26, డిసెంబర్ 2010, ఆదివారం

ఆరుద్ర గారి jokes


చంటిః ఇదిగో మమ్మీ నా ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌!!

లక్ష్మిః ఏమిట్రా! అన్నిట్లో 0 మార్కులే వచ్చాయి

చంటిః 0 నా లక్కీ నెంబర్‌ అని నీకు తెలుసుగా మమ్మీ!!!!

అందుకే అంతకు ఎక్కువ తక్కువ లేకుండా మేనేజ్ చేశా



గాంధీగారి బాల్యం గురించి చెబుతున్నాడు టీచర్‌....

వాళ్ళ టీచర్‌ చెప్పినా గాంధీ గారు కాపీ కొట్టలేదు. దీనిని బట్టి మనం గ్రహించాల్సిన నీతి ఏంటో చెప్పండి?

తెలివిగా అడిగాడు టీచర్‌.

ఆ కాలంలో టీచర్స్‌ చాలా మంచి వాళ్ళు సార్‌! ఠకీమని చెప్పాడు ఓ షార్ప్‌ కుర్రాడు.



కొత్తగా పనిలో చేరిన గుమాస్తాతో యజమాని: 'నీ పని బాగా నచ్చిందోయ్‌

, ఈ ఇరువై తీసుకొని భార్యతో సహా.. హాయిగా సినిమాకు వెళ్లిరా !!'

గుమాస్తా: సంతోషంగా, ' అలాగే సార్‌, అంతా మీ దయ!?'

యజమాని: ' ఏం, ఇంకా నిలబడ్డావే వెళ్లు.. '

గుమాస్తా: నసుగుతూ, 'మరి మీ భార్యను పిలిస్తే.....'



సుశీల: నువ్వు పెద్దయ్యాక ఏం చదువుతావు?

రాము: నేను డాక్టర్‌ చదువుతాను. దాని కోసం ఇప్పటి నుంచే జీవశాస్త్రం,

భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రాలను నేర్చుకుంటున్నా.

సుశీల: డాక్టర్‌ చదవడానికి జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం పనికి వస్తాయి. మరి, గణిత శాస్త్రమెందుకు?

రాము: వేలకు వేలు బిల్స్‌ రాసివ్వడానికి.


ఒకతను ప్రియురాలితో ' నీవు లేకుండా నేను జీ­ంచలేను, మరణమే శరణ్యం'

అని గొంతునిండా ­షాదం నింపుకుని చెప్పాడు.


ఆ అమ్మాయి నిర్ధాక్షిణ్యంగా సదరు దేవదాసు ప్రేమను తృణీకరించింది.

హాయిగా వేరే పెళ్లి చేసుకుంది. అతడు చచ్చిపోయాడు.




..-60 ఏళ్ల తర్వాత.

22, డిసెంబర్ 2010, బుధవారం

పెద్దవారిని ప్రేమించండి

ఒక 75 ఏళ్ళ పెద్దాయన ఆయన కొడుకు పార్క్ లో ఇంటి బయట లాన్ లో కూర్చున్నారు

దూరంగా ఒక పిచ్చుక వచ్చి వాలింది

అదేంటి అని అడిగాడు ఆ పెద్దాయన కొడుకుని

పిచ్చుక నాన్నా అని చెప్పాడు కొడుకు

కాసేపటికి మళ్లీ ఫాదర్ అడిగాడు అదేంటి అని

పిచ్చిక అని చెప్పాను కదా నాన్నా కొంచెం గొంతు పెంచి చెప్పాడు కొడుకు


కాసేపయ్యాక మళ్లీ అడిగాడు అదేంటి అని ఆ ఫాదర్

అది పిచ్చుక నాన్నా ఇందాక చెప్పాను కదా ఈసారి కొచెం విసుగ్గానే చెప్పాడు కొడుకు


అలా ఓ పది సార్లు అదే అదే అడిగాడు ఆ ఫాదర్ అదేంటి అని

పదోసారి ఆ కొడుకు లేచి గట్టిగా అరిచాడు

ఎందుకు నాన్న ఇలా చంపుతున్నావ్ పిచ్చుక అని చెప్పాను కదా

పెద్దాయన లేచి మౌనంగా అక్కడి నుంచి ఇంట్లోకి పోయి ఒక పాత డైరీ తెచ్చి ఒక పేజి చూపించి

పైకి వినిపించేటట్లు చదవమన్నాడు కొడుకుని


కొడుకు చదవ సాగాడు

ఇప్పుడు మా అబ్బాయికి ఆరేళ్ళు ఒక రోజు ఇద్దరం పార్క్ కు వచ్చాము

అక్కడ ఒక పిచ్చుక వాలి ఆడుకుంటోంది

మా బాబు అదేంటి నాన్నా అని అడిగాడు

పిచ్చుక బాబు అనిచెప్పాను

మళ్ళి అడిగాడు మళ్ళి చెప్పాను అలా ఒక యాభై సార్లు అడిగింటాడు

అడిగిన ప్రతిసారి చెప్పాను అడిగిన ప్రతిసారి ప్రేమగా బుగ్గ మీద ముద్దు కూడా పెట్టుకున్నాను

మురిపెం తో !!!!!!!!!!!!!

ఇంకా ఆ కొడుకు ఆపైన చదవలేక పోయాయాడు గొంతు మూగ బోయి కంటికి నీటి పొరలు అడ్డపడడం తో

[నాన్నకి అల్జేమేర్స్ వ్యాధి ఉందని ఏదైనా వెంటనే

మర్చిపోతాడని గుర్తొచ్చింది ]


నాన్న ని గట్టిగా హత్తుకొని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు


take హోం: పెద్దవారిని ప్రేమించండి వయసు సమస్యల వల్ల విసిగించినా సహనంగా ఉండండి


14, నవంబర్ 2010, ఆదివారం

సబ్బు చెప్పే సంగతులు

సబ్బు చెప్పే సంగతులు

మీరో సబ్బు కొన్న్నారనుకోండి ఓ పదిహేనురోజులో లేదా ఇరవై రోజులు వాడకానికి వచ్చిందనుకోండి

చివర్లో మిగిలి పోయే సబ్బు ముక్కను మీరేం చేస్తారు అన్న దాని బట్టి మీ బ్యాక్ గ్రౌండ్ అంచనా వెయ్యచ్చు

సీన్ ఒకటి
చివర్లో మిగిలిన ముక్కను పారవేయ్యలేక అట్లా అని వేళ్ళ సందుల్లో నుంచి మాటి మాటి కి జారి పోతున్న దాంతో సత మత మౌతా
అది పూర్తి గా కనుమరుగయ్యే దాకా వాడే వాళ్ళైతే మీరు బాగా కిందనుంచి పైకి వచ్చిన వాళ్లై ఉంటారు
వీరికి డబ్బు విలువ ,బాగా తెలుసు

సీన్ రెండు
అంతా అయిపోయాక మిగిలిన ముక్కను పార వెయ్య లేక అట్లా అని కొత్తది వాడలేక
మిగిలిన ముక్క ని కొత్త సబ్బు కు వెనకాల అంటించి అది అరిగి పోయేదాకా జాగ్రత్త గా వాడే వాళ్ళు

వీళ్ళు మద్య తరగతి జీవులు పొదుపు గా, జాగ్రత్త గా వస్తువులను వాడుతూ జీవితాన్ని వెళ్లదీసే రకం

సీన్ మూడు
సబ్బు అయిపోతూనే పారవేసి కొత్తది ట్టకీమని ఓపెన్ చేసే రకం
వీళ్ళ దగ్గర డబ్బులు బాగానే ఆడుతూ ఉంటాయి కొంచెం జాలీ టైపు గా చెప్పు కోవచ్చు

ఇదండీ సబ్బు కహాని

28, అక్టోబర్ 2010, గురువారం

ఆపరేషన్ ధియేటర్ లో సర్జరీ మద్యలో రాకూడని అనుమానాలు


ఆపరేషన్ ధియేటర్ లో సర్జరీ మద్యలో రాకూడని అనుమానాలు
[వచ్చాయంటే అయ్యవారి పని గోవిందా నే]

1.ఇంతకీ దెబ్బతిన్నది కుడి వైపునా ఎడమ వైపునా ?

2.ఇది రక్తనాళం అయితే మరి ఇందాక కట్ చేసింది ఏమై ఉంటుందబ్బా ??

3.మద్యలో కరెంటు పొతే స్టాండ్ బై ఉంటుందని జనరేటర్ కు డీజిల్ నింపమని చెప్పను
నింపారా లేదా??

4.అక్కడున్న OXYGEN సిలిండర్ నిండుదా కాదా ??]

5.పేషెంట్ పరిస్తితి బాగా లేదు ఇతనితో కన్సెంట్[అనుమతి పత్రం [ తీసుకున్నారా లేదా ??

6.నర్స్ నీ చేతిలో ఉన్నది SCOLINE అయితే మరి ఇందాక ఇచ్చిన సూది మందు ఏంటి ???

7.డాక్టర్ డాక్టర్ మీరు ఇందాక రెండు చేతులకు గ్లౌస్ తొడుక్కునారు కదా ఇప్పుడేంటి ఒకటే కనిపిస్తోంది ??

8.సిస్టర్ ఆపరేషన్ కి ముందు మోబ్స్ ,, సర్గికల్ పాడ్స్ ,కత్తెర్లు పరికరాలు అన్ని
సరిగ్గా లెక్క చూసు కున్నారా ???

సర్దార్జీ సాహసం

సర్దార్జీ సాహసం

అది ఇండో-పాక్ యుద్ధం జోరుగా సాగుతున్న రోజులు

మన సైనికులు అత్యంత సాహసోపేతంగా ఒక చోట పోరాడుతున్నారు

కాని శత్రు సైనికుల మీద పట్టు దొరకడం లేదు పైగా మీదకు చొచ్చుకొస్తున్నారు

అందరికి ఏం చెయ్యాలో తోచడం లేదు

అంతలో ఒక సింగ్ గారు ఒక దోమ తెర వంటి నిండా కప్పుకొని AK47 తీసుకొని

అరివీర భయంకరంగా ముందుకు దూకి శత్రు సేనలను చీల్చి చెండాడి

వాళ్ళను అక్కడినుండి తరిమి కొట్టాడు


అందరు హాచ్చర్య పోయి పలువిదాలు గా పొగిడి ఇంతకూ ఎలా అంత సాహసం చేసావు అనడిగారు

ఏం లేదు నాకో ఐడియా వచ్చింది దోమల్లాంటి చిన్న జీవులే దోమతెర దాటి లోపలి రాలేవు కదా
ఇంకా బుల్లెట్లు ఎలా వస్తాయి అని
అందుకే దోమతెర వంటి నిండా కప్పుకొని వాళ్ళ పనిపట్టాను అన్నాడు

అందరు మరోసారి మెచ్చుకున్నారు

కొన్నాళ్ళ తరువాత సింగ్ గారి కొడుకు కూడా ఆర్మీ లో చేరాడు
అతనికి తండ్రి కి ఎదురైనా పరిస్థి తే ఒకసారి ఎదురైంది
తన తండ్రి పాత అనుభవం గుర్తొచ్చి ఇంకా వెరైటీ గా అలోచించి ముందుకు దూకి
శత్రువులతో పోరాడాడు కాని బాగా గాయపడ్డాడు

అందరు మందలించారు ఎందుకలా చేసావ్ అని
నేనేం తప్పు చేయలేదు మా నాన్న కంటే బాగానే ఆలోచించాను అన్నాడు

ఏం ఆలోచించావు అంటే

మా నాన్న ఒన్లీ దోమ తెర కప్పుకున్నాడు
నేనేమో ఓడోమాస్ రుద్దుకొని మరీ వెళ్ళాను తెలుసా

బాగా సిన్మా లకు అలవాటు పడిన ప్రేక్షకుడు

బాగా సిన్మా లకు అలవాటు పడిన ప్రేక్షకుడు

ఇంట్లో కూడాకరెంటు పోగానే ఈలలు వేసి గోల చేసే వాడు




పంటి డాక్టర్ దగ్గరి కెళ్ళి పై పన్ను గురించి చెప్పే కంప్లైంట్

పైన బాల్కాని లో సింగల్ వరుసలో మూడోది నొప్పెడుతోంది

కాస్త టార్చి వేసి చూడండి అనేవాడు

25, అక్టోబర్ 2010, సోమవారం

దొందు దొందే

దొందు దొందే

సుబ్బారావు: ఈ మద్య నా భార్య అపద్దాలు చెబుతోందని నా కనిపిస్తోంది రా

రామారావు :ఎందుకలా

సుబ్బారావు :నిన్న రాత్రి లేటు గా ఇంటికి వచ్చిందే గాకుండా
ఎక్కడికి వెళ్ళావ్ అంటే
పనిమనిషితో సిన్మా కెళ్ళాను అని చెబుతోంది రా

రామారావు: నిజమేనేమో కనుక్కోలేకపోయావా

సుబ్బారావు: అది ఖచ్చితంగా అబద్దమే

రామారావు :ఎలా చెబుతునావ్

సుబ్బారావు : ఎందుంటే పనిమనిషితో సిన్మా కు పోయింది నేను కాబట్టి

10, అక్టోబర్ 2010, ఆదివారం

కోపిష్టి పేషెంట్


డాక్టర్: చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి

సుబ్బా రావు: డాక్టర్ ఈ మద్య నా కు కోపం కొంచెం ఎక్కువైంది

అందరి మీద ఊరికే అరుస్తూ చిన్న విషయానికే అమ్మనా బూతులు తిడుతున్నాను

ఈ రోగం కొంచెం తగ్గించండి సార్

డాక్టర్ :ఎప్పటి నుండి ఇలాగ

సుబ్బా రావు :ఇప్పుడే కదరా చెప్పాను ఈ మద్యనే అని

మళ్లి మడ్డి వెధవ లాగ జిడ్డు మొహం వేసుకొని

ఎప్పటినుండి అని అడుగుతావే you ఫూల్ ఇడియట్ రాస్కెల్ >>>>>>

డాక్టర్:?????????

8, అక్టోబర్ 2010, శుక్రవారం

ఏం తెలివి

టీచర్ :ఒరే ఆనంద్

8 ని సగం చేస్తే ఎంతరా


అడ్డంగా సగం చేస్తే సున్నా[౦]

నిలువుగా సగం చేస్తే మూడు[౩] టీచర్

2, అక్టోబర్ 2010, శనివారం

భైరవ సిన్మా


ఈ మధ్య పొరబాటున భైరవ సిన్మా చూసా

బాగా దొరికిపోయిన మాట వాస్తవం కాని కొన్ని డైలాగ్స్ బావున్నాయి మచ్చుకు కొన్ని



ENCOUNTER చేసే టప్పుడు నేను బాడీ నే చూస్తా BIODATA చూడను



అమ్మాయిలను మోసం చేయడం చాలా తప్పు
అమ్మ ను చేసి మోసం చేయాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు



అందరు సమాజం లో నుంచి స్మశానం కు వస్తారు
కాని ఈ భైరవ స్మశానం లో నుంచి సమాజం లోకి వచ్చి నోడు

నాటో పెట్టు కుంటే డైరెక్ట్ గా అక్కడికే

12, సెప్టెంబర్ 2010, ఆదివారం

ముందంతా అవేగా

సుందరి:
డియర్ మన పెళ్లైయ్యాక మీ ప్రతి కష్టం లో
నేను భాగం పంచుకుంటాను

సుబ్బారావు :కష్టాలా ఇప్పటి వరకు నాకేమి లేవు
పైగా అవంటే ఏంటో కూడా నాకు తెలియదు తెలుసా అన్నాడు ధీమాగా

నేను చెప్పింది మన పెళ్లైయ్యాక సంగతి అంది గారంగా

అమ్మ తోడు అడ్డంగా చింపుతా

ఇద్దరు వ్యక్తులు సినిమా హాలు ముందు తెగ కొట్టు కుంటున్నారు
నువ్వెంత అంటే నువ్వెంత

నీ లెవలేంటి నా లెవలేంటి
నా క్లాస్స్ ఏంటి నీ క్లాస్స్ ఏంటి
నా జోలి కొస్తే అమ్మ తోడు అడ్డంగా చింపుతా
అంటూ ఒకతను రెచ్చిపోతున్నాడు

సిన్మా కొచ్చిన అప్పారావు ఉండ బట్టలేక అడిగాడు
బాబు ఏమిటి గొడవ ఇంతకీ మీ రెవరు అని

మేమా ఈ హాల్లో గేటు కాడ టికెట్స్ చింపే వాళ్ళం అన్నాడు

మరి లెవెల్ క్లాస్ అన్నారేంటి

అదా నేనేమో పైన బాల్కాని లో చింపుతా
వీడేమో నేల క్లాస్ లో చింపుతాడు
మరి తేడా లేదా

అప్పారావు :????????

24, ఆగస్టు 2010, మంగళవారం

ugly దర్శన్ బేకార్ న్యూస్

హాయ్ this is ugly దర్శన్
బేకార్ న్యూస్ at 9 pm

హెడ్ లైన్స్
కెసిఆర్ చంద్ర బాబు ను తిట్టాడు
చంద్ర బాబు సోనియా ను దుమ్మెత్తి పోసాడు
సోనియా జగన్ మీద ఆగ్రహం చూపించింది
జగన్ మిగతా కాంగ్రెస్ వృద్ద నాయకులను ఆడి పోసుకున్నాడు
టీవీ చానెల్స్ 24 గంటలు ఇవే చూపించి జనాలకు నరకం చూపించాయి

[OFCOURSE మద్య మద్య లో DRUGS అండ్ సెక్స్ స్కాండల్ కూడా ]

రోశయ్య అన్నింటిని కులాసా గా చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు

ఈ బేవార్స్ కార్యక్రమాన్ని మీ మొహాన తగలేసిన వారు

420 బ్రదర్స్ పంజా గుట్ట

నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మా


నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మా

అన్నా చెల్లెళ్ళు
ఒకే కొమ్మ కు పూసిన పువ్వులు
ఒకే కుంటుంబం లో విరిసిన నవ్వులు
అమ్మలో మొదటి సగం నాన్న లో రెండో సగం
అన్నీ కలిసిన అన్న అనురాగం
రాఖీ రోజు కట్టే రాఖీలు
కావవి వట్టి నూలు దారాలు
అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని తెలిపే మందారాలు
కలకాలం కాల పరీక్ష కు తట్టుకుని నిలిచే బతుకు తీగలు

అందరికి రాఖీ పూర్ణిమ పండగ శుభాకాంక్షలు

22, ఆగస్టు 2010, ఆదివారం

డాక్టర్ల కి సిన్మా హీరోలు పూనితే

సింహా డాక్టర్

నర్సుల కు చీఫ్ డాక్టర్ వార్నింగ్

నేను మాట్లాడుతున్నప్పుడు మీ బుర్ర లే పని చెయ్యాలి
కాదని మరేది పని చేసినా నెక్స్ట్ డ్యూటీ మీకు ఉండదు

సర్జన్ పేషెంట్ తో ఆపరేషన్ కు ముందు

అర్థ గంటలో అయిపోయేవాడివి
నీకు నా details గురించి అవసరమంటావా

సీమ సింహం డాక్టర్
నేను కొయ్యడం [సర్జరీ ] మొదలు పెడితే ఎటునుండి ఎటు వెళ్తానో
ఎక్కడ తేలుతానో నాకే తెలియదు be కేర్ ఫుల్ విత్ me

పోకిరి డాక్టర్
ఎవరి చెయ్యి పడితే పేషెంట్ జేబు ఖాళీ అయ్యి
ఇల్లు వాకిలి అమ్ముకొని వైద్యానికి ఖర్చు పెట్టి
దివాలా తీసి మైండ్ బ్లాక్ అయ్యి జీవితం మీద విరక్తి కలిగి
పైకి పోతాడో
వాడే డాక్టర్ పండు

basha doctor
నేను ఒక్క సారి పేషెంట్ చెయ్యి పట్టుకుంటే వంద సార్లు పట్టుకున్నట్లే
అంత ఫీజు కక్కాల్సిందే

అతడు డాక్టర్

సర్జన్ ను చూడలనుకో
అంతే కాని surgery ని చూడాలనుకుంటే పోతావ్


ఫాక్షన్ డాక్టర్
నీ వార్డ్ కొచ్చా నీ ఓపి కి వచ్చా
నీ ఆపరేషన్ ధియేటర్ కూడా వచ్చా
కత్తెర్లు కత్తుల తో కాదురా కంటి చూపుతో సర్జరీ చేసి పారేస్తా


బొమ్మ రిల్లు డాక్టర్

[చీఫ్ డాక్టర్ కి జూనియర్ డాక్టర్ కి మధ్య సంభాషణ]

ఒరే కుర్ర డాక్టర్
తప్పు చేసానని నువ్వంటున్నావ్
అంటా నేనే చేసానని హెడ్ నర్సు అంటోంది
నేనేం చేసినా మీకోసమే చేశాను అది తప్పేలా అవుతుంది

అవును అంతా మీరే చేసారు
op కి వెళ్ళ మంటారు
కాని పేషెంట్ ను మీకు చెప్పకుండా పంపియద్దని వార్డ్ బాయ్ కి మీరే చెబుతారు

ధియేటర్ కి వెళ్లి ఆపరేషన్ చేయమంటారు
కాని సీనియర్ కి తెలియకుండా ఏమి చేయనీయద్దని ముందుగానే నర్సు కు ఫోన్ చేసి చెబుతారు

చివరికి జ్వరానికి ఏ సూది ఎలా వేయాలో మీరే చెబితే ఇంకా మేము నేర్చుకునేది ఎప్పుడు సర్
అంతా నవ్వుతున్నారు సార్ నా జీవితాని చూసి

సీతయ్య డాక్టర్
20 మంచాలు 30 కుర్చీలు 10 వార్డ్ బాయ్ లు
15 నర్సులు మరో పది మంది డాక్టర్ లున్న
ఈ హాస్పిటల్ లో నాకు తెలియకుండా సర్జరీ జరిగింది
ఎవరు ఎలా చేసారో నా కిప్పుడే
తెలియాలి
తెలియాలి
తెలియాలి

అగ్ని డాక్టర్
సత్యాని కి న్యాయానికి ధర్మానికి గుర్తులు
కనిపించే ఆ మూడు సింహాలైతే

ఆసుపత్రుల లో ఆరోగ్య శ్రీ లో అవినీతి ని చీల్చి చెండాడే
ఆ నాలుగో సింహమేరా ఈ డాక్టర్ అగ్ని



18, ఆగస్టు 2010, బుధవారం

మెడికల్ పద్యాలు

పెనిసిలిన్ ఇన్సులిన్ పేర్లు ఒక్కటిగా నుండను
చూడ చూడ వాటి పనులు వేరు
బాయ్స్ నందు వార్డ్ బాయ్స్ వేరయా
విశ్వదాభి రామ ఇనుకోరా రామా

గబా గబా పరు గెట్టించును డయేరియా
గజ గజ వణి కించును మలేరియా
గజ రాజును తలపించును ఫైలేరియా

గత చీకటి రాత్రి తప్పు కు గుర్తు గనేరియా

సెన్సిటివ్ డాక్టర్

మరీ సెన్సిటివ్ డాక్టర్

పేషెంట్ తన బాధలు చెప్పేటప్పుడు కళ్ళ లో నీళ్ళు తిరిగి
కర్చీఫ్ తో తుడుచు కుంటూ వినేవాడు



కొత్త గా చేరిన నర్సు

పేషెంట్ రాగానే ఏం తీసుకుంటారు
కాఫీ నా టీ నా లేక కూల్ డ్రింకా అని మర్యాద చేసేది

ఛీ ఛీ లంక

మొన్న సెహ్వాగ్ సెంచురీ కాకుండా విలన్ లా

ప్రవర్తించిన తరువాత ఇలా పిలువాలనిపించింది

శ్రీలంక కాదు ఛీ లంక ఛీ ఛీ లంక

17, ఆగస్టు 2010, మంగళవారం

మర్యాద రామక్క


మర్యాద రామక్క

vengamma: అన్నయ్య గారు రాక రాక మాఇంటికి వచ్చారు
టిఫిన్ చేసి వెళ్ళండి

rao:ఇప్పుడు వద్దమ్మా మళ్లీ నెల తరువాత పని ఉంది అప్పుడు వచ్చి
ఈ సారి తప్పకుండా చేస్తాను

అయ్యో అప్పటివరకు ఇది నిల్వ పెడితే పాడైపోతుందేమో అన్నయ్యగారు




chitkaa చిట్కా

వెంగలప్ప :పత్రికలకు పంపిన రచనలు వెనక్కి రాకుండా

ఏం చెయ్యాలో తెలియడం లేదురా

తిక్కలప్ప :ఏముంది సింపుల్
from అడ్రస్ రాయకుండా ఉంటె చాలు




బలహీనత

వెంగాలాయ్: బార్ నుంచి ఇంటికి లేట్ గా వెళ్తే
మా ఆవిడ తలుపులు తీయడం లేదురా

తిక్కలాయ్:నాకా ప్రాబ్లం లేదులే

వెంగలాయ్ :ఎలా

తిక్కలాయ్ :ఎంత రాత్రి అయినా బయటనుండి
చీరలు చారలు అని అరుస్తాను
అంతే టక్కున తలుపులు తెరచుకుంటాయి

21, జులై 2010, బుధవారం

VISIT AGAIN

కోర్ట్ లో జడ్జి దొంగ తో

ఏమోయ్ ఒకే బ్యాంకు లో రెండు సార్లు దొంగతనం చేసావంట
ఎందుకలా

మొదటి సారి చేసి వచ్చేటప్పుడు
thank you very much

please come again

అని రాసుందండి అందుకే అలా

19, జులై 2010, సోమవారం

ఆపరేషన్ joke

అప్పారావు ఓ హాస్పిటల్ లో కడుపు నొప్పి ఆపరేషన్ కోసం చేరాడు

కాసేపటికి కంగారు కంగారుగా భయం నిండిన మొహం తో పారిపోతుంటే వార్డ్ బాయ్ ఆపి
ఏంటయ్యా అలా పరుగెడుతున్నావ్ ఏంటి సంగతి ఆరా తీసాడు

ఇందాక నర్సు ఆపరేషన్ చిన్నదే సింపుల్ గానే అయిపోతుంది మరేం భయం లేదు
కొంచెం కళ్ళు మూసుకుంటే అంతా సవ్యంగానే జరిగిపోతుంది అని చెబుతోంది

మంచి మాటేగా చెప్పింది నీ కు ధైర్యం చేపడానికి అలా చేఇప్పింది
దీంట్లో భయపడేదేముంది


కాని నర్సు చెప్పింది నాకు కాదు సార్ డాక్టర్ తో

15, జులై 2010, గురువారం

చిలుక పోయి అక్టోపాస్ వచ్చే డాం డాం డాం


చిలుక పోయి అక్టోపాస్ వచ్చే డాం డాం డాం





13, జులై 2010, మంగళవారం

CALLER ID CHANGES

పెళ్లి కి ముందు హలో హనీ

పెళ్లి అయిన కొత్త లో లో మై లైఫ్

AFTER ONE YEAR మై WIFE

AFTER FIVE YEARS FROM HOME

AFTER 7 YEARS KNIFE IS CALLING

AFTER 10 YEARS WRONG కాల్

రోశయ్య కు నచ్చని ఒకే ఒక పదం

ఏ భాష లో నైనా

రోశయ్య కు నచ్చని ఒకే ఒక పదం ఓదార్పు

ఇచ్చట ఓదార్పు లభించును

ఇచ్చట ఓదార్పు లభించును

రోశయ్య కు ఓదార్పు లబ్బించు చోటు

10 జనపథ్ సోనియా నివాసం

చంద్రబాబు కు ఓదార్పు లబ్బించు

CM సీట్ వచ్చినప్పుడు


జగన్ కు ఓదార్పు లబ్బించు చోటు

జనం లో



కెసిఆర్ కు ఓదార్పు లబ్బించు చోటు

ఉపఎన్నికల్లో [గెలిస్తే ]



చిరు కు ఓదార్పు లబ్బించు చోటు

congress tho లోపాయికారీ ఒప్పందం లో


కాని జనాని కి మాత్రం ఓదార్పు ఇచ్చే వాళ్ళే లేరు పాపం

6, జూన్ 2010, ఆదివారం

మద్యాంద్ర ప్రదేశ్






ఎవరు వీళ్ళంతా
దేనికి ఈ క్యూ లైను
దేవుని దర్శనానికా
ఏదైనా మంచి పని చేయడానికా

దీన్నుంచి మనమేం నేర్చుకోవాలి
ఎక్కడి కి పోతోంది మన రాష్ట్రం??








27, మే 2010, గురువారం

ప్రశ్న జవాబు

టీచర్ :ఒరే రాము
నీకు తెలిసిన క్రూర జంతువుల పేర్లు ఓ పది చెప్పు చూద్దాం
రాము :ఐదు పులులు ఐదు సింహాలు టీచర్

IIT ర్యాంకులు

ఒకటి రెండు ఆరు ఇరవై ఒకటి ఇరవై ఆరు
ముప్పైఆరు ముప్పై తొమ్మిది నలబై ఒకటి నలబై ఆరు
యాబై ఒకటి యాబై మూడు యాబై తొమ్మిది
అరవై అరవై ఆరు అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై మూడు


ఒకటి రెండు ఆరు ఇరవై ఒకటి ఇరవై ఆరు
ముప్పైఆరు ముప్పై తొమ్మిది నలబై ఒకటి నలబై ఆరు
యాబై ఒకటి యాబై మూడు యాబై తొమ్మిది
అరవై అరవై ఆరు అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై మూడు


ఒకటి రెండు ఆరు ఇరవై ఒకటి ఇరవై ఆరు
ముప్పైఆరు ముప్పై తొమ్మిది నలబై ఒకటి నలబై ఆరు
యాబై ఒకటి యాబై మూడు యాబై తొమ్మిది
అరవై అరవై ఆరు అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై మూడు


ఒకటి రెండు ఆరు ఇరవై ఒకటి ఇరవై ఆరు
ముప్పైఆరు ముప్పై తొమ్మిది నలబై ఒకటి నలబై ఆరు
యాబై ఒకటి యాబై మూడు యాబై తొమ్మిది
అరవై అరవై ఆరు అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై మూడు


ఏమిటీ సుత్తి అనుకుంటున్నారా
గత రెండు రోజులుగా IIT ర్యాంకులు వచ్చాక
టీవీ లో మేము NO ONE అంటే మేమే NO ONE అని
ఇంకా
ఫలితాలంటే మావే మాకు తిరుగులేదు అని ఒకరిని మించి ఒకరు
ఊదరగొడుతూ ఒకటే చెవుల్లో హోరు
టీవీ చూడాలంటేనే భయంగా ఉంది

9, మే 2010, ఆదివారం

తేడా

తేడా

సన్యాసికి సన్నాసి కి తేడా ఏంది గురువా


అన్నీ వదిలేసినా వాడు సన్యాసి నాయనా

అందరూ వదిలేసిన వాడు సన్నాసి అర్థమైందా

అమ్మ అన్నది ఒక కమ్మని మాట



అమ్మ అన్నది ఒక కమ్మని మాట
ఎన్నో తీయదనాల మూట

మాతృమూర్తు లందరికి వేల వేల వందనాలతో శుభాకాంక్షలు

ఫోటో లు మాట్లాడితే









4, మే 2010, మంగళవారం

వెంగలప్ప ఎంక్వయిరీ


వెంగలప్ప ఎంక్వయిరీ

సింహాద్రి express ఎంతకి వస్తుంది

9 గంటలకి

ఈస్ట్ coast ఎంతకి వస్తుంది

9 గంటలకి

రత్నాచల్ ఎంతకి వస్తుంది
10 గంటలకి


హౌరా express ఎంతకి వస్తుంది

11 గంటలకి

ఇంతకీ తమరు ఎక్కడి కి వెళ్ళాలి సార్

ఎక్కడికి లేదు జస్ట్
platform దాటి అవతలికి వెళ్ళాలి అంతే

25, ఏప్రిల్ 2010, ఆదివారం

FUNNY SMS

FUNNY SMS

అముల్ బేబీ లా ఉన్న కొడుకు ఫాదర్ తో

నాన్నా నాన్నా నేను ఎందుకు ఇంత లావుగా పుట్టాను


తండ్రి: చాలాకాలం క్రితం ఒక ఊర పందిని బస్సు ఆక్సిడెంట్ నుంచి కాపాడాను

అది వెళ్తూ వెళ్తూ చచ్చి నీకడుపున పుట్టి ఋణం తీర్చు కుంటా లే అని వెళ్లి పోయింది
అది ఇలా నిజమైంది అన్నాడు నిర్వేదం తో నిట్టూర్పు వదుల్తూ





టీవీ యాంకర్ ఆట కావాలా పాట కావాలా లైవ్ ప్రోగ్రాం లో

హలో ఎవరదీ అవతల ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు ?
కూకట్ పల్లి నుంచి
KUKAT పల్లి లో ఎక్కడుంటారు
పోలేరమ్మ అపార్ట్మెంట్స్ లో

అవునా నేను కూడా అందులోనే ఉండేది ఏ ఫ్లాట్ మీది

420 లో

అర్రే నేను కూడా అందులోనే ఉండేది ఎవరు మీరు

ఒసేవ్ నేను నీ మొగున్నే KEY ఎక్కడ పెట్టి చచ్చావో చెప్పి చావు