ఇది ఒరిజినల్ కవిత
దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్
గట్టిమేల్ తలపెట్టవోయ్
-
-
- పాడి పంటలు పొంగిపొరలే
- దారిలో నువు పాటు పడవోయ్
- తిండి కలిగితే కండ కలదోయ్
- కండ కలవాడేను మనిషోయ్
- పాడి పంటలు పొంగిపొరలే
-
ఈసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుపడునోయ్
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్
-
-
- దేశాభిమానం నాకు కద్దని
- వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్
- పూని ఏదైనాను ఒక మేల్
- కూర్చి జనులకు చూపవోయ్
- దేశాభిమానం నాకు కద్దని
-
చెట్టపట్టాల్ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్
-
-
- సొంత లాభం కొంత మానుకు
- పొరుగు వానికి తోడుపడవోయ్
- దేశమంటే మట్టి కాదోయ్
- దేశమంటే మనుషులోయ్
- సొంత లాభం కొంత మానుకు
- దీనికి పేరడీ
-
- బ్లాగులను ప్రేమించరన్నా
- బ్లాగులన్నవి పెంచమన్నా
- సొల్లు రాతలు కట్టిపెట్టవోయి
- మంచి రచనలు చేయవోయి
కథలు మాటలు పొంగి పొరలే
దారిలో రచనలు నువ్వు చేయ్యవోయి
నెట్టు కనెక్షన్ ఉంటే బ్లాగు కలదోయి
బ్లాగు కలవాడే బ్లాగరోయి
ఈసురోమని బ్లాగరులుంటే
బ్లాగులెట్లా బాగుపడునోయి
కలము పట్టుకొని ఓపికంతా తెచ్చుకొని
బ్లాగునిండా మంచి రచనలతో నింపాలోయి
సొంత డబ్బా కొంత మానుకొని
పక్క బ్లాగరు బ్లాగు చూడ వోయి
బ్లాగులంటే వెబ్బుసైట్లు కాదోయి
బ్లాగులంటే బ్లాగుజనుల అంతరంగమోయి
2 కామెంట్లు:
పారడీ అయినా బాగా చెప్పావ్
" సొల్లు రాతలు కట్టిపెట్టవోయి
మంచి రచనలు చేయవోయి"
"సొంత డబ్బా కొంత మానుకొని
పక్క బ్లాగరు బ్లాగు చూడ వోయి"
:)
థాంక్స్ శివ గారు
తెలుగు రత్న ని బాగా తయారు చేస్తున్నందుకు మీకు అభివందనాలు
జయభారత్
కామెంట్‌ను పోస్ట్ చేయండి