25, మార్చి 2010, గురువారం

కిత కితలు


MESSAGE
వెంగలప్ప తన ఫ్రెండ్స్ కి మెసేజ్ ఇచ్చాడు
కొత్త ఫోన్ కొన్నాను
నా ఫోన్ no మారినది

ఇంతకు మునుపు 6210
ఇప్పుడు 6400 అయ్యింది



నేను కూడా అంతే

వెంగలప్ప భార్య తో

కాంతం నేను పొతే నువ్వు రెండో పెళ్లి చేసుకుంటావా

కాంతం :ఛా ఛా ఆ పని ఎప్పుడు చెయ్యనండి
మా చెల్లెలితో కలిసి మిగతా జీవితం ఏదో అలా గడిపేస్తా

మరి నేను ముందు పోతేనో అనడిగింది కాంతం

నేను కూడా మీ చెల్లితో కలిసి మిగతా జీవితం నెట్టేస్తా చెప్పాడు వెంగలప్ప

19, మార్చి 2010, శుక్రవారం

వికృతి నామ ఉగాది శుభాకాంక్షలు



ప్రపంచ తెలుగు ప్రజలు అందరికి బ్లాగరు మిత్రులందరికీ
మీకు మీ కుటుంబాలకు
వికృతి నామ ఉగాది శుభాకాంక్షలు

18, మార్చి 2010, గురువారం

బకరా

బకరా

సూరి బాబు కొత్త గా రత్నాలు తో లవ్ లో పడ్డాడు

కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు హోటల్స్ కి సినిమాలకి షికార్లకి తెగ తిప్పాడు

ఒకనాడు surprise చేద్దామని రత్నాలు ఇంటికి సడన్ గా వెళ్ళాడు

రత్నాలు కూర్చో పెట్టి టీ తెస్తానుండు అని లోపలి వెళ్ళింది

అక్కడే ఉన్న రత్నాలు సెల్ చూసి నా నెంబర్ కి ముద్దు పేరు ఏం పెట్టుకుందో అని
సరదాగా తన సెల్ నుంచి రింగిచ్చాడు సూరిబాబు

ఆకలేస్తే అన్నం పెడతా అలిసొస్తే ఆయిల్ పెడతా అనే పాట తో పాటు


బకరా no 5 అని అక్కడ display లో కనపడింది

11, మార్చి 2010, గురువారం

కాలం తో పాటు మారే పిలుపులు

పెళ్లి నాటి నుంచి తర్వాత కొన్నేళ్ళ వరకు

భార్య భర్త ను పిలిచే తీరు లో ఎన్ని మార్పులో


పెళ్ళైన కొత్తలో : ప్రియమైన శ్రీవారూ

మొదటి సంవత్సరం : ఏమండీ

రెండవ సంవత్సరం: వింటున్నారా

మూడవ సంవత్సరం: మిమ్మల్నే పిలుస్తుంటే పట్టించుకోరే

నాలుగవ సంవత్సరం : ఎక్కడ చచ్చారో ఈయన

ఐదవ సంవత్సరం : మీరు వస్తారా లేక నేనే రమ్మంటారా