ఎయిడ్స్ సంగతేమో గాని
ఇలాంటి
రుజాగ్రస్త వ్యవస్థ ఉన్నంత కాలం
పనికి మాలిన ఏలికలు ఉన్నంత కాలం
అజాగల స్తనాల్లాంటి ధర్మాసుపత్రులు ఉన్నంత వరకు
ప్రజారోగ్యం పారిశుద్ద్యం పట్ల నిర్లక్ష్యం ఉన్నంత వరకు
కుంభ కోణాల మీద మోజే తప్ప మానవీయ కోణం లేని
పరిపాలికలు నాయకులు ఉన్నంత కాలం
ఒక గున్యా
ఒక swine ఫ్లూ
ఒక డెంగూ
ఒక మెదడు వాపు
ఒకటేమిటి
అన్నీ వస్తాయి
అంతా మట్టే అని తెలుసు
అదీ ఒక మాయే అని తెలుసు
తెలెసీ తెలిసీ ఓటు వేసి గెలిపించుటలో
దగా దనం అందరికీ తెలుసు
జనం గతి ఇంతే
జగతి గతి ఇంతే ఏ ఏ
బ్రతికున్న మనిషికి సుఖము లేదంతే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి