6, నవంబర్ 2011, ఆదివారం

ప్రతి రోజు చెవుల్లో జరిగే విష ప్రయోగం

వీడు నిఖార్సు
వాడు బేవార్సు

వీడు రొచ్చు వాడు పుచ్చు

వాడు కింగు వీడు బొంగు

వాడొక లఫంగి వీడో లఫూటు

వీడు లంగా గాడు వాడేమో జంగ్లీ గాడు

వీడేమో పిస్తా వాడేమో బస్తా

వీడు కుత్తే కమీన్ వాడేమో బథమీన్

వీడు ద్రోహి వాడు పాపి

ఆ పార్టీ చెంచా పార్టీ ఈ పార్టీ దందా పార్టీ
మీది కమీషన్ ల పార్టీ కాదు మీదే కక్కుర్తి పార్టీ

ఇచ్చేది మేమే తెచ్చేది మేమే ఒక పార్టీ వీరంగం
ఇచ్చింది లేదు తెచ్చింది లేదు ఒక పార్టీ ఎద్దేవా
ఇస్తారా తెస్తారా ఇచ్చి చస్తారా ఇంకొకరి శివాలు
నాది తటస్తం కాదు కాదు మధ్యస్తం కాదు కాదు మీఇష్టం ఇది ఒకరి స్టాండు

మేమే ఇస్తాం కాని ఎపుడనేది చెప్పం ఇది ఇంకొకరి స్టాండు
మేము అధికారం లోకి వచ్చిన వెంటనే ఇచ్చేస్తాం మాకు ఓటెయ్యండి ఇది ఓ పెద్దాయన మాట

మీది లీజుల పార్టీ కాదు మీదే గలీజుల పార్టీ


నువ్వు వెన్నుపోటు దారుడివి 

కాదు నువ్వే నమ్మక ద్రోహివి ,


నీపార్టీ  చీకటి ఒప్పందాల పార్టీ 

కాదు నీదే లాలూచీ ల పార్టీ 


మీది పనికిమాలిన పార్టీ 

మీదే బేవార్స్ పార్టీ 



అబ్బే ఇదంతా చదివి ఎక్కడి దీ నీచమైన బాష అనుకుంటున్నారా
ప్రతి రోజు ప్రొద్దున్నే న్యూస్ పేపర్ లేదా టీవీ చానెల్ పెట్టంగనే వినిపించే కర్ణ కటోర బాష ఇది
ప్రతి రోజు చెవుల్లో జరిగే విష ప్రయోగం ఇది
ఏం చేస్తాం రోజుల్ని ఇలాగే దొరలిస్తున్నాం మరి



కామెంట్‌లు లేవు: