10, ఫిబ్రవరి 2011, గురువారం

[ కామెడీ]comedy news

మనం రోజు వార్త పత్రికల లో చూసే న్యూస్ లో
కొన్ని పక్కన పక్క ననే ఉన్న వాటిని కలిపి చదివితే కొంచెం కామెడీ గా అనిపిస్తుంది

మచ్చుకు కొన్ని

తిరుపతి లో అలిపిరి దారి దగ్గర పులి సంచారం --హర్షం వ్యక్తం చేసిన అమెరికా అద్యక్షుడు ఒబామా


కాంగ్రెస్స్ లో ప్రజా రాజ్యం పార్టీ విలీనం -- ఈజిప్టు లో పెద్ద ఎత్తున ఆందోళన లు నిరసనలు ప్రదర్శించిన ఆందోళన కారులు


సోనియా ఇంట్లో ప్రధాని మన్మోహన్ భేటి -- సోదా చేసి 25 తులా ల బంగారు నగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు


అవినీతి పై యుద్ధం ప్రకటించిన ఐక్య రాజ్య సమితి ---పోలిట్ బ్యూరో సమావేశం లో సీనియర్ల పై చిందులు తొక్కిన చంద్ర బాబు


300 పాయింట్స్ నష్టపోయిన సెన్సెక్స్ --రచ్చ బండ లో ప్రజల పై CM కిరణ్ కుమార్ అసహనం


గురుకుల ఆశ్రమం హాస్టల్ లో ప్రసవించిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని--D శ్రీనివాస్ ని కలిసి పరిస్తితి గురించి చర్చించిన చిరజీవి


నెల్లూరు లో గంజాయి తోట పై పోలిసుల దాడి పంట ద్వంసం ---CM కిరణ్ కుమార్ పై మండి పడ్డ జగన్

7, ఫిబ్రవరి 2011, సోమవారం

ప్రజారాజ్యం కాంగ్రెస్స్ లో విలీనం సందర్బంగా పత్రికలూ టీవీ ల లో కనిపించిన కొన్ని శీర్షికలు

ప్రజారాజ్యం కాంగ్రెస్స్ లో విలీనం సందర్బంగా పత్రికలూ టీవీ ల లో కనిపించిన కొన్ని శీర్షికలు

సూర్యుడే సెలవనీ కరిగి పోయేనా

అర చేతి లో అస్తమించిన సూర్యుడు

బయటపడడమే లక్ష్యం ---- కాంగ్రెస్స్ లో కలిసిపోవడమే మార్గం

బరువుదించు కోవడమే లక్ష్యం ---paaripovadame మార్గం

జాగ్రత్త పడడమే లక్ష్యం --జుంప్ జిలానియే మార్గం

10 జనపథ్ దగ్గర చిరుకు కట్టిన బానర్-- స్వా [హా ]గతం

15, జనవరి 2011, శనివారం

మూడురోజుల ముచ్చటైన పండగ

మూడురోజుల ముచ్చటైన పండగ 
మీ ఇంట్లో మురిపాలు నింపగ
అందరూ ఆనంద కాంతులతో   30కాలాలపాటు  జరుపుకోవాలని    కోరుకుంటూ 

భోగి సంక్రాంతి ,కనుమ శుభాకాంక్షలు 

12, జనవరి 2011, బుధవారం

ఔర ఔర

వెంగలప్ప  ,వెర్రి పప్ప  ఒకసారి సముద్రం దగ్గరికి వెళ్ళారు 

కాసేపు తరువాత వెర్రిపప్ప  సముద్రం లోకి కొచెం కొంచెం  పెరుగు ,కొంచెం చక్కర  విసురుతున్నాడు 

అది చూసి వెంగలప్ప అడిగాడు  ఎందుకు అలా చేస్తున్నావ్ అని 

లస్సి చేస్తున్నా  బ్రదర్ అన్నాడు వెర్రిపప్ప 

అందుకే మనల్ని అందరు అలా చీప్ గా ఆట పట్టిస్తున్నారు అందరూ  అన్నాడు వెంగలప్ప 

ఇప్పుడు ఏమైంది అన్నా  అడిగాడు వెర్రిపప్ప 

వెంగలప్ప :ఇంకా ఏం కావాలి  ఇంత లస్సి ఎవరు తాగుతారు  ,,వేస్ట్ కాదా 





తిండి గోల 
లెక్కల టీచర్ ;ఒరే రాజు  నీకు 5 బెండకాయలు  6వంకాయలు  8టమోటాలు  8మిరప కాయలు 9 ఉల్లిపాయలు ఇచ్చాననుకో 
అన్ని కలిపితే ఏమౌతాయి 
రాజు ;   మంచి TASTY కర్రీ అవుతాయి సార్ 

26, డిసెంబర్ 2010, ఆదివారం

ఆరుద్ర గారి jokes


చంటిః ఇదిగో మమ్మీ నా ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌!!

లక్ష్మిః ఏమిట్రా! అన్నిట్లో 0 మార్కులే వచ్చాయి

చంటిః 0 నా లక్కీ నెంబర్‌ అని నీకు తెలుసుగా మమ్మీ!!!!

అందుకే అంతకు ఎక్కువ తక్కువ లేకుండా మేనేజ్ చేశా



గాంధీగారి బాల్యం గురించి చెబుతున్నాడు టీచర్‌....

వాళ్ళ టీచర్‌ చెప్పినా గాంధీ గారు కాపీ కొట్టలేదు. దీనిని బట్టి మనం గ్రహించాల్సిన నీతి ఏంటో చెప్పండి?

తెలివిగా అడిగాడు టీచర్‌.

ఆ కాలంలో టీచర్స్‌ చాలా మంచి వాళ్ళు సార్‌! ఠకీమని చెప్పాడు ఓ షార్ప్‌ కుర్రాడు.



కొత్తగా పనిలో చేరిన గుమాస్తాతో యజమాని: 'నీ పని బాగా నచ్చిందోయ్‌

, ఈ ఇరువై తీసుకొని భార్యతో సహా.. హాయిగా సినిమాకు వెళ్లిరా !!'

గుమాస్తా: సంతోషంగా, ' అలాగే సార్‌, అంతా మీ దయ!?'

యజమాని: ' ఏం, ఇంకా నిలబడ్డావే వెళ్లు.. '

గుమాస్తా: నసుగుతూ, 'మరి మీ భార్యను పిలిస్తే.....'



సుశీల: నువ్వు పెద్దయ్యాక ఏం చదువుతావు?

రాము: నేను డాక్టర్‌ చదువుతాను. దాని కోసం ఇప్పటి నుంచే జీవశాస్త్రం,

భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రాలను నేర్చుకుంటున్నా.

సుశీల: డాక్టర్‌ చదవడానికి జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం పనికి వస్తాయి. మరి, గణిత శాస్త్రమెందుకు?

రాము: వేలకు వేలు బిల్స్‌ రాసివ్వడానికి.


ఒకతను ప్రియురాలితో ' నీవు లేకుండా నేను జీ­ంచలేను, మరణమే శరణ్యం'

అని గొంతునిండా ­షాదం నింపుకుని చెప్పాడు.


ఆ అమ్మాయి నిర్ధాక్షిణ్యంగా సదరు దేవదాసు ప్రేమను తృణీకరించింది.

హాయిగా వేరే పెళ్లి చేసుకుంది. అతడు చచ్చిపోయాడు.




..-60 ఏళ్ల తర్వాత.

22, డిసెంబర్ 2010, బుధవారం

పెద్దవారిని ప్రేమించండి

ఒక 75 ఏళ్ళ పెద్దాయన ఆయన కొడుకు పార్క్ లో ఇంటి బయట లాన్ లో కూర్చున్నారు

దూరంగా ఒక పిచ్చుక వచ్చి వాలింది

అదేంటి అని అడిగాడు ఆ పెద్దాయన కొడుకుని

పిచ్చుక నాన్నా అని చెప్పాడు కొడుకు

కాసేపటికి మళ్లీ ఫాదర్ అడిగాడు అదేంటి అని

పిచ్చిక అని చెప్పాను కదా నాన్నా కొంచెం గొంతు పెంచి చెప్పాడు కొడుకు


కాసేపయ్యాక మళ్లీ అడిగాడు అదేంటి అని ఆ ఫాదర్

అది పిచ్చుక నాన్నా ఇందాక చెప్పాను కదా ఈసారి కొచెం విసుగ్గానే చెప్పాడు కొడుకు


అలా ఓ పది సార్లు అదే అదే అడిగాడు ఆ ఫాదర్ అదేంటి అని

పదోసారి ఆ కొడుకు లేచి గట్టిగా అరిచాడు

ఎందుకు నాన్న ఇలా చంపుతున్నావ్ పిచ్చుక అని చెప్పాను కదా

పెద్దాయన లేచి మౌనంగా అక్కడి నుంచి ఇంట్లోకి పోయి ఒక పాత డైరీ తెచ్చి ఒక పేజి చూపించి

పైకి వినిపించేటట్లు చదవమన్నాడు కొడుకుని


కొడుకు చదవ సాగాడు

ఇప్పుడు మా అబ్బాయికి ఆరేళ్ళు ఒక రోజు ఇద్దరం పార్క్ కు వచ్చాము

అక్కడ ఒక పిచ్చుక వాలి ఆడుకుంటోంది

మా బాబు అదేంటి నాన్నా అని అడిగాడు

పిచ్చుక బాబు అనిచెప్పాను

మళ్ళి అడిగాడు మళ్ళి చెప్పాను అలా ఒక యాభై సార్లు అడిగింటాడు

అడిగిన ప్రతిసారి చెప్పాను అడిగిన ప్రతిసారి ప్రేమగా బుగ్గ మీద ముద్దు కూడా పెట్టుకున్నాను

మురిపెం తో !!!!!!!!!!!!!

ఇంకా ఆ కొడుకు ఆపైన చదవలేక పోయాయాడు గొంతు మూగ బోయి కంటికి నీటి పొరలు అడ్డపడడం తో

[నాన్నకి అల్జేమేర్స్ వ్యాధి ఉందని ఏదైనా వెంటనే

మర్చిపోతాడని గుర్తొచ్చింది ]


నాన్న ని గట్టిగా హత్తుకొని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు


take హోం: పెద్దవారిని ప్రేమించండి వయసు సమస్యల వల్ల విసిగించినా సహనంగా ఉండండి


14, నవంబర్ 2010, ఆదివారం

సబ్బు చెప్పే సంగతులు

సబ్బు చెప్పే సంగతులు

మీరో సబ్బు కొన్న్నారనుకోండి ఓ పదిహేనురోజులో లేదా ఇరవై రోజులు వాడకానికి వచ్చిందనుకోండి

చివర్లో మిగిలి పోయే సబ్బు ముక్కను మీరేం చేస్తారు అన్న దాని బట్టి మీ బ్యాక్ గ్రౌండ్ అంచనా వెయ్యచ్చు

సీన్ ఒకటి
చివర్లో మిగిలిన ముక్కను పారవేయ్యలేక అట్లా అని వేళ్ళ సందుల్లో నుంచి మాటి మాటి కి జారి పోతున్న దాంతో సత మత మౌతా
అది పూర్తి గా కనుమరుగయ్యే దాకా వాడే వాళ్ళైతే మీరు బాగా కిందనుంచి పైకి వచ్చిన వాళ్లై ఉంటారు
వీరికి డబ్బు విలువ ,బాగా తెలుసు

సీన్ రెండు
అంతా అయిపోయాక మిగిలిన ముక్కను పార వెయ్య లేక అట్లా అని కొత్తది వాడలేక
మిగిలిన ముక్క ని కొత్త సబ్బు కు వెనకాల అంటించి అది అరిగి పోయేదాకా జాగ్రత్త గా వాడే వాళ్ళు

వీళ్ళు మద్య తరగతి జీవులు పొదుపు గా, జాగ్రత్త గా వస్తువులను వాడుతూ జీవితాన్ని వెళ్లదీసే రకం

సీన్ మూడు
సబ్బు అయిపోతూనే పారవేసి కొత్తది ట్టకీమని ఓపెన్ చేసే రకం
వీళ్ళ దగ్గర డబ్బులు బాగానే ఆడుతూ ఉంటాయి కొంచెం జాలీ టైపు గా చెప్పు కోవచ్చు

ఇదండీ సబ్బు కహాని