నక్క పుట్టి నాలుగువారాలు కాలేదు ఇంత గాలి వాన ఎప్పుడూ
ఎరగనమ్మా అందట
పార్టీ పెట్టి నాలుగు నెలలు కాలేదు అన్ని సీట్లు మావే అన్నాడట ఓ లీడర్
ఐ న్యూస్ స్లోగన్ --
చెప్పాల్సింది చాలా ఉంది చూడాల్సింది మిగిలే ఉంది
చెప్పాల్సిన సోది చాలా ఉంది చూపించాల్సిన దరిద్రం మిగిలే ఉంది
పోటీ చేసే అభ్యర్థి మనోగతం
పంచాల్సిన డబ్బులు చాలా ఉన్నాయి పోయాల్సిన మందు మిగిలే ఉంది
మంత్రి
అమ్మాల్సిన భూములు చాలా ఉన్నాయి కబ్జా చేయాల్సినవి మిగిలే ఉన్నాయి
కాంట్రా క్టార్
కట్టాల్సిన ప్రాజెక్టులు చాలాఉన్నాయి దోచాల్సిన టెండర్ లు మిగిలే ఉన్నాయి
పార్టీ లీడర్
ఇవ్వాల్సిన హామీలు చాలా ఉన్నాయి చెప్పాల్సిన సొల్లు కబుర్లు మిగిలే ఉన్నాయి
సోనియా
చెప్పాల్సిన అపద్దాలు చాలా ఉన్నాయి --ఇవ్వాల్సిన తెలంగాణా మిగిలే ఉంది
చంద్ర బాబు
చెప్పాల్సిన హామీలు చాలా చెప్పాము - రావాల్సిన అధికారం మిగిలేఉంది
రాజ శేఖర్ రెడ్డి
అనుభ వించాల్సింది చాలా ఉంది == రాజీవ్ దోచుకో ---దాచుకో పథకం మిగిలే ఉంది
KCR
చెప్పాల్సిన మాటలు గడువులు చాలా చెప్పాము -- తేవాల్సిన తెలంగాణా
మిగిలేఉంది
కాంగ్రెస్స్ అసమ్మ దీయులు
[YSR గురించి ]
తిట్టాల్సిన తిట్లు చాలా ఉన్నాయి -- మోయాల్సిన చాడీలు మిగిలే
ఉన్నాయి [సోనియా మేడం దగ్గరకు]
3 కామెంట్‌లు:
మీ బిరియానీ బాగుంది. ఐన్యూస్ వాడి స్లోగన్ను బాగా ఎక్కుపెట్టారు.
చాలా బాగున్నాయి. సూపర్.
thanks chaduvari gaaru and bhavani gaaru
jayabharath
కామెంట్‌ను పోస్ట్ చేయండి