17, డిసెంబర్ 2011, శనివారం

BOTSA SATTI BAABU AND CHIRU -SANTHOSHAM


మీరంతా సంతోషం సిన్మా చూసే ఉంటారు 

 అందులో కోట శ్రీనివాస రావు ని బ్రంహానందాన్ని  ఒక పార్టీ లో కలిసి  
ఉన్న వాడు ఊఒరుకోక  ఒక డైలాగ్ చెప్పి  ఇరుక్కుంటాడు  అది ఏంటంటే

బ్రంహి:  హలో ఐ యాం  గిరి from మంగళ గిరి అని షేక్ హ్యాండ్ ఇచ్చి 
అబ్బ మీరు చాలా స్ట్రాంగ్  మాన్
ఈ వయసులో నే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసుంటారు  అంటాడు

దాంతో కోట పార్టీకి వచ్చిన గెస్ట్ లను ఒక్కరినే పిల్చి అదే డైలాగ్ బ్రంహి తో అందరికి చెప్పించి  సిన్మా చూపిస్తాడు

ఇప్పుడు అదే డైలాగ్ పొలిటికల్ సీన్ లో
ఇందులో  పిసిసి  ప్రెసిడెంట్ బొత్స  సత్తి బాబు  ఒక చోట నిల్చొని ఉంటె
 చిరంజీవి  వచ్చి  మంత్రి పదవి కోసం కాకా పట్టడానికి  డైలాగ్ వదులుతాడు

సత్తిబాబూ  మీరు చాలా స్ట్రాంగ్  పెర్సనాలిటీ   ఈ పదవిలో నే ఇలా హడావిడి చేస్తున్నారంటే 
ఆ పదవి [CM] వస్తే అందర్ని చించి వుతికి  అరేస్తరేమో  అన్నాడు
దానికి బొత్స :థాంక్స్ ఫర్ కాంప్లిమెంట్   ఉండు ఈ ఆమాట ఒక సారి కిరణ్ తో కూడా చెప్పండి
 అని  కిరణ్ ని పిలుస్తాడు

కిరణ్ మొహం చిటపట లాడిస్తూ ఏంటి బొత్స థిస్ ఇస్ నాట్ కరెక్ట్  ఎందుకు నన్ను ఇలా పిలిచావ్  అడిగాడు 

బొత్స :ఇదో చిరు ఒకసారి ఆ డైలాగ్ చెప్పు
చిరు : ఏం లేదు కిరణ్ బొత్స   చాలా స్ట్రాంగ్  పెర్సనాలిటీ   ఈ పదవిలో నే ఇలా హడావిడి చేస్తున్నారంటే 
ఆ పదవి [CM] వస్తే అందర్ని చించి వుతికి  అరేస్తరేమో అన్ననన్న మాట

కిరణ్ :ఆ పదవి వచ్చి నప్పుడు చూద్దాం లే  థిస్ ఇస్ క్లియర్  అని తిట్టి కుంటూ వెళ్లి పోయాడు

బొత్స ఈ సారి  చంద్ర బాబు ని పిలిచాడు  చిరు ఏదో చెబుతాడు  ఓ పాలి  బె గి ఇలా ఒచ్చేల్లు అని

బాబు వచ్చాడు  ఏంటి బొత్స  నేను ఏదో విధంగా CM కావాలని అన్ని రకాలుగా ముందుకు వెళుతుంటే అడ్డం పడి ఇలా అడ్డం పిలవడం  బాగలేదు  అయినా ఏమి టి  సంగతి  అనడిగాడు

బొత్స చిరు తొడ గిల్లాడు తగులూకో అని

చిరు కొంచెం ఇబ్బంది గా పేస్ పెట్టి  చెప్పాడు ఏం లేదండి

  బొత్స చాలా స్ట్రాంగ్  పెర్సనాలిటీ   ఈ పదవిలో నే ఇలా హడావిడి చేస్తున్నారంటే 
ఆ పదవి [CM] వస్తే అందర్ని చించి వుతికి  అరేస్తరేమో అన్ననన్న మాట  

ఏంటి బొత్స AND చిరు కలలు కంటున్నారా   ఎన్ని వెన్ను పోట్లు  
ఓటు పాట్లు పడి అయినా CM ఐతా గానీ
మిమ్మల్ని కానివ్వను అని దుమ దుమ లాడుతూ వెళ్లి పోయాడు

బొత్స మల్లీ  జగన్ ను పిలిచాడు  ఒక్క సారి చిరు మాటలు  విని పోదురా అని

రావడం రావడం తోనే జగన్  చిరు గడ్డం పట్టుకొని  ఓదార్చడం మొదలెట్టాడు 
 ఏం మంత్రి పదవులు రాలేదని ఫీల్ కావద్దు  కావాలంటే మా పార్టీ లో కి రా నేనిస్తాను అని

దాంతో బొత్స కంగారుపడిపోయి మేటర్ పక్క దారి పడుతోందని   చిరు ను మల్లి గిల్లాడు

ఏం లేదు జగన్   బొత్స చాలా స్ట్రాంగ్  పెర్సనాలిటీ   ఈ పదవిలో నే ఇలా హడావిడి చేస్తున్నారంటే 
ఆ పదవి [CM] వస్తే అందర్ని చించి వుతికి  అరేస్తరేమో అన్ననన్న మాట   అన్నాడు మొహమాటంగా

ఛీ ఛీ  బానిసలు మీది ఒక బతుకేనా అనుకుంటూ జగన్ ఓదార్పు యాత్ర కు వెళ్ళిపోయాడు

ఈ సారి కేశవ రావు ని జానా రెడ్డి ని పిలిచాడు  చిరు ఏదో చెబుతాడు వినండి అని

చిరు కు కింద నుంచి ఎక్కడి కో కాలింది  ఏంటి  వీళ్ళకు కుడా చెప్పాలా అని 

SAME మ్యాటారా   అన్నాడు చిరు     అవునన్నాడు బొత్స

ఏం లేదండి  బొత్స చాలా స్ట్రాంగ్  పెర్సనాలిటీ   ఈ పదవిలో నే ఇలా హడావిడి చేస్తున్నారంటే 
ఆ పదవి [CM] వస్తే అందర్ని చించి వుతికి  అరేస్తరేమో అన్ననన్న మాట   అన్నాడు

ఏమన్నారు  మళ్ళీ చెప్పండి అన్నాడు జాన రెడ్డి  చెవులు రిక్కిస్తూ

దానికి బొత్స అన్నాడు  మా వాళ్లకు కొంచెం నాలుక మందం  వినికిడి లోపం  కొంచెం గట్టిగా చెప్పు 

చిరు : ఏంటి నాలుక మందమా కొంచెం గట్టిగా చెప్పాలా 

ఈయనగారు  చాలా స్ట్రాంగ్     ఈ పదవిలో నే ఇలా హడావిడి చేస్తున్నారంటే 

ఆ పదవి [CM] వస్తే అందర్ని చించి వుతికి  అరేస్తరేమో అన్ననన్న మాట  అన్నాడు  నీరసంగా

అబ్బ ఎన్ని సార్లు చెప్పమన్నా  అలుపు లేకుండా చేబుతావ్  ఒక్కసారి ఢిల్లీ పోదాం రా
ఈ మాట ఒక సారి సోనియా తో కూడా చేబుదువు గాని  అన్నడు బొత్స

దాంతో మన చిరు అక్కడి నుంచి JUMP



4, డిసెంబర్ 2011, ఆదివారం

STAGES OF IAS OFFICERS

ఐఏఎస్ ల గురించి 


ఐఏఎస్ కి సెలెక్ట్    అయినప్పుడు  ఆహా ఎస్  ఓహో ఎస్ 


సంపాదనకి అలవాటు పడ్డపుడు       అయ్యా ఎస్  అయ్యా ఎస్ 


సిబిఐ కి దొరికి నపుడు      అయ్యో  ఎస్  అయ్యయ్యో ఎస్  

13, నవంబర్ 2011, ఆదివారం

నాలుకలా- తాటిపట్టలా




చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చెయ్యాలంటే రెండో SRC ఏర్పాటే కాంగ్రెస్స్ వైఖరి --దిగ్విజయ్ సింగ్

తెలంగాణా పై ఏదైనా సందేహం ఉంటె గులాం నబి ఆ
జాద్ ని అడిగి తెలుసుకోండి --AICC అధికార ప్రతినిధి

తెలంగాణా పై నిర్ణయం అంటే ఏదో కేకు కట్ చేసినంత వీజీ కాదు -మనీష్ తివారి

ముందు కొన్ని పండగలు ఉన్నాయ్ అవి అయ్యిన తర్వాత నిర్ణయం -చిదంబరం



ఇంకా గులాం నబి ఆజాద్ మాట
అబ్బే తెలంగాణా పై అప్పుడే తేల్చే ఉద్దేశం లేదు ఇంకా టైం పడు
తుంది
ముందు AP లో సంప్రతింపులు జరగాలి
తరువాత జాతీయ స్థాయిలో జరగాలి
తరువాత పాకిస్తాన్ తో ,రష్యా తో ,ఆఫ్గనిస్తాన్ తో చర్చలు జరపాలి
ఆ తరువాత తాలిబాన్లతో , లెబనాన్ టెర్ర రిస్టులతో
ఇంకా శ్రీలంక తో చర్చలు జరిపి ఎకాబ్రిప్ర్యాయ సాధన చేసి తరువాత చెబుతాం


ఫైనల్ గా విలేకర్ల తో ప్రధాని మాట
ఇది ఇప్పుడే తేల్చ లేం ఒకరి గురించి ఒకరితో గొడవ పెట్టుకో లేం
పెనం పొయ్యి ,కొరివితో తల గోక్కోడం అనే సామెత మీరు వినే ఉంటారు
అంత రిస్క్ మే తీసుకోం
మహేష్ బాబు బిజినెస్ మాన్ డైలాగ్ ప్రధాని చెబితే
విలేకర్ల సమావేశం లో పాత్రికేయులతో


ఇలా సర్రౌండ్ చేసి CONFUSE చేయొద్దు
CONFUSION లో ఏదేదో ఎక్కువ మాట్లా డేస్తాను


దానికి ప్రతిగా మూడు ప్రాంతాల ప్రజల డైలాగ్
[మన కిరణ్ కుమార్ ADD లో లాగ]

ముందుంది మరింత మంచి [దంచే ]కాలం



6, నవంబర్ 2011, ఆదివారం

ప్రతి రోజు చెవుల్లో జరిగే విష ప్రయోగం

వీడు నిఖార్సు
వాడు బేవార్సు

వీడు రొచ్చు వాడు పుచ్చు

వాడు కింగు వీడు బొంగు

వాడొక లఫంగి వీడో లఫూటు

వీడు లంగా గాడు వాడేమో జంగ్లీ గాడు

వీడేమో పిస్తా వాడేమో బస్తా

వీడు కుత్తే కమీన్ వాడేమో బథమీన్

వీడు ద్రోహి వాడు పాపి

ఆ పార్టీ చెంచా పార్టీ ఈ పార్టీ దందా పార్టీ
మీది కమీషన్ ల పార్టీ కాదు మీదే కక్కుర్తి పార్టీ

ఇచ్చేది మేమే తెచ్చేది మేమే ఒక పార్టీ వీరంగం
ఇచ్చింది లేదు తెచ్చింది లేదు ఒక పార్టీ ఎద్దేవా
ఇస్తారా తెస్తారా ఇచ్చి చస్తారా ఇంకొకరి శివాలు
నాది తటస్తం కాదు కాదు మధ్యస్తం కాదు కాదు మీఇష్టం ఇది ఒకరి స్టాండు

మేమే ఇస్తాం కాని ఎపుడనేది చెప్పం ఇది ఇంకొకరి స్టాండు
మేము అధికారం లోకి వచ్చిన వెంటనే ఇచ్చేస్తాం మాకు ఓటెయ్యండి ఇది ఓ పెద్దాయన మాట

మీది లీజుల పార్టీ కాదు మీదే గలీజుల పార్టీ


నువ్వు వెన్నుపోటు దారుడివి 

కాదు నువ్వే నమ్మక ద్రోహివి ,


నీపార్టీ  చీకటి ఒప్పందాల పార్టీ 

కాదు నీదే లాలూచీ ల పార్టీ 


మీది పనికిమాలిన పార్టీ 

మీదే బేవార్స్ పార్టీ 



అబ్బే ఇదంతా చదివి ఎక్కడి దీ నీచమైన బాష అనుకుంటున్నారా
ప్రతి రోజు ప్రొద్దున్నే న్యూస్ పేపర్ లేదా టీవీ చానెల్ పెట్టంగనే వినిపించే కర్ణ కటోర బాష ఇది
ప్రతి రోజు చెవుల్లో జరిగే విష ప్రయోగం ఇది
ఏం చేస్తాం రోజుల్ని ఇలాగే దొరలిస్తున్నాం మరి



25, అక్టోబర్ 2011, మంగళవారం

ఇండియా దూకుడు

దూకు దూకు దూకుడు

భారత్ తో పెట్టుకుంటే బలుపు దిగుద్ది

ధోని సేనతో పెట్టుకుంటే డ్రమ్ములు పగిలిపోతాయి

పులితో ఆడుకుంటే పులుసు కారిపోద్ది

ఇండియా తో పెట్టుకుంటే ఇంజను ఇరిగిపోద్ది

ఇవన్నీ ఈ రోజుతో ముగిసిన ఇండియా ఇంగ్లాండ్ ONE DAY క్రికెట్ ముచ్చట్లు

మన గెలుపు ,, తీరిన ప్రతీకారం పైవిధంగా చెప్పానన్న మాట

CONGRATS TO DHONI MEN

28, ఆగస్టు 2011, ఆదివారం

ఎవరు పెద్ద


ప్రస్తుతం అమెరికా పరిస్తితి

10 ,౦౦౦ నువ్వు బ్యాంకు కు బాకీ ఉంటే అది నీకు సంబంధించిన సమస్య
అదే నువ్వు పది లక్ష లు బాకీ ఉంటే అది బ్యాంకు కు సంబంధించిన సమస్య



ఎవరు పెద్ద
కోఠీ నుంచి అమీర్ పేట వైపు బస్సు వెళుతోంది
మద్యలో ఇద్దరు అంటీ లు బస్సు ఎక్కారు

బస్సు అంతా ఫుల్ గా ఉంది ఒక్క సీటు తప్ప
ఆ సీటు నాదంటే నాదని

నేను ముందు ఎక్కానంటే నేనని ఫైటింగ్ స్టార్ట్ అయ్యింది

ఎవరు వారికి సర్ది చెప్పలేక పోతున్నారు

ఇంతలో ఒక పెద్దాయన సొల్యుషన్ చెప్పాడు

ఎవరు వయసులో పెద్దయితే వారిని కూర్చోమన్నాడు

అంతే జగడం ట్టకీ మని ఆగిపోయింది
అబిడ్స్ వచ్చేవరకు సీటు ఖాళీగానే ఉంది

26, జులై 2011, మంగళవారం

CRITICAL

అది DR గరుడాచలం ఆసుపత్రి

ఒక రోజు పొద్దున్నే ఒకామెను పురిటినోప్పులతో ఆసుపత్రి కి తీసుకొచ్చారు

గరుడాచలం ఆమెను చూసి ఆదరా బాదరా సిజేరియన్ ఆపరేషన్ చేసాడు

NURSE వచ్చి అడిగింది

డాక్టర్ డాక్టర్ కేసు అంత EMERGENCY యా

పరిస్తితి అంత CRITICAL గా ఉందా అని


దాని కి డాక్టర్ సమాధానం ఇచ్చాడు

అవును సిస్టర్ పరిస్తితి చాలా CRITICAL గా ఉంది

కాకపొతే పేషెంట్ ది కాదు ఆసుపత్రి FINANCIAL POSITION

కాసేపు ఆపరేషన్ ఆలస్యమై ఉంటే నార్మల్ డెలివరీ అయిపొయి చాలా నష్టం వచ్చేది

ఎవరు పెద్ద

వెంగలప్ప ఇంటర్వ్యూ కొచ్చాడు

ఆఫీసర్ అడుగుతున్నాడు

MR .వెంగలప్పా సింపుల్ ప్రశ్న

ఏనుగు పెద్దదా

చీమ పెద్దదా

వెంగలప్ప :కొంచెం క్లారిటీ మైంటైన్ చెయ్యండి సార్

రెండు మూడు సమాధానాలు ఉండే ప్రశ్నలు అడక్కండి అన్నాడు చిరాగ్గా

ఆఫీసర్ : ఏంటి దీనికి రెండు మూడు ANSWERS ఉన్నాయా ??? అని నోరు తెరిచాడు

వెంగలప్ప్ :YES OFFICER SIZE ప్రకారం అయితే ఏనుగు పెద్దది

AGE ప్రకారం అయితే ఎవరి DATE OF BIRTH ముందో వాళ్ళే పెద్దవాళ్ళు

VERY SIMPLE YOU KNOW అన్నాడు

3, జులై 2011, ఆదివారం

నేనే నెంబర్ వన్ నాదే వింబుల్డన్

TIME : 3 -7 -20011 రాత్రి 9.25PM

రేపటి వార్త పత్రికల్లో రాబోయే క్రీడా శీర్షికలు
వింబుల్డన్ గెలిచిన జోకోవిచ్ గురించి

నేనే నెంబర్ వన్
నాదే వింబుల్డన్

బుల్ కొమ్ములు వంచిన వీరుడు

26, జూన్ 2011, ఆదివారం

ఒక మాట


పెళ్లి అనేది ఇద్దరు మనుషులని దగ్గర చేస్తుంది
కాని చాలా మంది కావాల్సిన వారిని శాశ్వతంగా దూరం చేస్తుంది

జాడీ no 48 మందు


జాడీ no 48 మందు
ఒక ఊరిలో ఒక అతి తెలివి వెంగలప్ప ఉండేవాడు
అందరిని తన అతి తెలివితేటలతో ఆట పట్టిస్తూ ఉండేవాడు

ఆ ఊరికి కొత్తగా ఒక డాక్టర్ వచ్చి క్లినిక్ మొదలు పెట్టి ప్రాక్టీసు చెయ్యడం స్టార్ట్ చేసాడు

కొద్ది రోజుల్లోనే అతని హస్త వాసి మంచిదని బాగా ప్రచారం వచ్చి జనం విపరీతంగా అతని దగ్గరికి
రావడం మొదలెట్టారు

దాంతో వెంగలప్ప కన్ను డాక్టర్ మీద పడింది

ఎలాగైనా డాక్టర్ ని దెబ్బతీసి అతని పేరు చెడగొట్టాలని డిసైడ్ అయ్యాడు

ఆరోజు పేషెంట్ లాగా క్లినిక్ కు వెళ్లి చూపించుకున్నాడు
డాక్టర్ నాకు ఏమితిన్నా కూడా రుచి తెలయకుండా ఉంది
మంచి మందు ఇవ్వండి అనడిగాడు

తన అసిస్టెంట్ ద్వారా వెంగలప్ప గురించి విన్న డాక్టర్ ముందే రెడీ గా ఉన్నాడు

డాక్టర్ : అయితే నీకు no 48 జాడీ లో మందు బాగా సరిపోతుంది అంటూ
ఒక డబ్బా లాంటి దాంట్లో నుంచి
కొంచెం మందు తీసి ఇది తిని చూడు అన్నాడు

కొంచెం తీసుకొని తిన్న వెంగలప్ప యాక్ అని వెల్లమూసి
ఇది మందు కాదు ఆవుపేడ అన్నాడు వికారంగా మొహం పెట్టి

చూసావా అప్పుడే నీ నాలుకకి రుచి తెలుస్తోంది అన్నాడు డాక్టర్

తేలుకుట్టిన దొంగలాగా కిమ్మనకుండా అక్కడినుండి వెళ్ళిపోయాడు వెంగలప్ప

ఓ నెల ఆగి ఈ సారి ఎలాగైనా డాక్టర్ ని ముప్పుతిప్పలు పెట్టాలని మళ్లీ వచ్చాడు వెంగలప్ప

డాక్టర్ నాకు ఏది వాసన చూసినా ఏమి తెలయటం లేదు
మీ నాలెడ్జి అంటా ఉపయోగించి మందు ఇవ్వండి అనడిగాడు

అయితే నీకు వాసన తెలియడం లేదా అయితే జాడీ no 48 రెండు చెంచాలు రోజు నాలుగుసార్లు !!!!!!

డాక్టర్ మాట ఇంకా పూర్తి కాకుండానే వెంగలప్ప అక్కడి నుంచి జంప్

ఎవరు ఫాస్ట్

ఎవరు ఫాస్ట్

జపాన్ ప్రధాని లాలూ ప్రసాద్ యాదవ్ తో మాట్లాడుతున్నాడు
జపాన్ బీహార్ ఒకటే లా ఉండాలంటే ఏంచెయ్యాలి అని

జపాన్ ప్రద్జాని: లాలు జీ మీ బీహార్ ని మాకిచ్చి చూడండి
మూడు నెలల్లో జపాన్ లా మార్చేస్తాం అదీ మాగొప్పతనం అన్నాడు

దానికి లాలు
అబ్బే మీకెందుకు శ్రమ మీరే జపాన్ ని మాకిచ్చి చూడండి
ఒక నెల లోపే బీహార్ లా మార్చేస్తాం

22, జూన్ 2011, బుధవారం

ఇచ్చట అమ్మనా బూతులు నేర్పబడును

ఇచ్చట బూతులు నేర్పబడును

ఇడియట్
ఫూల్
రాస్కెల్
కోన్ కీస్ గొట్టంగా
గలీజోడా
దిమాక్ లేనోడా
గాడిదా
పందీ
దగుల్బాజీ
అవినీతి పరుడా
తిక్కలోడా
use less ఫెలో
షట్ అప్ యువర్ బ్లడీ మౌత్
నువ్వే షట్ అప్
తెలివి తక్కువ దద్దమ్మా
కల్లెక్షన్ కింగ్
వసూల్ రాజా
కర్రప్షన్ స్టార్


అబ్బే అప్పార్థం చేసుకోకండి
ఇది ఏ గల్లీ కోట్లా టో లేక
నల్లా దగ్గర కోట్లటో
కాదు
మన ఘనత వహించిన మంత్రులు శంకర్ రావు అండ్ MP సర్వే సత్య నారాయణ ల
తిట్ల పురాణం pity telugu prajalu

ఏది ఏమైనా మన తెలుగు సిన్మా రైటర్స్ కు మంచి అవకాశం కొత్తవి నేర్చుకోవడానికి

తెలంగాణా ఆత్మ నిన్న రెండు రకాలుగా ఘోషింటుంది
ఒకటి తన ముద్దు బిడ్డ జయశంకర్ తనని విడిచి వెళ్ళినందుకు
రెండోది ఇలాంటి రాజకీయ బిడ్డలు ?? తన ఒడి లో ఇంకా ఉన్నందుకు

17, జూన్ 2011, శుక్రవారం

బొత్స సూక్తి ముక్తావళి


ధ్వని-ప్రతిధ్వని

ముఖ్య మంత్రిని కావాలని ఆశ పడుతుతున్నా
విలేకర్ల సమావేశం లో బొత్స
CM కిరణ్ గారు వినబడుతోందా చాప కింద నీటి శబ్దం



తెలంగాణా విషయం లో అవసరమైతే రాజీ నామాలకు సిద్దం --జానారెడ్డి

ఏదో సిన్మా లో బాబు మోహన్ జైలు సిబ్బంది తో అనే మాటలు గుర్తుకొస్తున్నాయి [ కొంచెం మార్పు తో ]

" యాక్ థూ " ఎన్ని సార్లు చెబుతారు
వినే వాళ్ళ కైనా సిగ్గుండాలి లేదా చెప్పే వాళ్ళ కైనా సిగ్గుండాలి



తెలంగాణా పై నిర్ణయం అధిష్టానం దే -ఏ నిర్ణయమైనా మాకు ఒకటే
బొత్స

పదవికి ముందు ఓడ మల్లయ్య -పదవొస్తే బోడి మల్లయ్య అనే సామే త ఉంది గదా మరి

PCC ఆఫీసు కి కొత్త HI-TECH హంగులు --బొత్స
కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగనట్లు


స్తానిక ఎన్నికలు కాగ్రెస్స్ పై ఎలాంటి ప్రభావం చూపవు -బొత్స
అవునులే గెలిచే సీన్ లేనపుడు అలాంటి స్టేట్ మెంట్ లే వస్తాయి


జగన్ అనే వ్యక్తి నాకు లెక్కే లేదు --బొత్స
కాని INDIRECT గా లెక్క లన్ని జగన్ పార్టీ చేసే DAMAGE పైనే

బొత్స దళిత వ్యతిరేకి --అవినీతి పరుడు --హర్ష కుమార్
శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్లి కూతురు ముండ ఎక్కడా అని అడిగాడట



బొత్స అహంకారి , ఇలాంటి టీం తో ఎన్నికలకు పొతే కాంగ్రెస్స్ చేతికి వచ్చేది చిప్పే --TDP

పగవాన్ని పంచాగం అడిగితే మధ్యాహ్నానికి మరణం అన్నాడట



కాంగేస్స్ లో యేపదవి వచ్చినా -ఇచ్చినా నాకు సంతోషమే --చిరు

మాట తప్పడమే నైజం -పలాయనమే మార్గం అయిన వాళ్ళు ఇంతకంటే ఏం స్టేట్ మెంట్ ఇస్తారు


5, జూన్ 2011, ఆదివారం

action -reaction

హాస్పిటల్ లో రెండు కాళ్ళు విరిగి బెడ్ మీద ఉన్న సుబ్బా రావు ని పరామర్శించడానికి

రామ రావు వచ్చాడు

ఎరా ఎలా జరిగింది అడిగాడు రామారావు

మరేం లేదు పొద్దున్నే అరటి తొక్క మీద అంటూ చెప్పబోయిన సుబ్బారావు ని మద్య లోనే ఆపి

ఆ అరటి తొక్క మీద కాలు వేసి జారినా అంటావ్
కాస్త ముందు వెనుక చూసుకో నక్కరలేదా ఎప్పుడు ఇంతే అంటూ చడ మాడా తిట్టాడు రామారావు

అది కాదురా అరటి తొక్క మీద కాలేసి జారింది నేను కాదు మా ఆవిడ

నేను జస్ట్ పగలబడి నవ్వానంతే

31, మే 2011, మంగళవారం

ఈ రోజు రఘునాథ్ పురం అనే ఊరిలో జరిగిన ఘటన నను ఎలా తీసుకోవాలి

ఈ రోజు రఘునాథ్ పురం అనే ఊరిలో జరిగిన ఘటన నను ఎలా తీసుకోవాలి

అక్కడ ఒక యువకుడు ఒక అమ్మాయినా బలాత్కారం చేయబోయాడు
ఆ అమ్మాయి ప్రతిఘటించింది దాంతో ఇతను సుత్తిలాంటి దాంతో ఘట్టిక కొట్టి హత్య చెయ్య బోయాడు
దాంతో గ్రామస్తులు అతనీ సజీవ దహనం చేసారు స్తూలంగా స్టొరీ ఇది

1 ]సభ్య సమాజం లో తిరుగుతున్న ఒక కామ పిశాచికి తగిన శాస్తి జరిగిందనాలా
౨] ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొని అతని జీవించే హక్కుని కాల రాచారా
౩. మరెవ్వరు అలా అమ్మాయిల జోలికి పోకుండా తగిన గుణపాటం నేర్పారా
౪.అతన్ని పట్టుకొని పోలీసు కి అప్పగించకుండా మానవ హక్కులని ఉల్లంఘించారా

నా దైతే మొదటి దానికే ఓటు

15, ఏప్రిల్ 2011, శుక్రవారం

నీతి కథ

ఒకానొక ఊరు
యా ఊరిలో ఒక కంప్యూటర్ ఇంజనీర్ ఒకరోజు ఆఊరి నది ఒడ్డున కూర్చొని
తన లాప్ టాప్ లో ఏదో పని చేసుకుంటున్నాడు
ఇంతలో laptop పట్టు తప్పి నదిలో జారి పడి పోయింది

ముందు భాద పడ్డా తరువాత చిన్నప్పుడు చదువుకొన్న కథ ఒకటి గుర్తొచ్చింది
అదే కట్టెలు కొట్టే మనిషి --నదీదేవత కథ
అంటే గొడ్డలి నదీ లో పడి పోవడం ఆ దేవత మొదట బంగారు గొడ్డలి తరువాత వెండి గొడ్డలి చూపించి
అవేవి కావు అన్నప్పుడు అసలుది చూపించి అతని నిజాయితీ కి మెచ్చి ఆపై ఆ మూడు అతనికే ఇవ్వడం అన్న మాట

ఇప్పుడు ఈ ఇంజనీర్ కూడా నదీ దేవత ను ప్రార్థించాడు తనది మళ్లీ తెచ్చి ఇమ్మని

నదీ దేవత ప్రత్యక్ష్యమై ముందు ఒక అగ్గి పెట్టె లాంటి డి చూపించి ఇదేనా అని అడిగింది

నేనడిగింది నా లాప్ టాప్ ఈ అగ్గిపెట్టె కాదు అన్నాడు విసుగ్గా

ఈ సారి అర చెయ్యి సైజు లో ది ఒకటి చూపించి ఇదేనా అని అడిగింది

అబ్బేఈ పలక కానే కాదు అన్నాడు ఇంజినీర్ బొత్తిగా నదీ దేవత అజ్ఞానానికి తిట్టుకుంటూ

ఈ సారి లాప్ టాప్ తెచ్చి చూపించింది

వెరీ గుడ్ ఇదే ఇదే అని సంతోషించి థాంక్స్ చెప్పి తీసుకున్నాడు


నదీ దేవత వెళ్లబోతుంటే ఆపి పాత కథ గుర్తు చేసి ఏంటి తల్లీ ఇలా చేసారు

అప్పుడేమో అతనికి మంచి మంచి వి చూపించి లాస్ట్ కి అన్ని కలిపి ఇచ్చేసారు కదా

నాకేంటి పనికి మాలినవి చూపించి ఇలా చేసారు అనడిగాడు


దానికి నదీ దేవత :ఒరే మూర్ఖా ముందు నేను చూపించినవి
అత్యంత లేటెస్ట్ కంపూటర్లు రా బడుద్దాయ్
నువ్వు వాటిని పలక అగ్గిపెట్టె అనే సరికి నువ్వు వాటికి అర్హునివి కావని ఇవ్వలేదు అని మాయమయింది

TAKEHOME : [కథ లో నీతి ] టెక్నాలజీ ని ఎప్పటికప్పుడు UPDATE చేసుకోపోతే ఇలాంటి నష్టాలు తప్పవని
ఇంతే సంగతులని అర్థం


9, ఏప్రిల్ 2011, శనివారం

హన్నా హజారే నీకే గతి పట్టింది

మొన్న చంద్రబాబు
జగన్
ఈ రోజు గాలి జనార్ధన్ రెడ్డి కూడా హజారే కి మద్దత్తు ప్రకటించారు
ఇంకా మద్దత్తు ప్రకటించాల్సిన వారు
అలీ హసన్
దావూద్ ఇబ్రహీం
నీరా రాడియా
కళిమోని
2g రాజా
ఇంకా రింగు రోడ్ రంగనాయకులు చాలా మంది లైన్ లో ఉన్నారు
ఇంకా ఎవరెవరి మద్దత్తు వినాల్సి వస్తుందో అని చాలా టెన్షన్ గా ఉంది

1, ఏప్రిల్ 2011, శుక్రవారం

APRIL 1ST NEWS

HOT NEWS OF THE DAY

ఉప ఎన్నికలలో పోటీ చెయ్యడం లేదు ,YSR కాంగ్రెస్స్ త్వరలో కాంగ్రెస్స్ లో విలీనం ---జగన్ మోహన్ రెడ్డి

విలీనం వట్టిదే ప్రజా రాజ్యం పార్టీ స్వతంత్రం గానే ఉంటుంది ---------------చిరు

విభజన వద్దు సమైక్య ఆంధ్రా నే ముద్దు--------------- KCR

ఆంధ్ర ప్రదేశ్ ని తక్షణ మే మూడు గా విభ జించండి ------------------------సీమంద్ర నాయకులు,MP లు


వరల్డ్ కప్ సెమి ఫైనల్ లో ఓడి నందుకు ప్రతీ కారంగా ఇండియా మీద దాడి చేసిన పాక్


లిబియ యుద్ధం కారణంగా అనూహ్యంగా పడిపోయిన బంగారు ధర

గ్రాము 2000 -/ నుండి 500 లకు దిగి వచ్చిన ధర


ఈ రోజు ఏంటో మీకు మళ్ళీ గుర్తు తెచ్చు కొమ్మని మనవి చేస్తున్నాను ఏప్రిల్ ఒకటవ తారీఖు

27, మార్చి 2011, ఆదివారం

నేటి వార్తలు --వాటికి తగ్గ సామెతలు

నేటి వార్తలు --వాటికి తగ్గ సామెతలు

కాంగ్రెస్స్ కు నిరాశ కలిగించిన MLC ఎన్నికలు
ఊ హించని విధంగా జగన్ వర్గానికి మూడు MLC సీట్లు

పిల్లి పిల్లి తగవు కోతి తీర్చి నట్లు

మావోయిస్ట్ సాంబ శివుడి దారుణ హత్య
ప్రభుత్వానిదే భాద్యత అని తెరాస ప్రకటన

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు



తెరాస లో క్రాస్ వోటింగ్ తగాదా
మాకే పాపం తెలియదు తెరాస MLA లు

అందరు శాకా హారులే కాని బుట్టలో రొయ్యలు మాత్రం మాయం



జపాన్ లో సునామి ,భూకంపం , అణు ధార్మికత లీకేజీ

పకృతి మనిషి మీద పడ్డా మనిషి పకృతి మీద పడ్డా damage మనిషి కే


తమిళ నాడు లో ఎన్నికల సందడి
ఉచిత హామీల వెల్లువ అన్ని ఆల్ ఫ్రీ అంటూ ఊదర గొడుతున్న అన్ని పార్టీలు

మనది కాకపొతే కాశీ దాక దేకమన్నట్లు


పార్లమెంట్ లో వికీ లీక్స్ దుమారం
దుమ్మెత్తి పోసిన ప్రతిపక్షాలు ప్రదాని ఆగ్రహం

ఏడుపు అత్త కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు


21, మార్చి 2011, సోమవారం

నేరము శిక్ష

నేరము శిక్ష

టీచర్ : నేరమొకరిది శిక్ష ఒకరికి అంటే ఏంట్రా రాము

రాము :నిన్న మీరిచ్చిన హోం వర్క్ లో మా నాన్న తప్పు చేస్తే

ఈ రోజు క్లాసు రూం లో నేను తన్నులు తినడం



TV పిచ్చి

అది కోర్ట్ హాల్ ,కోర్ట్ ప్రొసీడింగ్స్

రాష్ట్ర మంతా టీవీ లలో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది

గజదొంగ గంగుల్ని ప్రవేశ పెట్టారు


జడ్జి :నువ్వెంత చాక చక్యంగా ఏ ఆధారము దొరక కుండా

అందర్ని ఏమార్చి ఎంతో తెలివిగా దొంగతనం చేసినా ఎలా పట్టు కున్నామో చూసావుగా

అంతా ఈ CC టీవీ లలో రికార్డు అయింది చూస్తావా అంటూ టీవీ ఆన్ చేసి చూపించాడు

ఇప్పుడేమంటావ్ అని అడిగాడు జడ్జి గంగుల్ని


గంగులు :చిన్నగా కోర్ట్ లో ఆడియన్సు వైపు తిరిగి


చూసారుగా నా పెర్ఫార్మన్స్ .అది మీకు నచ్చినట్లయితే శభాష్ గంగులు అని టైపు చేసి స్పేస్ ఇచ్చి

420 420 కి SMS పంపి నాకు శిక్ష పడకుండా చూడండి అన్నాడు కూల్ గా

8, మార్చి 2011, మంగళవారం

సెల్ ఫోన్ సామెతలు


నాడా దొరికింది గుర్రాన్ని కొందాం పదా అన్నాట్ట వెనకటికి ఒకడు

సిమ్ము దొరికింది ఇక సెల్ ఫోన్ కొనాలన్నట్లు


ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్టిన్నట్లు

రింగ్ టోన్ విని సెల్ నెంబర్ చెప్పినట్లు


దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టు కోవాలి

బాలన్సు ఉండగానే కాల్స్ చేసుకోవాలి


సొమ్మొకడిది సోకొకడిది

టాక్ టైం ఒకరిది టాకింగ్ టైం ఇంకొకరిది



ఇంటి ని చూసి ఇల్లాల్ని చూడ మన్నట్లు

హలో ట్యూన్ విని అవతలి వాడి నేచేర్ చెప్పి నట్లు



అయ్యకు లేక అంబలి తాగుతుంటే కొడుకొచ్చి పాయసం కావాలన్నట్లు

కలర్ ఫోన్ లేక ఫాదర్ ఫీలవుతుంటే సన్ వచ్చి కేమెర ఫోన్ కొనిమ్మన్నట్లు

ఆకాశం లో సగం



ఆకాశం లో సగం

అవని లో సగం

అవకాశాల్లో సగం

అన్నిటా సగం సగం

let it be continued FOR ever

WISHING HAPPY WORLD WOMENS DAY TO ALL
TELUGU BLOGGERS AND REST OF THE WORLD

6, మార్చి 2011, ఆదివారం

JOKES

ఆ ఒక్కటి దొరకలేదు

పుల్లయ్య : డాక్టర్ గోరు డాక్టర్ గోరు

మీరు రాసిచ్చిన మందులన్నీ దొరికాయండి

ఈ చివరిది ఒక్కటి తప్ప ,,ఏం చెయ్యమంటారు ??


డాక్టర్ ::ఒరే పుల్లయ్యా అది నా సంతకం రా నాయనా




మతి మరుపు [నేను మోనార్క్ ని ఏది మరచి పోను ]


ఏమేవ్ కాంతం నువ్వెప్పుడు ఆఫీసు కు వెళ్ళే ముందు

నేను ఏదో ఒకటి మరచి పోతాను అంటూo టావ్ కదా

ఈ రో జు చూడు మరి కళ్ళద్దాలు పెట్టుకున్నాను

చొక్కా ప్యాంటు వేసుకున్నాను

చక్కగా షూస్ వేసుకున్నాను

ఫైల్స్ అన్నీ తీసుకున్నాను

ఇప్పుడేమంటావ్ అన్నాడు కన్నా రావు హుషారుగా


ఏడ్చినట్టే ఉంది మీ సంబడం ఈరోజు సండే ఆఫీసు కు హాలిడే

14, ఫిబ్రవరి 2011, సోమవారం

అల్లు అరవింద్ --చిరంజీవులు పాడుకున్న పాట

ప్రజారాజ్యం కాంగ్రెస్స్ లో కలిసి పోతున్న సందర్బంగా ఆ ముందు రోజు రాత్రి
అల్లు అరవింద్ --చిరంజీవులు పాడుకున్న పాట[VEDAM MOVIE NUNCHI]

గుండె గుబులుని గుండె కు వదిలి

చర్చించే వారిని చానెళ్లకు వదలి

ముందు వెనుకలు ముంగిట వదిలి

ఊరి సంగతి ఊరికి వదలి

ఫాన్స్ దారిని ఫార్సు కు వదలి

దారి సంగతి దారికి వదలి

కార్యకర్తల ని ఖర్మాని కి వదలి

నమ్మిన ప్రజలను నట్టేటి కి వదిలి

తప్పు ఒప్పులు తాతలకొదిలి

విమర్శకులను వీధికి వదలి

సిగ్గు యెగ్గులు చీకటికొదలి

తెరలను వదలి పొరలను వదలి

గడబిడలన్ని గాలికి వదలి [ఆయాసపడుతూ ]

కాంగ్రెస్స్ లో
కలిసి పొతే ఎంత బాగుంటుంది కలిసి పొతే ఎంత బాగుంటుంది

పప్పర పప్పర పాపార పప్పర పప్పర పాపార


కలిసి పొతే ------ బాగుంటుంది [కోరస్ ]

కలిసి పొతే -------బాగుంటుంది

కలిసి పొతే -------------బాగుంటుంది