6, ఏప్రిల్ 2009, సోమవారం

సామోతలు

“సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్టు.

నాయకుడు నాయకుడు రాసుకుంటే హామీలు రాలినట్లు

“పెళ్ళాం బెల్లం, తల్లి అల్లం”

ఓటు బెల్లం ఓటరేమో అల్లం  

“కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్టు”

కొత్తగా రోడ్ షో మొదలుబెట్టిన నాయకుడు టైం ఎరగనట్లు


“తాళము వేసితిని, గొళ్ళెము మరచితిని”

ఓటు వేసితిని ముద్ర వేయడం మరచితిని

హామీలు ఇచ్చితిని అమలు చేయడం మరచితిని


ఎద్దు ఈనింది అంటే దూడను కట్టేయ మన్నాడట

మానిఫెస్టో రిలీస్ చేసాం ఇక అధికారం మనదే అన్నట్లు

"ఆయనే ఉంటే బార్బెర్ ఎందుకనీ "

B ఫారమే ఉంటే రెబల్ గా నామినేషన్ వేయడమెందుకూ

1 కామెంట్‌:

Shashank చెప్పారు...

bAgundi lAtest sAmetalu...