న్ని ఇలాతనం లో హేమం పిండగ
జగానికంతా సౌఖ్యం నిండగా
విరామ మెరుగక పరిశ్రమించే
బలం ధరిత్రికి బలి కావించే
కర్షక వీరుల కాయం నిండా
కాలువ కట్టే ఘర్మ జాలానికి
ఘర్మ జాలానికి ధర్మ జాలానికి
ఘర్మ జాలానికి ఖరీదు కట్టే షరాబు లేడోయ్
కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం
జాలరి పగ్గం సాలెల మగ్గం
శరీర కష్టం స్పురింప చేసే
గొడ్డలి రంపం కొడవలి నాగలి
సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు
శ్రామిక జీవన సౌందర్యానికి సమాన మైనది లేనే లేదు
మేడే సందర్భంగా
శ్రమను నమ్ముకున్న అందరికి
చెమట చుక్కలను గౌరవించే మానవతా వాదులందరికీ
మేడే శుభాకాంక్షలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి