12, మే 2009, మంగళవారం

మామిడి టెంక ఆత్మ గోస [అనేది ఆత్మ కథ ]

మామిడి టెంక ఆత్మ గోస [అనేది ఆత్మ కథ ]
హలో ఈటర్స్
ఏంటీ ఈటర్స్ అన్నానని ఫీలవుతున్నారా
VISITORS ని VISITORS అని  

 ఫ్రెండ్స్ ని ఫ్రెండ్స్ అని అన్నట్లు

ఆబగా తినేవాళ్ళను ఈటర్స్ అంటే తప్పేముంది

లేకపోతె నామానాన నేను 

తల్లి కడుపులో బేబీ చల్లగా పడుకొన్నట్లు
నా తల్లి మామిడి పండు లోపల  

మాగిన కండ మద్య పడుకున్న నన్ను  

రక రకాలుగా బయటి కి లాగి అంటే ఒకరేమో

పండును బాగా చేతుల తీట తీరే వరకు 

బాగా పిసికి పిసికి

తరువాత అక్కసు గా కొరికి రసమంతా పీల్చి

నన్ను బయట కు లాగుతారు


కొందరేమో దుర్మార్గులు

పదునైన చాకుతో

కస కసా కిందా మీదా కోసి కండ నంతా తీసేసి

బయటి ప్రపంచం చూపిస్తారు


ఇందొందరు శాడిస్తులు

పీలరు తో నా తల్లి మాంగో తోలంతా  

వలిచి కర్కశంగా

కండంతా ఊడ బెరికి  

మరీ నన్ను చేతిలోకి తీసుకుంటారు

తీసికొని మర్యాదగా ఉంటారా

లేదు

వారి కోరల్లాంటి 32 పళ్ళతో

ఎలాబడితే అలా కొరికి నాకి చీకి

నా ప్రాణం తీసి

నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఏమాత్రం దయ లేకుండా

జాలి లేకుండా నన్ను చెత్త కుండీ లోకో

రోడ్ మీదికో నన్నావల పారవేతురే  

నర జాతికి నీతి ఉన్నదా


పైగా చీకి పారేసిన మామిడి టెంక ఫేసాని

ఎవరినైనా తిట్టడానికి బూతు గా వాడుకుంటారా

ఛీ ఛీ సిగ్గు లేని జన్మలు  

ఏం మమ్మల్ని జాగ్రత్తగా మళ్లి నాటి 

నీళ్ళు పోయచ్చుగా

మళ్లి మమ్మల్ని మొక్కలుగా 

మారే అవకాశం ఇవ్వచ్చుగా


ఉహు వాడుకొని పారేసే బుద్ది ఎక్కడికి పోతుందీ

కరివేపాకు అక్క మాకు తోడు ఈవిషయం లో


పాట

మనిషిని సమాధి చేస్తారా పాట గుర్తు తెచ్చుకోండి


టెంకను అనాధ చేస్తారా
ఇది మనుషులు చేసే పనియేనా
మీలో టెంకను చీకని వారు ఎవరో చెప్పండి
మీలో టెంకను విసరని వారూ ఎవరో చెప్పండి


నీతి
టెంక కు ఇంత సీనా నీఎంకమ్మ అని అనుకోకుండా

టెంకను విసిరి పారేయడ్డు
నాటండి మొక్కగా ఎదిగే అవకాశం ఇవ్వండి

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

haha చాలా బాగా రాసారు.. మంచి విషయం చెప్పారు
nEstam
jaajipoolu.blogspot.com