30, నవంబర్ 2008, ఆదివారం
వీరులారా మీకు వందనాలు
ఆవేదన నిండని మనసు లేదు
రగిలిపోని గుండె లేదు
తలచి తలచి కుమిలిపోని మనిషి లేదు
బొంబాయి బ్లాస్ట్ లో వీరమరణం చెందిన జవాన్లకు అశ్రు నివాళి
వీరులారా వీరులారా మీకు వందనం
మిమ్మల్ని కన్న భారత భూమి ధన్యురాలు
ఈ జాతి మిమ్ములను మరవదు
27, నవంబర్ 2008, గురువారం
చిత్రమైన కాంబినేషన్స్
తెలివైన అబ్బాయ్ +తెలివైన అమ్మాయి =రొమాన్స్
తెలివైన అబ్బాయి +తెలివితక్కువ అమ్మాయి =కడుపు
తెలివైన అమ్మాయి+తెలివితక్కువ అబ్బాయి =వ్యవహారం [ఎఫైర్ ]
తెలివితక్కువ అబ్బాయి+తెలివితక్కువ అమ్మాయి =పెళ్లి
25, నవంబర్ 2008, మంగళవారం
కారుకూతలు
"కారుకూతలు "ఎన్నికల కాలానికి గుర్తు {బొందలో పెడతా ,ఘోరి కడతా , తొడలు గొట్టుడు , మీసాలు మేలేయుడు, గాలిలోకి ముద్దులు విసురుడు ,రౌడీలకు రౌడిలనుడు ,exetra
పోత్తుపోడుపు
ఆ పార్టీ పొత్తు ఈ పార్టీ తో
ఈ రెండు పార్టీ ల పొత్తు ఇంకో రెండు పార్టీలతో
ఆ రెండు మరో పన్నెండుతో
ఎంతసేపు ఈ పొత్తుల యావే తప్ప
మరి ఈ పార్టీ లన్ని ప్రజలతో వారి కష్టసుఖాలతో పొత్తు పెట్టుకునేదేన్నడ్దో
24, నవంబర్ 2008, సోమవారం
మంత్రిగారి కంపు
ఎంత ఫినాయిలు తెచ్చి ఎంతలా కడిగిన
మారెప్ప నోరు కంపు కంపెగాని ఇంపుగాదే
విలువలు లేని నేతను కొట్టినా తిట్టినా లాభమేమి
విశ్వదాభి రామా ఇదే తెలుగు ప్రజల కర్మమా
ఒరిజినల్
ఎలుకతోకను తెచ్చి యేడాది ఉతికిన
నలుపునలుపెగాని తెలుపుగాదే
కోయ్యబోమ్మని తెచ్చి కొట్టినా తిట్టినా పలుకునా
విశ్వదాభిరామ వినురవేమా
ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడమంటే ముష్టి వాడికి భగవద్గీత ఇవ్వడమే అని నోరు
పారేసుకుని తెలంగాణా ప్రజల మనసు నొప్పించిన మంత్రి మారెప్పకు చీత్కరాలతో
21, నవంబర్ 2008, శుక్రవారం
ఈ మద్య చదివిన జోక్
కొనాళ్ళకి ఆ హోటల్ ప్రోప్రైటార్ కూతుర్ని లవ్ చేసాడు
ఆ యజమాని సర్వారావు ని పిలిచి నెలకు ఎంత సంపాదిస్తావ్ అని అడిగాడు
నెలకు 50 ౦౦౦ చెప్పాడు సర్వారావు
మరి నాకుతురికి నెలకే అరవై వేలిస్తా చేతిఖర్చులకి తెలుసా అడిగాడు యజమాని
తెలుసు సార్ అదికూడా కలుపుకొనే చెప్పాను చిన్నగా నసిగాడు సర్వారావు!!!!
19, నవంబర్ 2008, బుధవారం
ఎఫ్ టీవీ {ఫ్యాషన్ టీవీ}
కండలతో కంతలు పడిన దుస్తులతో అబ్బాయిలు
పంచరంగుల ఫోకసింగులలో పిల్లినడకలు{కాట్ వాక్}
చింపిరిలోనే చిదానందమంటే ఇదే కాబోలు
జోక్
అప్పుడప్పుడు ఎవరిదో పేరు కలవరిస్తున్నాడు
బంధవు ఎవరో అడిగాడు ఎవర్నండి అడుగుతున్నాడు కొడుకునా
కాదండి దొంగనాకొడుకు గురించి {అప్పు తీసుకొని ఎగ్గొట్టినవాడు }
చిన్నగా వివరించారు ఎవరో !!!!!!
బళ్ళు ఓడలు
ఇప్పుడు పరిస్తితి
హోల్ ఇన్ దట్ వాల్ {పెద్ద కంత అని కవి హృదయం }
లెక్కలు
భార్యకు ముడుపుటలా తిండి పెట్టాలంటే ఏడు చెరువుల నీళ్లు తాగాల్సి వస్తుందని
పెళ్ళికొడుకు కు ముందస్తు వార్నింగ్
సినిమా సామెతలు
చేపలు ఒడ్డున పడితే మనం తింటాం
మనం నీళ్ళలో పడితే చేపలు మనల్ని తింటాయి
ఇంట్లోవాడిలా పనిచేసేవాడు
బయటివాడులా తిండి తినేవాడు ఎక్కడా దొరకడు
ఓ పోలిటిసియన్ తన పియే తో
ఒరే బినామి గురించి విన్నాము గాని
సునామి గురించి వినలేదే
18, నవంబర్ 2008, మంగళవారం
హామీలు నెరవేర్చే పార్టీలు గాని
తిట్లు శాపనార్థాలు లేని అసెంబ్లీ సమావేశాలుగాని
బూతుమాటలు లేని తెలుగు సినిమాలు గాని
అవినీతి అంటని పాలిటిక్స్ గాని
ఎందెందు వెతకి చూసినా కానరావు గదా సుమతీ
అల్లుని మంచితనంబును
గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్
బొల్లున దంచిన బియ్యముఁ
దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!
తాత్పర్యం: అల్లుడి మంచితనం, గొల్లవాని పాండిత్యజ్ఞానం, ఆడదానియందు నిజం, పొల్లు ధాన్యములో బియ్యం, తెల్లని కాకులూ లోకములో ఉండవునీతి పలుకులు
జబ్బులతో కార్పొరేట్ వైద్యానికి
దెబ్బలతో పోలీస్ స్టేషన్లకు
డబ్బులతో అధికవడ్డి కి ఆశపడి కోపరేట్ బ్యాంకులకు
అర్జీలతో ప్రభుత్వ ఆఫీసులకు వెల్లరాదురా సుమతీ
ఒరిజినల్
ఉదకము ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదవుకడ నున్న వృషభము
జదువని యా నీచుకడకుఁ జనకుర సుమతీ!
తాత్పర్యం: నీరు తాగే గుర్రం దగ్గరకు, కొవ్వుతో విజృంభించే మదపుటేనుగు దగ్గరకు, ఆవు దగ్గర ఉన్నఆబోతు వద్దకు, విద్యనేర్వని అల్పుని దగ్గరకు వెళ్లకుము.
వెన్నుపోటు బావ---- బావ మరదులు
విపరీతముగాదు వివరింపంగా
వెన్నుపోటు బావకు గతము తలచకుండా
ఉపకారము చేయుట నందమూరి వారికే చెల్లు సుమతీ
ఉపకారికి నుపకారము
విపరీతముగాదు సేయ వివరింపంగా
నుపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ! కి పేరడి గా
17, నవంబర్ 2008, సోమవారం
ఎవరి మేత వారిది
కాంపౌండ్ వాలే కబ్జా చేసినట్లు
ప్రజల భూమిని ప్రభుత్వమే సెజ్ ల పేరిట కాజేస్తే
దిక్కులే ని వారికి ఎవరో దిక్కు ?
అపాత్ర దానం
రాజుల సొమ్ము రాళ్ళపాలు
ప్రజల భూమి ప్రభత్వం సెజ్ ల పాలు చేసినట్లు
జబారే మాట చద్దిఅన్నంముటారా
కాలానుగుణ మార్పులు
గయ్యాళి భార్య మొగుడు సన్యాసి అయినట్లు
నటుడు ముదిర్తే రాజకీయవేత్త అవునయా
జబారేమాట చద్ది అన్నం ముటయా
వేమన పేరడి
చూడ చూడ వాటి పనులు వేరు
నటులయండు పొలిటికల్ నటులు వేరయా
జబారే మాట చద్దిఅన్నపు మూటయా
చేత చిక్కిన జాబిల్లి
భూమిని ఎప్పుడు వదులునో ధరల శని గ్రహం
అది రాజకీయ సైంటిస్ట్ ల అనుగ్రహం
జభారే మాట చద్దిఅన్నపు మూట
విజయవంతంగా జాబిల్లి ని చేరిన ఇస్రో కి అభినందనలు
12, నవంబర్ 2008, బుధవారం
వెంగలాయ్
ముందు ఒక కాలు ను కట్ చేసి పరుగెత్తు అన్నాడు అది పరుగుతీసింది
రెండోది మూడోది కాలు కూడా తీసి ఇప్పుడు పరుగెత్తు అన్నాడు గెంతుతూ పరుగెత్తింది
నాలుగో కాలు తీసి ఇప్పుడు పో చూద్దాం అన్నాడు
ఫైనల్ గా ఇలా రిపోర్ట్ రాసుకున్నాడు
అన్ని కాళ్ళు తీసిన తర్వాత బొద్దింక "చేవిటిమాలోకం "అవుతుంది
కొన్ని సినిమా బిట్స్
ఒరే నువ్వేమో తారుడబ్బాలా ఉన్నావు పిల్లేమో పౌడర్ డబ్బిలా ఉందికదా
పాపేమో వెన్నెల్లో ఆడపిల్ల వీడేమో చీకట్లో కోడిపిల్ల లా ఉన్నాడు
సామెతలు
నెంబర్ లేని ఫోను, పేరులేని మనిషి లోకంలో ఉండదు
అమ్మేమో వేపాకు పెళ్ళాం మైసూరు పాకు
ఊరికే ఉంటే ఊరా పేరా
అవకాశం విలువ వచ్చేటప్పుడుకంటే వేల్లేతప్పుడే బాగా తెలుస్తుంది
మనిషి స్టైల్ గా ఉండడం కంటే చేసే పని స్టైల్ గా ఉండాలి
అంబానిని అర్దరుపాయి అప్పు అడిగినట్లు
కనులు చూసే చోటికంత కాళ్ళు పోరాదు మనసు పోయే చోటికంతా మనిషి పోరాదు
బంధు గుండు సామగ్రి [పద ప్రయోగం ]
11, నవంబర్ 2008, మంగళవారం
కూడికలు
రాజు: ఐ లవ్ యు =యు లవ్ యువర్ డాటర్ =యువర్ డాటర్ లవ్ మి
ఎలా ఉంది సర్
టీచర్:???@@@@### *******
కొత్త కంగారు లోకం
ఈ టైటిల్ ఆస్ట్రేలియా ఘోర పరాజయానికి ఈనాడు డైలీ పెట్టిన పేరు
ఎంతో గమ్మతుగా అనిపిస్తే మీకు చూపించాలని ఇక్కడ పెడుతున్నాను
బై ది బై టీం ఇండియా క్రికెట్ లో సిరీస్ గెలిచినందుకు అభినందనలు
రామకోటి జోకు
చిన్న :ఎందుకమ్మా రోజు వెలతానుగా
అమ్మ :ఈరోజు నుండి తాత రామకోటి రాయడం మొదలెట్టారురా
డిస్త్రుబ్ చేస్తే ముర్డరై పోగలవు జాగర్త
{రామ కోటి కి అడ్డుపడ్డాడని మొద్దు శీను ముర్డర్ నేపథ్యంలో}
9, నవంబర్ 2008, ఆదివారం
జోకు
డాక్టర్:ఈమందు ఓ ఆర్నెల్లు వాడమ్మా సరిపోతుంది
అండాలమ్మ: వాడితే పోతాయా డాక్టర్
డాక్టర్:పోవుగాని నొప్పులు అలవాటైపోతాయి
గున్యా---గజని
నీచుట్టే తిరుగుతున్నది
పగటి దోమ కాటుతో కీళ్ళ నొప్పి భాధతో
ఆసుపత్రి పాలైపోయానే
బాలయ్య-చికున్ గున్యా దోమ
మీఊరి మురికిగుంతలోకి వచ్చా
మీ ఇంటిముందుకు వచ్చా
మీ నట్టింటిలోకివచ్చా నీ దోమతెరలోకిదూరా
నువ్వు మగాడివే అయితే నీచర్మం మందమే అయితే
నా కాటు కాచుకో మరి
కత్తులతోకాదురా కీళ్ళ నొప్పులతో చంపుతా
హైకు
కనురెప్పల పందిరి కింద
కనులు వేసే కలల ముగ్గులు
వెన్నెల రాత్రి మురిసి ముద్దాడే సిగ్గుల బుగ్గలు
8, నవంబర్ 2008, శనివారం
మాడరన్ భాదలు
చేతి లోని సెల్లు చెవిలోన వాకమాన్
పొట్టలోని గ్యాస్ కాలిలోని ఆనె
కంటిలోని కాంటాక్ట్ లెన్స్ వేలు కు వచ్చిన గోరుచుట్టు
ఇంటిలోన ఎడతెగక సాగుతున్న టీవీ సీరియల్ పోరు ఇంతింత కాదయా
నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినatteనయా