అరవిచ్చిన పూలతోట సిగలో మందారం లా
మనసైన వాని మదిలో మరువం లా
కుర్రకారు మదిలో ఉరకలేసిన పరువం లా
పైర గాలికి తలలు ఊపే పాల తీగ లతలా
కొమ్మల మద్య కువ కువ లాడే పిట్టలా
ఊరి బయట మోగిన గుడి గంట లా
ఆమని లో విరగ పండిన తొలి పంట లా
కళ్ళ కు కనికట్టు చేసి
కాళ్ళ కు బంధనాలు వేసి
మనసుకు మోళీ కట్టిన బొమ్మాలీ
ఎవరమ్మా ఈ కొమ్మ ?
వేసవిలో విరహ దాహం తీర్చిన పూల రెమ్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి