[చేపా చేపా ఎందుకు ఎండ లేదు కు పేరడి]
ఒక ఊర్లో ఒక నాయకుడు
ఆయన కింద కొంత మంది అనుచరులు
ఆయన ఒకసారి ఎన్నికల్లో పోటి చేసాడు
బాగా డబ్బులు సారాయి మస్తుగా పంచాడు
నాదే గెలుపని ధీమాగా ఉన్నాడు
రిజల్ట్స్ వచ్చాయి
అతగాడికి రెండో మూడో మంచి ఓట్లు వచ్చాయి
మిగతావన్నీ చెల్లని ఓట్లే ;నాయకుడు షాక్ తిన్నాడు
మెల్ల గా తేరుకొని అనుచరులను అడిగాడు
ఎందుకు ఇలా జరిగిందని శోధన మొదలు పెట్టాడు
ఎందుకర్రా మనకు చెల్లని ఓట్లు వచ్చాయి అని
ఏమో సార్ మన ఏజెంట్ల ను అడగండి అన్నారు
ఎజేంటూ ఎజేంటూ మన ఓట్లు ఎందుకు చెల్ల లేదు అని అడిగారు
ఏమోసార్ ఓటర్ల నడగండి అన్నాడు ఏజెంటు
ఓటరన్నా ఓటరన్నా నీకు బాగా మందు విందు చేసాము కదా
ఎందుకు ఓటు చెల్ల లేదు అనడిగారు
ఏమో సార్ నేనైతే ఓటు వేసాను ఓటింగ్ మిషన్ ని అడగండి అన్నాడు
ఓటింగ్ మిషన్ ఓటింగ్ మిషన్ మా ఓట్లు ఎందు కు చెల్ల లేదు అనడిగారు
అంతా
ఓటింగ్ మిషన్ చెప్పింది
నా బంగారు బటన్లను తాగొచ్చి అన్ని వేళ్ళతో అన్ని
గుర్తులూ ఒక్కసారిగా
వత్తితే ఓటు చెల్ల కుండా చేయనా మరీ అని
నీతి :తాగి ,ప్రలోభాలకు లొంగి విలువైన ఓటు ను వృధా చేయరాదు
2 కామెంట్‌లు:
హ హ హ చాల బాగుందండి gud one
హ!..హ! చాలా బాగుందండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి