23, మార్చి 2009, సోమవారం

జోకు --సైజు జీరో

డాడి నాకు ఆ అమ్మాయి భలే గా నచ్చింది
ఆ ఆమె ఫిగరు 36-24-36 ఇంకా బాగా నచ్చింది
నువ్వు ఎలాగైనా ఒప్పుకోవాలి డాడ్ మారాం చేసాడు అబ్బాయి 

దానికి ఫాదర్ అన్నాడు

నువ్వు ఆసంగతి మరచిపోతే మేలు మై సన్
అమ్మాయి సైజు సంగతేమో గాని వాళ్ళ నాన్న బ్యాంకు బాలన్స్ ఫిగరు  

సైజు నాకు
అస్సలు నచ్చలేదు ఎందుకంటె అది జీరో కాబట్టి

అరిటాకు సామెత

ఓటరు వెళ్లి సారాయి మీద పడ్డా
సారాయి ఓటరు మీద పడ్డా చెడి పోయేది ఓటే

22, మార్చి 2009, ఆదివారం

అండాలు సుబ్బారావు

అండాలు సుబ్బారావు భార్యా భర్తలు
ఒక సారి కారు లో ఎటో పోతూ
దేని గురించో గొడవ పది బాగా పోట్లాడుకున్నారు
దారి లో ఒక చోట గాడిదల గుంపు ఒకటి ఎదురు వచ్చింది
సుబ్బారావు అరుగో మీ బంధువులు వచ్చారు చూడు అన్నాడు
దానికి ఆండాలు అంది ఔను they are my in -laws
సుబ్బారావు మొహం మాడిపోయింది

నాకు ఉగాదులు లేవు ఉశషులు లేవు

ఒకప్పుడు

ఉగాదంటే మామిడి పూత

ఉగాదంటే కోయిల కూత

ఉగాదంటే పండగ సరదా

ఉగాదంటే సంబరాల వరద

కాని ఇప్పుడు

ఉగాదంటే దగాది

ఉగాదంటే సమస్యల వాత

ఉగాదంటే అష్ట కస్టాల మోత

అంతా మన తలరాత

నాయకుల కేమో రాజకీయ పు దురద

ప్రజల కళ్ళ కు కడతారు హామీల పరదా

ఎప్పుడు తీరునో వ్యధ

14, మార్చి 2009, శనివారం

ఐ న్యూస్ ఛానల్ స్లోగన్

చెప్పాల్సింది చాలాఉంది

చూడాల్సింది మిగిలేఉంది

దానికి పేరడీ [ఎలెక్షన్ టైం లో ]

చెప్పాల్సిన సోది ఇంకా చాలాఉంది

చూడాల్సిన చండాలం మిగిలేఉంది

10, మార్చి 2009, మంగళవారం

హోలీ హోలీ హోళీ

హోలీ హోలీ హోళీ

ఎంతో
ఎంతో జాలీ

జీవితపు
రంగులను అద్దుకున్న పాళీ

నల్లని
కరిమబ్బుల చాటున వాన విల్లు

నీరెండ
తగలగానే ఏడు రంగుల హరివిల్లు గా మారినట్లే

మంచితనం
మానవత్వం వెలుగు మనిషి మీద పడితే

మనిషి
హృదయం లోని అందమైన రంగులు బయట పడతాయి

అందరికి
హోళీ శుభాకాంక్షలు

జయభారత్

8, మార్చి 2009, ఆదివారం

ఆకాశం లో సగం అవనిలో సగం

చెమ్మ చెక్క చారడేసి మొగ్గ ఆడినంత తేలికగా

ఎండీ వర్లు చాలెంజర్లు డిస్కవరీ లు నడిపే అలవోకతనం


అందమైన ప్రపంచం లోకి తెచ్చి

గోరుముద్దలు బుడి బుడి నడకలు నేర్పే ప్రేమ వనం


అందరిని కంటికి రెప్పలా చూసుకొనే ప్రమదావనం



ఆకాశం లో సగం అవనిలో సగం అన్నింటిలో సగం


నిరంతర సహన వాహిని నిత్య నూతన వర్ణ ప్రవాహిని


నేటి మహిళకు వందనం అభివందనం


నేడు world women's day సందర్భంగా


అందరికి మరీ ముఖ్యంగా మహిళా లోకానికి


VERY VERY HAPPY WOMEN'S DAY