మీకూ మీ కుటుంబ సభ్యులకూ దీపావళి శుభాకాంక్షలు !

amma odi చెప్పారు...

మీకు, మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు, సకల శుభాలు కలగాలని కోరుతూ.....దీపావళి శుభాకాంక్షలు!

జయ చెప్పారు...

దీపావళి శుభాకాంక్షలు.

bharath చెప్పారు...

బ్లాగరు మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు

మీ ఇంట ప్రతి నిత్యం వెలుగు పూలు పూస్తూనే ఉండాలని కోరుకుంటూ

జయభారత్