26, మార్చి 2009, గురువారం
రావమ్మ ఉగాదీ రావమ్మా
దుష్టులకు దుర్మార్గానికి విరోధివై
అన్యాయాలకు ఆసిడ్ దాడులకు విరోధివై
అవినీతికి విరోధివై
అసమానతలకు విరోధివై
ప్రజాకంటకులకు విరోధివై
ప్రజల ప్రాణాలతో ఆడుకునే ముస్కురులకు విరోధివై
రావమ్మ విరోధి ఉగాదీ రావమ్మా
తస్మ దీయులకు విరోధివై
అస్మ దీయులకు అనురాగ వారధివై
వసంత రుతు రథ చక్రాలమీద
కోయిల కూత లు చివుళ్ళ పూతల అశ్వాల మీద
ఠీవిగా రావమ్మా ఉగాదీ రావమ్మా
ఎల్ల భారతావని ని ఆమని తో నింపగా
బ్లాగరు మిత్రులందరికి
ప్రపంచ వ్యాప్త తెలుగు వారు
అందరికి ఉగాదీ పర్వదిన శుభాకాంక్షలు
మీ
జయభారత్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
4 కామెంట్లు:
కవిత బావుంది.
మీకు, మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు..!
Remove word verification option for commenting.
విరోధి నామ సంవత్సర శుభాకాంక్షలు....
కవిత బాగుంది. మీకు మీ కుటుంబానికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
thank you
madhura vani gaaru
padmarpita gaaru
athreya gaaru
థాంక్స్ మీ అందరికీ కూడా
ఇంటిల్లి పాది కి
ఉగాది ఆమని శుభాకాంక్షలు
regards
jayabharath
కామెంట్‌ను పోస్ట్ చేయండి